logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.

15 hrs ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    1
    మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు 
మిడుతూరును కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని మొక్కజొన్న, మినుము, కంది, ఉల్లి మిరప తదితర పంటలను పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల చొప్పున రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.
    1
    మహానంది క్షేత్రంలోకూరగాయల అలంకరణలో శ్రీ కామేశ్వరి అమ్మవారి దర్శనం 
మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు బుధవారం  గురుపౌర్ణమి సందర్భంగా కూరగాయల అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం అలంకారానికి అవసరమైన అన్నిరకాల కూరగాయలను  తీసుకొచ్చారు. కళ్యాణ మండపంలో  మహిళలు హైదరాబాద్, కర్నూలు మార్కెట్,ల నుండి వచ్చిన వివిధ రకాల కూరగాయలతో దండలను అల్లే కార్యక్రమం చేపట్టారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • శ్రీశైల దేవస్థానం తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. *ధర్మకర్తల మండలి సమావేశం* • 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు • వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమశాస్త్రానుసారంగా వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం • దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట ఆలయంలో అభివృద్ధి పనులు, • ఆగష్టు 7న కొలనుభారతి క్షేత్రంలో శాకంభరీ ఉత్సవం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి 9వ సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈనాటి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రేపు ( 29.07.2026) జరిగే శాకంభరీ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండేందుకు రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు తలపెట్టిన వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం జరుగుతుందన్నారు. వరుణయాగం, శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు. టి.టి.డి తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపడం తప్పనిసరి. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత. • సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్ట వేళలలో మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ దర్శనాలు జారీకి కూడా ఆన్‌లైన్ విధానం అమలు. • లోకకల్యాణం కోసం అయిదు రోజులపాటు అనగా తేది : 07.08.2026 నుండి 11.08.2026 వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం. • శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. • శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించడమైనది. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అంచనాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది. • ఆలయముందుభాగంలో సాలుమండపాల నిర్మాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. అయితే క్యూకాంప్లెక్సు నిర్మాణం, క్షేత్రపరిధిలో శౌచాలయాల నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టడం జరుగుతుంది. • సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాలలో శౌచాలయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ నందు 11 గదులు ఉండేవిధంగా వీటి నిర్మాణం చేపట్టబడుతుంది. ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి సుమారు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టైప్ –ఎ మోడల్ నందు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్లాక్‌లో అదనంగా స్నానపుగదులు కూడా ఏర్పాటు చేయబడుతాయి. • భక్తుల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు, మరియు యోగివేమారెడ్డి సత్రం వెనుకభాగంలో రూ. 24లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించాలని తీర్మానించడం జరిగింది. • శ్రావణమాసోత్సవాలలో ప్రధాన గోపురాలకు విద్యుద్దీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. • భక్తుల సౌకర్యార్థం నందీశ్వర డార్మెటరీలో డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 39 లక్షలు. • అదేవిధంగా నీలకంఠేశ్వర డార్మెటరీ నందు కూడా డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 23 లక్షలు. • భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నందు అదనపు వాటరు కూలర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వీటి అంచనా వ్యయం రూ. 5లక్షలు • ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు విధానంలో పిలువబడిన టెండర్లను అనుసరించి రాబోవు 2027 సంవత్సరపు వివిధ రకాల క్యాలెండర్లను మరియు రెండు రకాల డైరీలను ముద్రించాలని నిర్ణయం. • స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు • అన్నప్రసాద వితరణ భవనములో కూడా రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు.
    1
    శ్రీశైల దేవస్థానం తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు.

*ధర్మకర్తల మండలి సమావేశం*
•	9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు 
•	ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు 
•	వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమశాస్త్రానుసారంగా వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం
•	దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట ఆలయంలో అభివృద్ధి పనులు, 
•	ఆగష్టు 7న కొలనుభారతి క్షేత్రంలో శాకంభరీ ఉత్సవం
దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి  9వ సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు  పాల్గొన్నారు. ఈనాటి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6  అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. 
