logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

15 hrs ago
user_M. ADINARAYANA
M. ADINARAYANA
Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
    1
    ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు 
మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    1
    మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు 
మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.
    1
    మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం 
మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం  గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను  తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో  మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • వికలాంగుడైన రాహుల్ పోలీసు కలను నిజం చేసిన పోలీస్ ఆఫీసర్ సీపీ సుమతి HYD: మల్కాజ్‌గిరి కమిషనరేట్ కార్యాలయంలో వికలాంగుడైన రాహుల్‌కు పోలీసు కావాలనే చిరకాల కోరికను కమిషనర్ సీపీ సుమతి నెరవేర్చారు. రాహుల్‌ను తన కుర్చీలో కూర్చోబెట్టి తలపై పోలీస్ క్యాప్ ఉంచి గౌరవించారు. ఈ ఆత్మీయ చర్యతో రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీపీ సుమతి మానవీయతను పలువురు ప్రశంసించారు.
    1
    వికలాంగుడైన రాహుల్ పోలీసు కలను నిజం చేసిన పోలీస్ ఆఫీసర్ సీపీ సుమతి
HYD: మల్కాజ్‌గిరి కమిషనరేట్ కార్యాలయంలో వికలాంగుడైన రాహుల్‌కు పోలీసు కావాలనే చిరకాల కోరికను కమిషనర్ సీపీ సుమతి నెరవేర్చారు. రాహుల్‌ను తన కుర్చీలో కూర్చోబెట్టి తలపై పోలీస్ క్యాప్ ఉంచి గౌరవించారు. ఈ ఆత్మీయ చర్యతో రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీపీ సుమతి మానవీయతను పలువురు ప్రశంసించారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    17 hrs ago
  • నల్లమల గిరిజనులు, ఆదివాసీలు ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం, అచ్చంపేట నియోజకవర్గంలో రూ.12.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ* నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మన్నానూర్ గ్రామం లోని చెంచు గిరిజనుల స్వయం ఉపాధికి రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, గురుకులాల ఆకస్మిక తనిఖీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి విద్యార్థులు, సిబ్బందితో ముఖాముఖి విద్య, వసతి, మౌలిక వసతులపై సమగ్ర సమీక్ష దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ కలలు కన్న సమసమాజ నిర్మాణం,దళిత,గిరిజన సాధికారత,నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నల్లమల గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రత్యేక లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారి పిల్లలకు అత్యున్నత స్థాయి విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మంత్రి అన్నారు.మంగళవారం మన్ననూరులో పర్యటించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది,ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివిధ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.మంత్రి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం,పీవీటీజీ గురుకుల విద్యాసంస్థ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఇతర విద్యాసంస్థల తరగతి గదులు,హాస్టళ్లు,వంటశాలలు,భోజనశాలలు,తాగునీటి సౌకర్యాలు,మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, ఆహార నాణ్యత,ఆరోగ్య సేవలు,పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, క్రీడా సామగ్రి, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పాలని సూచిస్తూ,ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశం ఇచ్చిన మంత్రి, నల్లమల అడవులు తెలంగాణకు ప్రకృతి వరమని,వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అమ్రాబాద్,పదర మండలాల్లో ఆర్టికల్–273(1) గ్రాంట్, ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకాల కింద రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యా సంస్థల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, టాయిలెట్ బ్లాకులు,తాగునీటి సదుపాయాలు,స్టోరేజ్ సంపులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు.అదే విధంగా చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అడవుల్లో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, ఇతర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన కుటుంబాలకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ....,మహేంద్రనాథ్ గారు తన జీవితమంతా దళితులు, గిరిజనులు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రజా ప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ చేరేలా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం. నల్లమల బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోము.అవసరమైన ప్రతి రూపాయిని ప్రభుత్వం వెచ్చిస్తుంది అని స్పష్టం చేశారు.నల్లమల ప్రాంతంలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శప్రాయంగా గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మొటిక్ చార్జీలను కూడా గణనీయంగా పెంచి విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, అవసరమైన వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతపై స్పందించిన మంత్రి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన చోట వెంటనే బోధన సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి త్వరితగతిన భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. బోధన సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే జూన్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పదేళ్లకు పైగా సేవలందిస్తున్న నాన్-టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ అయిన వారి కేసులను శాఖాపరంగా సమీక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి సమానంగా ముఖ్యమని అన్నారు.మహిళా గిరిజన గురుకుల పాఠశాల తనిఖీలో తాగునీరు,మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.దళిత, గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు .హైదరాబాద్‌లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల ప్రాంత గురుకులాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. వైద్యులు,ఇంజినీర్లు,శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పరిశోధకులుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.