శ్రీశైల దేవస్థానం తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. *ధర్మకర్తల మండలి సమావేశం* • 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు • వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమశాస్త్రానుసారంగా వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం • దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట ఆలయంలో అభివృద్ధి పనులు, • ఆగష్టు 7న కొలనుభారతి క్షేత్రంలో శాకంభరీ ఉత్సవం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి 9వ సమావేశం నిర్వహించబడింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. ఈనాటి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రేపు ( 29.07.2026) జరిగే శాకంభరీ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండేందుకు రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు తలపెట్టిన వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం జరుగుతుందన్నారు. వరుణయాగం, శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. • ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు. టి.టి.డి తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపడం తప్పనిసరి. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత. • సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్ట వేళలలో మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ దర్శనాలు జారీకి కూడా ఆన్‌లైన్ విధానం అమలు. • లోకకల్యాణం కోసం అయిదు రోజులపాటు అనగా తేది : 07.08.2026 నుండి 11.08.2026 వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం. • శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. • శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించడమైనది. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అంచనాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది. • ఆలయముందుభాగంలో సాలుమండపాల నిర్మాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. అయితే క్యూకాంప్లెక్సు నిర్మాణం, క్షేత్రపరిధిలో శౌచాలయాల నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టడం జరుగుతుంది. • సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాలలో శౌచాలయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ నందు 11 గదులు ఉండేవిధంగా వీటి నిర్మాణం చేపట్టబడుతుంది. ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి సుమారు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టైప్ –ఎ మోడల్ నందు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్లాక్‌లో అదనంగా స్నానపుగదులు కూడా ఏర్పాటు చేయబడుతాయి. • భక్తుల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు, మరియు యోగివేమారెడ్డి సత్రం వెనుకభాగంలో రూ. 24లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించాలని తీర్మానించడం జరిగింది. • శ్రావణమాసోత్సవాలలో ప్రధాన గోపురాలకు విద్యుద్దీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. • భక్తుల సౌకర్యార్థం నందీశ్వర డార్మెటరీలో డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 39 లక్షలు. • అదేవిధంగా నీలకంఠేశ్వర డార్మెటరీ నందు కూడా డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 23 లక్షలు. • భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నందు అదనపు వాటరు కూలర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వీటి అంచనా వ్యయం రూ. 5లక్షలు • ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు విధానంలో పిలువబడిన టెండర్లను అనుసరించి రాబోవు 2027 సంవత్సరపు వివిధ రకాల క్యాలెండర్లను మరియు రెండు రకాల డైరీలను ముద్రించాలని నిర్ణయం. • స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు • అన్నప్రసాద వితరణ భవనములో కూడా రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు.

- ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రాం వేధింపులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన..! ప్రకృతి వైపరీత్యాలతో ఒకపక్క బోరున విలపిస్తున్న రైతుకు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యల శరణం అంటూ మీడియాను ఆశ్రయించారు ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి అనే రైతు స్థానిక నేతల వత్తిళ్లకు మరియు రెవెన్యూ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య శరణమంటూ మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన వ్యక్తం చేశారు... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టిడిపి పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని వత్తులు వచ్చిన నాయకులు పార్టీలు మారిన కార్యకర్తగా తాను ఏ పొద్దు పార్టీ మారలేదని అన్నారు అలాంటి తనను ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తమకు ఉన్న రేషన్ షాపులు సైతం టిడిపి పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చిన తర్వాత తొలగించారని తెలిపారు. తొండలు గుడ్లు పెట్టని పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు ఉన్నటువంటి పొలాన్ని కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడి సాగులోకి తెచ్చుకోవడం జరిగిందని అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమా అఖిల ఆమె భర్త భార్గవ్ రామ్ ఇప్పుడున్న మాభూమి లో సగం భూమి అయిన రాసి ఇవ్వాలి లేదా 40 లక్షల రూపాయలు డబ్బులు అయినా ఇవ్వాలంటూ వత్తిళ్లు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలకే ఇలాంటి పరిస్థితి ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఉందని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి ఎంత చెడ్డ పేరు ఆలోచించాలని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు.1