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రేపు ( 29.07.2026) జరిగే శాకంభరీ ఉత్సవాన్ని  సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి,  సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండేందుకు  రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు తలపెట్టిన వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం జరుగుతుందన్నారు. వరుణయాగం, శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. 
•	ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు. టి.టి.డి తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం  48 గంటలు  ముందస్తుగా పంపడం తప్పనిసరి.  ప్రోటోకాల్  టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత. 
•	సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్ట వేళలలో మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ దర్శనాలు జారీకి కూడా ఆన్‌లైన్  విధానం అమలు.
•	లోకకల్యాణం కోసం అయిదు రోజులపాటు అనగా తేది : 07.08.2026 నుండి 11.08.2026 వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం. 
•	శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున  సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 
•	శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించడమైనది. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అంచనాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది.
•	ఆలయముందుభాగంలో సాలుమండపాల నిర్మాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. అయితే క్యూకాంప్లెక్సు నిర్మాణం, క్షేత్రపరిధిలో శౌచాలయాల నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టడం జరుగుతుంది. 
•	సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాలలో శౌచాలయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ నందు 11 గదులు ఉండేవిధంగా  వీటి నిర్మాణం చేపట్టబడుతుంది.  ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి  సుమారు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో  టైప్ –ఎ మోడల్ నందు నిర్మించడం జరుగుతుంది.  ఒక్కొక్క బ్లాక్‌లో అదనంగా స్నానపుగదులు కూడా ఏర్పాటు చేయబడుతాయి. 
•	 భక్తుల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి  కుమార సదనం వరకు, మరియు యోగివేమారెడ్డి సత్రం వెనుకభాగంలో రూ. 24లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు  నిర్మించాలని తీర్మానించడం జరిగింది. 
•	శ్రావణమాసోత్సవాలలో ప్రధాన గోపురాలకు విద్యుద్దీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. 
•	భక్తుల సౌకర్యార్థం నందీశ్వర డార్మెటరీలో  డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler)  ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది.  దీని అంచనా వ్యయం రూ. 39 లక్షలు.  
•	అదేవిధంగా నీలకంఠేశ్వర డార్మెటరీ నందు కూడా డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler)  ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది.  దీని అంచనా వ్యయం రూ. 23 లక్షలు.  
•	భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నందు  అదనపు వాటరు కూలర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వీటి అంచనా వ్యయం రూ. 5లక్షలు
•	ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు విధానంలో పిలువబడిన టెండర్లను అనుసరించి రాబోవు 2027 సంవత్సరపు వివిధ రకాల క్యాలెండర్లను మరియు రెండు రకాల డైరీలను  ముద్రించాలని నిర్ణయం.
•	స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు
•	అన్నప్రసాద వితరణ భవనములో కూడా రూ.  39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు.
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
    1
    ప్లాస్టిక్ కవర్ల నివారణలో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు 
మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా పలు దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఉన్న చికెన్ దుకాణాలు కిరాణా దుకాణాలు పండ్లు పూల దుకాణాలలో అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు తెలియజేస్తూ పలుమార్లు ప్రజలకు దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికా రూపొందించామన్నారు. పట్టణంలో ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆరు టీముల ద్వారా విస్తృత తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోవు పది రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో గుడ్డతో సంచులను వాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పండ్లు పూల దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను వాడడం అభినందనీయమన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారి ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగించాలని కోరారు. ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యకరమైన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ కవర్లను ఉపయోగిస్తున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పోలీసు వాహనాల సంరక్షణ ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత జిల్లా ఎస్పీ : సునిత రెడ్డి, *➤ పెట్రోకార్లు, బ్లూకోల్ట్స్, గ్లామర్ బైక్‌లను తనిఖీ చేసిన ఎస్పీ* *➤ జిల్లా పోలీసు వాహనాల నిర్వహణకు మరింత బలోపేతం టైర్లు, బ్యాటరీల పంపిణీ* *➤ ప్రతి వాహనాన్ని స్వంత వాహనంలా సంరక్షించాలని డ్రైవర్లకు సూచన* *➤ ఉత్తమంగా నిర్వహించే డ్రైవర్లకు రివార్డులు.నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు* పోలీసు శాఖపై ప్రజల్లో ఏర్పడే తొలి అభిప్రాయం పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు వారు వినియోగించే ప్రభుత్వ వాహనాల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర సమయంలో పరుగులు తీసే పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండేలా చూసుకోవడం ప్రతి పోలీసు డ్రైవర్ బాధ్యతని జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. *వనపర్తి, జులై - 28:* మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం (MTO) రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ విధుల్లో వినియోగిస్తున్న పెట్రో కార్లతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ (CCS) అధికారులు, సిబ్బంది పోలీసు విధుల్లో వినియోగిస్తున్న గ్లామర్ ద్విచక్ర వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల బాహ్య, అంతర్గత పరిశుభ్రత, ఇంజిన్ పనితీరు, బ్రేకులు, క్లచ్, కూలెంట్, ఇంజిన్ ఆయిల్, టైర్ల పరిస్థితి, లైట్లు, సైరన్లు, పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి వాహనాలకు సంబంధించి బ్యాటరీలు, టైర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు వాహనం అనేది కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు... పోలీసు శాఖ క్రమశిక్షణకు, సేవా నిబద్ధతకు, ప్రజల్లో పోలీసులపై ఉన్న విశ్వాసానికి ప్రతీక. ప్రతి డ్రైవర్ తనకు అప్పగించిన వాహనాన్ని స్వంత వాహనం కంటే ఎక్కువ బాధ్యతతో సంరక్షించాలి. వాహనాల పరిశుభ్రత, సాంకేతిక నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి పోలీసు ఉద్యోగి విధి బాధ్యతగా భావించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలంటే వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండాలి. ఘటనా స్థలాలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత వేగ పరిమితిని పాటించాలి. ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించడం కూడా ప్రజాసేవలో అంతర్భాగమే. వాహనాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచే డ్రైవర్లను శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఘటనా స్థలాలకు, ఎస్కార్ట్ విధులకు లేదా ఇతర అత్యవసర సేవలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్దేశిత వేగ పరిమితిని పాటిస్తూ. పోలీసులు చట్టాన్ని అమలు చేసే వారే కాకుండా, చట్టాన్ని ఆచరించి చూపే ఆదర్శంగా నిలవాలి. ప్రతి పోలీసు వాహనం పోలీసు శాఖ గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలకు నిదర్శనంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైవేలపై ప్రయాణించే సమయంలో నిర్దేశిత వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, వాహనాల జీవితకాలం పెరిగేలా సకాలంలో సర్వీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీ స్టేషన్ల వారీగా ఎం.టి.ఆర్.ఐ. వాహనాలను తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు డీఎస్పీ వీరారెడ్డి, ఎం.టి.ఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పరమేశ్వ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం పోలీసు అధికారులు,సిబ్బంది, పాల్గొన్నారు.
    1
    పోలీసు వాహనాల సంరక్షణ ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత జిల్లా ఎస్పీ  : సునిత రెడ్డి,


*➤  పెట్రోకార్లు, బ్లూకోల్ట్స్, గ్లామర్ బైక్‌లను తనిఖీ చేసిన ఎస్పీ*
*➤ జిల్లా పోలీసు వాహనాల నిర్వహణకు మరింత బలోపేతం టైర్లు, బ్యాటరీల పంపిణీ*
*➤   ప్రతి వాహనాన్ని స్వంత వాహనంలా సంరక్షించాలని డ్రైవర్లకు సూచన*
*➤   ఉత్తమంగా నిర్వహించే డ్రైవర్లకు రివార్డులు.నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు*
పోలీసు శాఖపై ప్రజల్లో ఏర్పడే తొలి అభిప్రాయం పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు వారు వినియోగించే ప్రభుత్వ వాహనాల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర సమయంలో పరుగులు తీసే పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండేలా చూసుకోవడం ప్రతి పోలీసు డ్రైవర్ బాధ్యతని  జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. 