క్రీడలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, నల్లమల ప్రాంతంలో ఉన్న సహజ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి రావాలని ఆకాంక్షించారు. రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో నల్లమల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో మన్ననూరులోని పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదులు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలకు డార్మిటరీ,అదనపు తరగతి గదులు,స్టోరేజ్ సంప్,అచ్చంపేట,ఇనోల్,బాణాల,చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించగా,పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమం పారదర్శకంగా అమలు కావాలని, నల్లమల ప్రాంత అభివృద్ధిలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని మంత్రి సూచించారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...., అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నల్లమల్ల ముద్దుబిడ్డ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలోని చెంచు గిరిజనులు,దళితులు,వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్లమల గ్రామాలకు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు వేగంగా చేరుతున్నాయని తెలిపారు.రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా నల్లమల ప్రాంతంలో పర్యటించి గురుకుల విద్యాసంస్థలను సందర్శించడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, నాణ్యమైన ఆహారం,అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల్లో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.చెంచు గిరిజనుల కోసం రూ.1.80 కోట్లతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వివిధ ఉత్పత్తులు తదితర వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి,గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.నల్లమల ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి గిరిజన తండా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందే వరకు తమ కృషి కొనసాగుతుందని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఇఓ రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి ,ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    నల్లమల గిరిజనులు, ఆదివాసీలు ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం, అచ్చంపేట నియోజకవర్గంలో రూ.12.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ*
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మన్నానూర్ గ్రామం లోని చెంచు గిరిజనుల స్వయం ఉపాధికి రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, గురుకులాల ఆకస్మిక తనిఖీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి విద్యార్థులు, సిబ్బందితో ముఖాముఖి  విద్య, వసతి, మౌలిక వసతులపై సమగ్ర సమీక్ష
దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ కలలు కన్న సమసమాజ నిర్మాణం,దళిత,గిరిజన సాధికారత,నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నల్లమల గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ప్రత్యేక లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారి పిల్లలకు అత్యున్నత స్థాయి విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మంత్రి అన్నారు.మంగళవారం మన్ననూరులో  పర్యటించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది,ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివిధ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.మంత్రి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం,పీవీటీజీ గురుకుల విద్యాసంస్థ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, ఇతర విద్యాసంస్థల తరగతి గదులు,హాస్టళ్లు,వంటశాలలు,భోజనశాలలు,తాగునీటి సౌకర్యాలు,మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, ఆహార నాణ్యత,ఆరోగ్య సేవలు,పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, క్రీడా సామగ్రి, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పాలని సూచిస్తూ,ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశం ఇచ్చిన మంత్రి, నల్లమల అడవులు తెలంగాణకు ప్రకృతి వరమని,వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అమ్రాబాద్,పదర మండలాల్లో ఆర్టికల్–273(1) గ్రాంట్, ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకాల కింద రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యా సంస్థల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, టాయిలెట్ బ్లాకులు,తాగునీటి సదుపాయాలు,స్టోరేజ్ సంపులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు.అదే విధంగా చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అడవుల్లో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, ఇతర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన కుటుంబాలకు అధిక ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ మాట్లాడుతూ....,మహేంద్రనాథ్ గారు తన జీవితమంతా దళితులు, గిరిజనులు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రజా ప్రభుత్వం స్వీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ చేరేలా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం. నల్లమల బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడబోము.అవసరమైన ప్రతి రూపాయిని ప్రభుత్వం వెచ్చిస్తుంది అని స్పష్టం చేశారు.నల్లమల ప్రాంతంలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే ఆదర్శప్రాయంగా గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మొటిక్ చార్జీలను కూడా గణనీయంగా పెంచి విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, అవసరమైన వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతపై స్పందించిన మంత్రి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన చోట వెంటనే బోధన సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి త్వరితగతిన భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. బోధన సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే జూన్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