- పోలీసు వాహనాల సంరక్షణ ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత జిల్లా ఎస్పీ : సునిత రెడ్డి, *➤ పెట్రోకార్లు, బ్లూకోల్ట్స్, గ్లామర్ బైక్‌లను తనిఖీ చేసిన ఎస్పీ* *➤ జిల్లా పోలీసు వాహనాల నిర్వహణకు మరింత బలోపేతం టైర్లు, బ్యాటరీల పంపిణీ* *➤ ప్రతి వాహనాన్ని స్వంత వాహనంలా సంరక్షించాలని డ్రైవర్లకు సూచన* *➤ ఉత్తమంగా నిర్వహించే డ్రైవర్లకు రివార్డులు.నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు* పోలీసు శాఖపై ప్రజల్లో ఏర్పడే తొలి అభిప్రాయం పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు వారు వినియోగించే ప్రభుత్వ వాహనాల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర సమయంలో పరుగులు తీసే పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండేలా చూసుకోవడం ప్రతి పోలీసు డ్రైవర్ బాధ్యతని జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,* గారు అన్నారు. *వనపర్తి, జులై - 28:* మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం (MTO) రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ విధుల్లో వినియోగిస్తున్న పెట్రో కార్లతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ (CCS) అధికారులు, సిబ్బంది పోలీసు విధుల్లో వినియోగిస్తున్న గ్లామర్ ద్విచక్ర వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల బాహ్య, అంతర్గత పరిశుభ్రత, ఇంజిన్ పనితీరు, బ్రేకులు, క్లచ్, కూలెంట్, ఇంజిన్ ఆయిల్, టైర్ల పరిస్థితి, లైట్లు, సైరన్లు, పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి వాహనాలకు సంబంధించి బ్యాటరీలు, టైర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు వాహనం అనేది కేవలం ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు... పోలీసు శాఖ క్రమశిక్షణకు, సేవా నిబద్ధతకు, ప్రజల్లో పోలీసులపై ఉన్న విశ్వాసానికి ప్రతీక. ప్రతి డ్రైవర్ తనకు అప్పగించిన వాహనాన్ని స్వంత వాహనం కంటే ఎక్కువ బాధ్యతతో సంరక్షించాలి. వాహనాల పరిశుభ్రత, సాంకేతిక నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ప్రతి పోలీసు ఉద్యోగి విధి బాధ్యతగా భావించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలంటే వాహనాలు ఎల్లప్పుడూ అత్యుత్తమ స్థితిలో ఉండాలి. ఘటనా స్థలాలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత వేగ పరిమితిని పాటించాలి. ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించడం కూడా ప్రజాసేవలో అంతర్భాగమే. వాహనాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచే డ్రైవర్లను శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఘటనా స్థలాలకు, ఎస్కార్ట్ విధులకు లేదా ఇతర అత్యవసర సేవలకు వెళ్లే సమయంలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్దేశిత వేగ పరిమితిని పాటిస్తూ. పోలీసులు చట్టాన్ని అమలు చేసే వారే కాకుండా, చట్టాన్ని ఆచరించి చూపే ఆదర్శంగా నిలవాలి. ప్రతి పోలీసు వాహనం పోలీసు శాఖ గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలకు నిదర్శనంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైవేలపై ప్రయాణించే సమయంలో నిర్దేశిత వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలని, వాహనాల జీవితకాలం పెరిగేలా సకాలంలో సర్వీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పోలీ స్టేషన్ల వారీగా ఎం.టి.ఆర్.ఐ. వాహనాలను తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు డీఎస్పీ వీరారెడ్డి, ఎం.టి.ఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, నరేష్, పరమేశ్వ రెడ్డి, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం పోలీసు అధికారులు,సిబ్బంది, పాల్గొన్నారు.1
- రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద రంగనాథ్ తొమ్మిది తలల సర్పం రేవంత్ రెడ్డి పది తలల రావణాసురుడు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. స్వయంగా హైకోర్టే హైడ్రాను తొమ్మిది తలల సర్పమని చెప్పిందంటే.. ఏ స్థాయిలో వీళ్లు అరాచకాలు చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. సీఎం రేవంత్‌కు ఒక వ్యక్తి ముఖ్యమో, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమో తేల్చుకోవాలన్నారు.1
- నల్లగొండ మండలం కొత్త పల్లిగ్రామపంచాయతీ ఆరో వార్డు సమస్య ఉంది మోరి వాటర్ పోకుండా కట్టలు పోయడం జరిగింది ఈ సమస్య వల్ల అక్కడ ఉన్న ప్రజలకు జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్యని ఎమ్మటే పరిష్కరించాలని కోరుతున్నాము1
- రాష్ట్ర విద్యాశాఖ పై కేంద్రం పెత్తనం వల్లే అవకతవకలు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖపై కేంద్రం పెత్తనం వల్లే పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర యూనివర్సిటీల మీద, పరీక్షల మీద కేంద్రం పెత్తనం చెలాయించడం ఆపేయాలి –రేవంత్ రెడ్డి1
- గాజులపల్లెలో వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవార్లకు బోనాలు మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని సుంకులమ్మ, దుర్గమ్మ, మారెమ్మ, పెద్దమ్మ ఆలయాల్లోని అమ్మ వార్లకు బోనాలు సమర్పించారు. మంగళవారం ఆషాడ మాసం పురస్కరించుకొని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకొన్నారు.అనంతరం అమ్మవార్లకు బోనాలు, ప్రసాదాలను సమర్పించుకున్నారు. వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవార్ల తీర్థప్రసాదాలను వితరణ చేశారు.1
- రేవంత్ రెడ్డి అహంకారానికి భారత రాజ్యాంగానికి మధ్య యుద్ధం జరుగుతుంది రేవంత్ రెడ్డి అహంకారానికి భారత రాజ్యాంగానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అందుకే అన్నారు ఈ బుల్డోజర్ పాలనను అణిచివేయాలని అని అన్నారు. ఈరోజు హైకోర్టు రంగనాథ్‌ను తీసి పక్కన పడేయడం శుభ పరిణామం అన్నారు.1
- కారును ఢీకొన్న టిప్పర్.. తప్పిన పెను ప్రమాదం. డ్రైవర్ పరార్. మహానంది మండల గాజులపల్లె గ్రామ సమీపంలోని డాక్టర్ శైలేంద్ర రెడ్డి గోడెం వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారును టిప్పర్ ఢీకొంది. మంగళవారం బసాపురం నుంచి నేషనల్ హైవే రోడ్డుకు మట్టి తరలిస్తుండగా నిలిపి ఉన్న కారును టిప్పర్ అతి వేగంతో ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో టిప్పర్ డ్రైవర్ పరారయ్యారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి తెలిపారు.1