Shuru
Apke Nagar Ki App…
నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన మాజీ సిఎం కెసిఆర్ హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయల్దేరారు.నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి బయలుదేరారు.
Venkatesh
నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన మాజీ సిఎం కెసిఆర్ హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయల్దేరారు.నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి బయలుదేరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గిరిజనుల సంక్షేమం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, గృహ వసతి, విద్య, ఉపాధి సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు గిరిజన యువత ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధితో స్వయం సాధికారత సాధించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, ఆగస్టు 09: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 46 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజనుల విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఆలయం, కొత్త ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పాత పాఠశాల భవనాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే పథకాలు, సేవలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు లభిస్తాయని, అందువల్ల విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయడంతో పాటు నిరంతర సాధన, క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను చదవడమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, కొమరం భీమ్, బిర్సా ముండా వంటి మహనీయుల జీవితాలను తెలుసుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఆటలు, పాటలు, పుస్తక పఠనం, లైఫ్ స్కిల్స్ వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జిల్లాలోని 9 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, డెప్యుటేషన్ల రద్దు, మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తరగతి గదులు, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాఠశాలల వారీగా గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అన్ని ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు గతంలోనే ప్రాధాన్యత ఇచ్చామని, అనేక చోట్ల పనులు పూర్తయ్యాయని లేదా తుది దశలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని, బాల్య వివాహాల వైపు దృష్టి మళ్లించకుండా విద్య, ఉద్యోగం, స్వయం సాధికారతపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటికి తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరం కలిగిన వరి వంటి పంటల సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సుమారు 40 గ్రామాలను గుర్తించి, నీటి ఎద్దడి నివారణ పనులకు ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్.కె. తండా, సుగాలి మెట్ట తదితర ప్రాంతాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన భవన్‌కు స్థల పరిశీలన జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలన్న గిరిజన సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నంద్యాల పట్టణ పరిధిలో ప్రభుత్వ భూమి లభ్యత పరిమితంగా ఉండటం, అందుబాటులో ఉన్న కొన్ని భూములు నీటి వనరులకు సంబంధించినవి కావడంతో న్యాయస్థానాల మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉందని తెలిపారు. అందువల్ల నంద్యాల రూరల్, పాణ్యం రూరల్, మహానంది తదితర పట్టణానికి సమీప ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించి గిరిజన భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. శ్రీశైలంలోని మూసివేసిన ఎస్టీ హాస్టల్ భవనాన్ని స్వయంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి నిబంధనల మేరకు తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు గిరిజన మహిళలు తయారు చేసే వెదురు బుట్టలు, ఆభరణాలు, ఆకులతో తయారు చేసే విస్తరాకులు, కప్పులు, తేనె తదితర ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద వెదురుతో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించి నేరుగా విక్రయించడంతో పాటు బల్క్ ఆర్డర్లు పొందేలా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. చెంచు, పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రోత్సాహం ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగల (PVTG) కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా మరింత మెరుగైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద బైర్లూటీ, పాణ్యం కాలనీ, శ్రీశైలం మేకలబండ తదితర ప్రాంతాల్లో సుమారు 570 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అర్హులైన పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందుతుందని, మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు రీ-సర్వే, డాటెడ్ ల్యాండ్స్, 22-ఏ తదితర భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ప్రతి చిన్న సమస్య కోసం జిల్లా స్థాయి అధికారుల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆర్‌డీఓ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ROFR పట్టాలు, పాస్‌బుక్‌లకు సంబంధించి వారసులకు ఎదురవుతున్న సమస్యలను ఐటీడీఏ ద్వారా పరిష్కరించి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెంచు లక్ష్మిగూడెం వద్ద మిగిలిన 17 ఎకరాల భూమికి ROFR పట్టాలు, బోర్లు మంజూరు చేసి ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందించినట్లు వివరించారు. నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అటవీ సంరక్షణకు సంబంధించిన నిబంధనలను ప్రజలు, అధికారులు సమష్టిగా పాటించాలని సూచించారు. చెంచు, ఇతర గిరిజన కుటుంబాలకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, ఐటీడీఏ ద్వారా అవసరమైన సహాయం, మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏకు సంబంధించిన పాత ఫిర్యాదులు, విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం మరింత మెరుగుపరచేందుకు ముగ్గురు డీఎఫ్‌ఓలతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో స్మశాన వాటికలకు స్థల సమస్యను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, హిల్ పొరంబోకు భూములను పరిశీలించి అవసరమైన చోట్ల స్థానిక సంస్థలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో వాగులు దాటాల్సి వస్తున్న ప్రాంతాల్లో అవసరమైన వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలో వారి ప్రతిభ, ఉత్సాహం, భావ వ్యక్తీకరణను ప్రశంసిస్తూ, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి, సోషల్ వెల్ఫేర్ డిడి, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.1
- శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు1
- వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైతే.. ఇలా ఉంటుందా....?AI వీడియో సోషల్ మీడియాలో వైరల్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంటున్న వేళ.. ప్రాజెక్టు ప్రారంభమైతే నల్లమల సాగర్ ఎలా కనిపిస్తుందో చూపిస్తూ రూపొందించిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లమల సాగర్ కాలువల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం.. చుట్టూ పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్న దృశ్యాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెలిగొండ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ వీడియో AI సాంకేతికతతో రూపొందించిన ఊహాత్మక వీడియో మాత్రమే.. వాస్తవ దృశ్యాలు కావు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు. వెలిగొండ నీరు.. పచ్చని పొలాలు.. రైతుల చిరకాల కల సాకారం కావాలని ఆశిద్దాం.1
- డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరు మండలంలోని వీపనగండ్లలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో పర్యటించారు. కాలనీలో కాలువలు లేకపోవడం వల్ల వర్షపు నీరు అలాగా నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు.1