పదేళ్లకు పైగా సేవలందిస్తున్న నాన్-టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ అయిన వారి కేసులను శాఖాపరంగా సమీక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి సమానంగా ముఖ్యమని అన్నారు.మహిళా గిరిజన గురుకుల పాఠశాల తనిఖీలో తాగునీరు,మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.దళిత, గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు .హైదరాబాద్‌లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల ప్రాంత గురుకులాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. వైద్యులు,ఇంజినీర్లు,శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పరిశోధకులుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.క్రీడలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, నల్లమల ప్రాంతంలో ఉన్న సహజ ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి రావాలని ఆకాంక్షించారు. రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో నల్లమల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పర్యటనలో మన్ననూరులోని పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాలకు అదనపు తరగతి గదులు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ, కిచెన్ కమ్ డైనింగ్ హాల్, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలకు డార్మిటరీ,అదనపు తరగతి గదులు,స్టోరేజ్ సంప్,అచ్చంపేట,ఇనోల్,బాణాల,చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థలకు ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించగా,పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమం పారదర్శకంగా అమలు కావాలని, నల్లమల ప్రాంత అభివృద్ధిలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని మంత్రి సూచించారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ...., అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన నల్లమల్ల ముద్దుబిడ్డ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలోని చెంచు గిరిజనులు,దళితులు,వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్లమల గ్రామాలకు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు వేగంగా చేరుతున్నాయని తెలిపారు.రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా నల్లమల ప్రాంతంలో పర్యటించి గురుకుల విద్యాసంస్థలను సందర్శించడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, నాణ్యమైన ఆహారం,అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.అమ్రాబాద్, పదర మండలాల్లో రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల్లో కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాల్స్, ప్రహరీ గోడలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.చెంచు గిరిజనుల కోసం రూ.1.80 కోట్లతో నిర్మించనున్న ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. గిరిజనులు అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వివిధ ఉత్పత్తులు తదితర వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ తగ్గి,గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.నల్లమల ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి గిరిజన తండా, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందే వరకు తమ కృషి కొనసాగుతుందని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని  ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.
అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 
ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఇఓ రమేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి ,ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Chalamala Nagaraju goud
    Chalamala Nagaraju goud
    Local News Reporter ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    8 hrs ago
  • సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    1
    సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి.
బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమానికి మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గత తొమ్మిది రోజులుగా దస్తావేజులేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది దస్తావేజులేఖరులు వృత్తిగా భావించి జీవనోపాధి సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల వారి జీవన భృతి పోతుందని కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్రజలకు అధికారులకు మధ్యవర్తిగా ఉంటూ రిజిస్ట్రేషన్ ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం కక్షగట్టి 396 జీవో తీసుకొచ్చి ఆర్ఎస్కే సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను విరమించుకోవాలని కోరారు.
    1
    దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమానికి మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద గత తొమ్మిది రోజులుగా దస్తావేజులేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది దస్తావేజులేఖరులు వృత్తిగా భావించి జీవనోపాధి సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల వారి జీవన భృతి పోతుందని కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్రజలకు అధికారులకు మధ్యవర్తిగా ఉంటూ రిజిస్ట్రేషన్ ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం కక్షగట్టి 396 జీవో తీసుకొచ్చి ఆర్ఎస్కే సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను విరమించుకోవాలని కోరారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • నంద్యాల YS నగర్లో గాలివానకు తెగిపడిన విద్యుత్ తీగలు - ఆవు మృతి నంద్యాల జులై 28 ప్రభాత వార్త నంద్యాల వందల పట్టణంలోని వైయస్ నగర్లో మంగళవారం సాయంత్రం వీచిన గాలివానకు త్రీఫేస్ విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడికి వచ్చిన ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ తీగలు, స్తంభాల పరిస్థితిని ముందస్తుగా పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోడ్లపై, నివాస ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కావున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, YS నగర్ తో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, ప్రమాదకరంగా ఉన్న తీగలను బలోపేతం చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం..అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించే బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    1
    నంద్యాల YS నగర్లో గాలివానకు తెగిపడిన విద్యుత్ తీగలు - ఆవు మృతి
నంద్యాల జులై 28 ప్రభాత వార్త
నంద్యాల వందల పట్టణంలోని వైయస్ నగర్లో మంగళవారం సాయంత్రం  వీచిన గాలివానకు త్రీఫేస్ విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడికి వచ్చిన ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ తీగలు, స్తంభాల పరిస్థితిని ముందస్తుగా పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోడ్లపై, నివాస ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కావున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, YS నగర్ తో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, ప్రమాదకరంగా ఉన్న తీగలను బలోపేతం చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం..అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించే బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.