Shuru
Apke Nagar Ki App…
రంపచోడవరం: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి శనివారం నల్లగొండ ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వంటగది పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సరుకుల నాణ్యతలో రాజీ పడితే గుత్తేదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె, విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచాలని సిబ్బందికి సూచించారు.
Shyam
రంపచోడవరం: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి శనివారం నల్లగొండ ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వంటగది పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సరుకుల నాణ్యతలో రాజీ పడితే గుత్తేదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె, విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచాలని సిబ్బందికి సూచించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- monthly Passive income Start Cheyandi1
- విజయనగరం జిల్లా, వంగర, 14-04-2026. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని వంగర మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ. సురేష్ ముఖర్జీ, ఎంపీటీసీ ప్రతినిధి కనగల పారి నాయుడు, వంగర అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సత్యం మాస్టర్, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు వై.వాసు నాయుడు, మండల RTI విభాగం అధ్యక్షుడు దేవకివాడ దుర్గఅప్పల నాయుడు, వివేక్ మాస్టర్ మైండ్ ప్రిన్సిపాల్ బెవర ఈశ్వర రావు, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ. సురేష్ ముఖర్జీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం.డాక్టర్ అంబేద్కర్ గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను మన సమాజంలో స్థాపించడానికి ఆయన జీవితాంతం పోరాడారు.చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, ఆయన విద్యను ఆయుధంగా చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషి అపారమైనది.ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మన దేశ భవిష్యత్తును నిర్మించాయి. అంబేద్కర్ గారు మనకు చెప్పిన ముఖ్యమైన సందేశం శిక్షణ పొందండి,సంఘటితమవండి,పోరాడండి.ఈ మాటలు ప్రతి ఒక్కరికీ ప్రేరణమనమందరం ఆయన ఆశయాలను అనుసరించి సమానత్వం, న్యాయం ఉన్న సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి.చివరిగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి నా ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహనీయునికి ఆశయ సాధనకై ఆయన ఆశయాలు సాధిద్దాం.2
- కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ, రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి, అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది. ఆటో అప్పుడే అదే రోడ్డుపై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది. అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశారు.1
- పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.1
- రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కురుపాం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో బిజెపి నాయకులు బోటు అనిల్ కుమార్, సీనియర్ నాయకులు నడుకూరు దూళికేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు దూలకేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు నేడు, ఏప్రిల్ 14. దేశ నిర్మాణంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన అలుపెరగని కృషికి గుర్తుగా జరుపుకునే అంబేద్కర్ జయంతి నేడు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ గెంబలి ప్రదీప్ కుమార్, ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ ఎన్ పురం శ్రీనివాసరావు, అద్దేపల్లి నిర్మల పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు1
- శ్రీకాకుళం, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల తలరాతను మార్చిన మహాశక్తి అని కొనియాడారు. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆయన, చదువుతోనే ఏదైనా సాధ్యమని నిరూపించారన్నారు. అందుకే ఎన్టీ రామారావు హయాంలో ఎస్సీ, బీసీ వర్గాల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి విద్యా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. మహిళా హక్కుల కోసం అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో రక్షణలు కల్పించారని, దానికి కొనసాగింపుగా త్వరలోనే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోందని తెలిపారు. జిల్లాలోని సంజీవయ్య పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని, హాస్టల్ పాఠశాలల్లో మౌలిక వసతులు, స్వచ్ఛమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చట్టాలు సక్రమంగా అమలు జరిగినప్పుడే సామాన్యులకు మేలు: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు ఎన్ని గొప్ప హక్కులు కల్పించినా, వాటిని అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అనేక హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న కాలంలోనే అంబేద్కర్ కు 'భారతరత్న' దక్కిందని, ఆయన స్ఫూర్తితోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరి రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే ఆత్మాభిమానం, వ్యక్తి వికాసం సాధ్యమని, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, చౌదరి బాబ్జి, రమణ మాదిగ, బొడ్డేపల్లి నరసింహులు మాదారపు వెంకటేష్, దుర్గారావు, మన్మధ, కొవ్వాడ సుశీల, రాయి వేణు, గేదెల రమణమూర్తి, టైక్వాండో శ్రీను, పలువురు నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- దళిత, నిమ్నకులాలు ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంభేడ్కర్ అని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్ అన్నారు. ఆయన 135.వ.జయంతి సందర్భంగా మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలో ఆయన శిలావిగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. నేటికి ఏనాటికైనా ఆయన రచించిన రాజ్యాంగం శిలా శాసనమని అన్నారు. ప్రజాసంఘాలు నేతలు పాల్గొన్నారు.8
- పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1