*వనపర్తి, జులై - 28:* మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం (MTO) రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ విధుల్లో వినియోగిస్తున్న పెట్రో కార్లతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ (CCS) అధికారులు, సిబ్బంది పోలీసు విధుల్లో వినియోగిస్తున్న గ్లామర్ ద్విచక్ర వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల బాహ్య, అంతర్గత పరిశుభ్రత, ఇంజిన్ పనితీరు, బ్రేకులు, క్లచ్, కూలెంట్, ఇంజిన్ ఆయిల్, టైర్ల పరిస్థితి, లైట్లు, సైరన్లు, పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి  వాహనాలకు సంబంధించి బ్యాటరీలు, టైర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు వాహనం అనేది కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు... పోలీసు శాఖ క్రమశిక్షణకు, సేవా నిబద్ధతకు, ప్రజల్లో పోలీసులపై ఉన్న విశ్వాసానికి ప్రతీక. ప్రతి డ్రైవర్ తనకు అప్పగించిన వాహనాన్ని స్వంత వాహనం కంటే ఎక్కువ బాధ్యతతో సంరక్షించాలి. వాహనాల పరిశుభ్రత, సాంకేతిక నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి పోలీసు ఉద్యోగి విధి బాధ్యతగా భావించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలంటే వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండాలి. ఘటనా స్థలాలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత వేగ పరిమితిని పాటించాలి. ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించడం కూడా ప్రజాసేవలో అంతర్భాగమే. వాహనాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచే డ్రైవర్లను శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఘటనా స్థలాలకు, ఎస్కార్ట్ విధులకు లేదా ఇతర అత్యవసర సేవలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్దేశిత వేగ పరిమితిని పాటిస్తూ. పోలీసులు చట్టాన్ని అమలు చేసే వారే కాకుండా, చట్టాన్ని ఆచరించి చూపే ఆదర్శంగా నిలవాలి. ప్రతి పోలీసు వాహనం పోలీసు శాఖ గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలకు నిదర్శనంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైవేలపై ప్రయాణించే సమయంలో నిర్దేశిత వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, వాహనాల జీవితకాలం పెరిగేలా సకాలంలో సర్వీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీ స్టేషన్ల వారీగా ఎం.టి.ఆర్.ఐ. వాహనాలను తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎస్పీ గారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు డీఎస్పీ వీరారెడ్డి, ఎం.టి.ఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్,  స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పరమేశ్వ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి  మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం పోలీసు అధికారులు,సిబ్బంది, పాల్గొన్నారు.
    user_A Rajasheker
    A Rajasheker
    Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
    14 hrs ago
  • సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి. బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    1
    సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం జూలై 30 చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి.
బద్వేలు,జూలై 28 :స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్న లక్షలాదిమంది కాంట్రాక్టు- ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని, పనిముట్లు రక్షణ పరికరాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జూలై 30వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరపు సత్యరాజు, ఉపాధ్యక్షురాలు దియ్యాల దేవమ్మ, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్ పలువురు కార్మికులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • నంద్యాల YS నగర్లో గాలివానకు తెగిపడిన విద్యుత్ తీగలు - ఆవు మృతి నంద్యాల జులై 28 ప్రభాత వార్త నంద్యాల వందల పట్టణంలోని వైయస్ నగర్లో మంగళవారం సాయంత్రం వీచిన గాలివానకు త్రీఫేస్ విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడికి వచ్చిన ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ తీగలు, స్తంభాల పరిస్థితిని ముందస్తుగా పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోడ్లపై, నివాస ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కావున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, YS నగర్ తో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, ప్రమాదకరంగా ఉన్న తీగలను బలోపేతం చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం..అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించే బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    1
    నంద్యాల YS నగర్లో గాలివానకు తెగిపడిన విద్యుత్ తీగలు - ఆవు మృతి
నంద్యాల జులై 28 ప్రభాత వార్త
నంద్యాల వందల పట్టణంలోని వైయస్ నగర్లో మంగళవారం సాయంత్రం  వీచిన గాలివానకు త్రీఫేస్ విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడికి వచ్చిన ఆవు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ తీగలు, స్తంభాల పరిస్థితిని ముందస్తుగా పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోడ్లపై, నివాస ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కావున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, YS నగర్ తో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను తనిఖీ చేసి, ప్రమాదకరంగా ఉన్న తీగలను బలోపేతం చేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం..అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించే బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.