logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.

3 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. సిద్దవటం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ ప్రకృతి, పరిరక్షణ దినోత్సవంపై జిల్లా న్యాయధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారి నుంచి నిమ్న కులాల వారిని కాపాడేందుకు, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాగరికత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇప్పటికీ అంటరానితనాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప చట్టాలను దుర్వినియోగం చెయ్యవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందాలని న్యాయం పొందకుంటే బ్రతికి ఉన్నా జీవచ్చవం లెక్కేనన్నారు. గిరిజన చట్టాలు, కాగ్నిజబుల్ ఆఫెన్స్ లో జీరో ఎఫ్ఐఆర్, అటవీ చట్టాలు, ఆర్ఓఎఎఫ్, పీఓఎ యాక్ట్, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పి. కొత్తపల్లి పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంపును నిర్వహించగా, అంగన్వాడీ సిబ్బంది పౌష్టికరమైన ఆహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ వినయ్, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, వైద్యశాఖ, అంగన్వాడీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్
సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకే చట్టాల రూపకల్పన జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాబా ఫకృద్దీన్ తెలిపారు. సిద్దవటం సచివాలయం ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ ప్రకృతి, పరిరక్షణ దినోత్సవంపై జిల్లా న్యాయధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలకు చెందిన వారి నుంచి నిమ్న కులాల వారిని కాపాడేందుకు,  సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాగరికత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇప్పటికీ అంటరానితనాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప చట్టాలను దుర్వినియోగం చెయ్యవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందాలని న్యాయం పొందకుంటే బ్రతికి ఉన్నా జీవచ్చవం లెక్కేనన్నారు. గిరిజన చట్టాలు, కాగ్నిజబుల్ ఆఫెన్స్ లో జీరో ఎఫ్ఐఆర్, అటవీ చట్టాలు, ఆర్ఓఎఎఫ్, పీఓఎ యాక్ట్, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పి. కొత్తపల్లి పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంపును నిర్వహించగా, అంగన్వాడీ సిబ్బంది పౌష్టికరమైన ఆహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ వినయ్, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవిన్యూ శాఖ, వైద్యశాఖ, అంగన్వాడీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • యర్రగుంట్ల హత్య కేసుపై వివరణ ఇచ్చిన సీఐ విశ్వనాథ్ రెడ్డి ఎర్రగుంట్లలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న నడిఊరులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వీరాంజనేయులు ప్రశ్నించగా ఘర్షణ చోటుచేసుకుంది. నిందితులు కత్తితో దాడి చేయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు మేకగురు సాయి అలియాస్ శంకర్తోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నారని తెలిపారు.
    1
    యర్రగుంట్ల హత్య కేసుపై వివరణ ఇచ్చిన సీఐ విశ్వనాథ్ రెడ్డి 
ఎర్రగుంట్లలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న నడిఊరులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వీరాంజనేయులు ప్రశ్నించగా ఘర్షణ చోటుచేసుకుంది.
నిందితులు కత్తితో దాడి చేయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు మేకగురు సాయి అలియాస్ శంకర్తోపాటు
ఓ బాలుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నారని తెలిపారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రాం వేధింపులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన..! ప్రకృతి వైపరీత్యాలతో ఒకపక్క బోరున విలపిస్తున్న రైతుకు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యల శరణం అంటూ మీడియాను ఆశ్రయించారు ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి అనే రైతు స్థానిక నేతల వత్తిళ్లకు మరియు రెవెన్యూ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య శరణమంటూ మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టిడిపి పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని వత్తులు వచ్చిన నాయకులు పార్టీలు మారిన కార్యకర్తగా తాను ఏ పొద్దు పార్టీ మారలేదని అన్నారు అలాంటి తనను ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తమకు ఉన్న రేషన్ షాపులు సైతం టిడిపి పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చిన తర్వాత తొలగించారని తెలిపారు. తొండలు గుడ్లు పెట్టని పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు ఉన్నటువంటి పొలాన్ని కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడి సాగులోకి తెచ్చుకోవడం జరిగిందని అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమా అఖిల ఆమె భర్త భార్గవ్ రామ్ ఇప్పుడున్న మాభూమి లో సగం భూమి అయిన రాసి ఇవ్వాలి లేదా 40 లక్షల రూపాయలు డబ్బులు అయినా ఇవ్వాలంటూ వత్తిళ్లు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలకే ఇలాంటి పరిస్థితి ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఉందని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి ఎంత చెడ్డ పేరు ఆలోచించాలని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు.
