కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్... కాంగ్రెస్ ను విమర్శించే ముందు కవితక్క అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనితీరు దోచుకో, దాచుకో అనే విధంగా ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి, దోచుకో దాచుకో నైజం కాంగ్రెస్ ది కాదని దానికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ దేనని విమర్శించారు. చేసిన ఆరోపణ పై కేటీఆర్ కు దమ్ముంటే కేంద్రంలోని ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు సోదరి కవితక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఓటమి భయంతో కేటీఆర్ ఏదిపడితే ఆది మాట్లాడుతున్నారని ఆరోపించారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అన్నారు.
కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్... కాంగ్రెస్ ను విమర్శించే ముందు కవితక్క అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనితీరు దోచుకో, దాచుకో అనే విధంగా ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి, దోచుకో దాచుకో నైజం కాంగ్రెస్ ది కాదని దానికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ దేనని విమర్శించారు. చేసిన ఆరోపణ పై కేటీఆర్ కు దమ్ముంటే కేంద్రంలోని ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు సోదరి కవితక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఓటమి భయంతో కేటీఆర్ ఏదిపడితే ఆది మాట్లాడుతున్నారని ఆరోపించారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అన్నారు.
- నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.1
- గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.1
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- జగిత్యాల : జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి.. కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్ రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ, మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు.. జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు. కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు.. తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు. రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం. ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం.. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన.. కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు. కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది. కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు. బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..2
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం ఘనంగా మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆశయాలు, సమానత్వ భావనలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన అలుపెరుగని కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ రూపకర్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ మహా అన్నదానం ద్వారా అంబేద్కర్ చూపిన సామాజిక సమానత్వ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందని వారు తెలిపారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.4