logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్ గా ఇమ్రాన్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని జమా మసీద్‌లో ముస్లిం మత పెద్దలు,ముస్లిం కమిటీ సమావేశం నిర్వహించి సెంట్రల్ ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ ఇమ్రాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న మహమ్మద్ అలీ గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో పాటు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మత పెద్దలు ఆయనను తొలగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్‌ను మత పెద్దలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ భారీ, జనరల్ సెక్రటరీ హాజా నయుముద్దీన్ మంజూర్, అబ్దుల్ సజీద్, అఖీల్ ఉద్దిన్ జావీద్, పట్వారి సాజిద్, పట్వారి ముజాహిద్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్లు కమల్, అయూబ్ ఖాన్, అఫ్రోజ్, అహ్లే హదీస్ జగిత్యాల కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్, జమాతే ఇస్లామియా నాయకులు ఈమాదుద్దీన్, తౌహీద్ అలీ, పాత్రికేయులు మోసిక్, హైదర్ అలీ, అదిల్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

on 14 March
user_Boga naga bhushanam
Boga naga bhushanam
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
on 14 March
07e7c43c-d2e3-4cf5-8325-8f5897d394b3

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్ గా ఇమ్రాన్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని జమా మసీద్‌లో ముస్లిం మత పెద్దలు,ముస్లిం కమిటీ సమావేశం నిర్వహించి సెంట్రల్ ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ ఇమ్రాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న మహమ్మద్ అలీ గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో పాటు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మత పెద్దలు ఆయనను తొలగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్‌ను మత పెద్దలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ భారీ, జనరల్ సెక్రటరీ హాజా నయుముద్దీన్ మంజూర్, అబ్దుల్ సజీద్, అఖీల్ ఉద్దిన్ జావీద్, పట్వారి సాజిద్, పట్వారి ముజాహిద్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్లు కమల్, అయూబ్ ఖాన్, అఫ్రోజ్, అహ్లే హదీస్ జగిత్యాల కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్, జమాతే ఇస్లామియా నాయకులు ఈమాదుద్దీన్, తౌహీద్ అలీ, పాత్రికేయులు మోసిక్, హైదర్ అలీ, అదిల్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

  • user_User6820
    User6820
    Gambhiraopet, Rajanna Sircilla
    😂
    on 17 March
More news from తెలంగాణ and nearby areas
  • గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_ATUKULA PREM KUMAR
    ATUKULA PREM KUMAR
    జగిత్యాల రూరల్, జగిత్యాల, తెలంగాణ•
    13 min ago
  • జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం  సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.
    2
    జగిత్యాల :
జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం  సన్నాహక సమావేశం నిర్వహించారు.
గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు.
నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు.
రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది.
రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు.
గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి..
విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ,
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • మెట్‌పల్లి, ఏప్రిల్‌ 13: మెట్‌పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్‌టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    మెట్‌పల్లి, ఏప్రిల్‌ 13: మెట్‌పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్‌టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..
    1
    భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని  మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ  ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని  అధికారులను  ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
  • *పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్* నిజామాబాద్, ఏప్రిల్ 13 : ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాలలోనూ పూర్తి స్థాయిలో హాజరు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ సత్యనారాయణ ఉన్నారు. --------------------------
    1
    *పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్* 
నిజామాబాద్, ఏప్రిల్ 13 : ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాలలోనూ పూర్తి స్థాయిలో హాజరు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ సత్యనారాయణ ఉన్నారు. 
--------------------------
    user_Bachagoni Shivani
    Bachagoni Shivani
    భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • Post by Vedam chamdu Vedam
    1
    Post by Vedam chamdu Vedam
    user_Vedam chamdu Vedam
    Vedam chamdu Vedam
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన ఖాతాదారులు తమ డబ్బులు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కథలాపూర్, రాయికల్, కొడిమ్యాల, గొల్లపెల్లి, జగిత్యాల మండలాల నుంచి వచ్చిన బాధితులు కాలపరిమితి పూర్తై ఏళ్లైనా డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సీఆర్‌సీఎస్ పోర్టల్ ద్వారా కొంతమందికే చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. కట్ ఆఫ్ తేదీ తొలగించి అందరికీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన ఖాతాదారులు తమ డబ్బులు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కథలాపూర్, రాయికల్, కొడిమ్యాల, గొల్లపెల్లి, జగిత్యాల మండలాల నుంచి వచ్చిన బాధితులు కాలపరిమితి పూర్తై ఏళ్లైనా డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సీఆర్‌సీఎస్ పోర్టల్ ద్వారా కొంతమందికే చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. కట్ ఆఫ్ తేదీ తొలగించి అందరికీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_ATUKULA PREM KUMAR
    ATUKULA PREM KUMAR
    జగిత్యాల రూరల్, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.