    1
    ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రాం వేధింపులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన..!
ప్రకృతి వైపరీత్యాలతో ఒకపక్క బోరున విలపిస్తున్న రైతుకు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యల శరణం అంటూ మీడియాను ఆశ్రయించారు ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి అనే రైతు స్థానిక నేతల వత్తిళ్లకు మరియు రెవెన్యూ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య శరణమంటూ మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టిడిపి పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని వత్తులు వచ్చిన నాయకులు పార్టీలు మారిన కార్యకర్తగా తాను ఏ పొద్దు పార్టీ మారలేదని అన్నారు అలాంటి తనను ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తమకు ఉన్న రేషన్ షాపులు సైతం టిడిపి పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చిన తర్వాత తొలగించారని తెలిపారు. తొండలు గుడ్లు పెట్టని పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు ఉన్నటువంటి పొలాన్ని కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడి సాగులోకి తెచ్చుకోవడం జరిగిందని అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమా అఖిల ఆమె భర్త భార్గవ్ రామ్ ఇప్పుడున్న మాభూమి లో సగం భూమి అయిన రాసి ఇవ్వాలి లేదా 40 లక్షల రూపాయలు డబ్బులు అయినా ఇవ్వాలంటూ వత్తిళ్లు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలకే ఇలాంటి పరిస్థితి ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఉందని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి ఎంత చెడ్డ పేరు ఆలోచించాలని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
    1
    ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు 
మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • 17 వార్డు శ్రీకృష్ణదేవరాయ నగర్ లో పర్యటించిన టిడిపి ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి. బద్వేలు, జూలై:రెండేళ్ల కూటమిపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల భాగంగా బద్వేలు టిడిపి ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి 17 అవార్డు శ్రీకృష్ణదేవరాయ నగర్ లో పర్యటించారు, వారికి వార్డులో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పలుకుతూ కోదండ రామాలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాలు గజమాలతో పలువురు ఘనంగా సత్కరించారు అనంతరం వార్డులో పర్యటించిన సూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయంపై పలువురిని అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమార్, చిన్నుపల్లె సుబ్బారెడ్డి,ఆరవ శ్రీనివాసుల్ రెడ్డి, 17వ వార్డు టిడిపి నాయకులు బసవి శ్రీనివాసులు, నరసయ్య గాజుల నరసింహులు (బాబు) జహంగీర్ భాష షేక్, మహబూబ్ బాషా, యాదవ సంఘం అధ్యక్షులు బుర్రి రాజా యాదవ్, మాచుపల్లి కృష్ణారెడ్డి కొలవలి వేణుగోపాల్, వడ్లపూడి నాగభూషణం లకిడి విజయభాస్కర్ షరీఫ్ ఆవుల నరసయ్య బ్రదర్స్,బుట్టి నరసింహారెడ్డి, మున్సిపాలిటీ వాటర్ సెక్షన్ విభాగం సూపర్వైజర్ ఆవులేటి బాబి, మామిడి శేషారెడ్డి,వెంకటేష్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు
    2
    17 వార్డు శ్రీకృష్ణదేవరాయ నగర్ లో పర్యటించిన టిడిపి ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి.
బద్వేలు, జూలై:రెండేళ్ల కూటమిపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల భాగంగా  బద్వేలు టిడిపి ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి 17 అవార్డు శ్రీకృష్ణదేవరాయ నగర్ లో పర్యటించారు, వారికి వార్డులో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పలుకుతూ కోదండ రామాలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాలు గజమాలతో పలువురు ఘనంగా సత్కరించారు అనంతరం వార్డులో పర్యటించిన సూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయంపై పలువురిని అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమార్, చిన్నుపల్లె సుబ్బారెడ్డి,ఆరవ శ్రీనివాసుల్ రెడ్డి, 17వ వార్డు టిడిపి నాయకులు బసవి శ్రీనివాసులు, నరసయ్య గాజుల నరసింహులు (బాబు) జహంగీర్ భాష షేక్, మహబూబ్ బాషా, యాదవ సంఘం అధ్యక్షులు బుర్రి రాజా యాదవ్, మాచుపల్లి కృష్ణారెడ్డి కొలవలి వేణుగోపాల్, వడ్లపూడి నాగభూషణం లకిడి విజయభాస్కర్ షరీఫ్ ఆవుల నరసయ్య బ్రదర్స్,బుట్టి నరసింహారెడ్డి, మున్సిపాలిటీ వాటర్ సెక్షన్ విభాగం సూపర్వైజర్ ఆవులేటి బాబి, మామిడి శేషారెడ్డి,వెంకటేష్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • గాజులపల్లెలో వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవార్లకు బోనాలు మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని సుంకులమ్మ, దుర్గమ్మ, మారెమ్మ, పెద్దమ్మ ఆలయాల్లోని అమ్మ వార్లకు బోనాలు సమర్పించారు. మంగళవారం ఆషాడ మాసం పురస్కరించుకొని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకొన్నారు.అనంతరం అమ్మవార్లకు బోనాలు, ప్రసాదాలను సమర్పించుకున్నారు. వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవార్ల తీర్థప్రసాదాలను వితరణ చేశారు.
    1
    గాజులపల్లెలో వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవార్లకు బోనాలు 

మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని   సుంకులమ్మ, దుర్గమ్మ, మారెమ్మ, పెద్దమ్మ ఆలయాల్లోని అమ్మ వార్లకు బోనాలు సమర్పించారు. మంగళవారం  ఆషాడ మాసం పురస్కరించుకొని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకొన్నారు.అనంతరం అమ్మవార్లకు బోనాలు, ప్రసాదాలను సమర్పించుకున్నారు. వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవార్ల తీర్థప్రసాదాలను వితరణ చేశారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమానికి మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గత తొమ్మిది రోజులుగా దస్తావేజులేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది దస్తావేజులేఖరులు వృత్తిగా భావించి జీవనోపాధి సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల వారి జీవన భృతి పోతుందని కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్రజలకు అధికారులకు మధ్యవర్తిగా ఉంటూ రిజిస్ట్రేషన్ ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం కక్షగట్టి 396 జీవో తీసుకొచ్చి ఆర్ఎస్కే సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను విరమించుకోవాలని కోరారు.
    1
    దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమానికి మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గత తొమ్మిది రోజులుగా దస్తావేజులేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది దస్తావేజులేఖరులు వృత్తిగా భావించి జీవనోపాధి సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల వారి జీవన భృతి పోతుందని కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్రజలకు అధికారులకు మధ్యవర్తిగా ఉంటూ రిజిస్ట్రేషన్ ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం కక్షగట్టి 396 జీవో తీసుకొచ్చి ఆర్ఎస్కే సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను విరమించుకోవాలని కోరారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥 ✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽 నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥 ✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽
    1
    నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥

✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽
నాన్నే రియల్ హీరో 💞 బిడ్డల కోసం ప్రాణాలకు తెగించి 😥
✒️- పిల్లల కోసం తండ్రి పడే తపన, చేసే త్యాగం వెలకట్టలేనిది. కష్టాలు ఎదురైనా బిడ్డల కోసం శ్రమిస్తాడు. వారు ఆపదలో ఉన్నారంటే తన ప్రాణాలు అర్పించడానికీ సిద్ధపడతాడు. అస్సాం వరదల్లో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు వైరలవుతున్నాయి. ఓ నాన్న ముగ్గురు బిడ్డలను చిన్న తెప్పలో ఎక్కించి తాను నీటిలో ఈదుతూ కాపాడారు. మరో ఘటనలో వరద ప్రవాహంలో ఒంటిచేత్తో బిడ్డను ఎత్తుకొని ప్రాణం పోశారు. నాన్నే మన రియల్ హీరో..🤟🏽
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.