బెస్తరపల్లి సచివాలయంలో వివిధ సమస్యలపై వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు కుందుర్పి మండలం బెస్తరపల్లి సచివాలయంలో సీనియర్ సిపిఐ నాయకులు బి.కే. గోపాల్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉపాధి హామీ పనిని కల్పించాలని, కూలీలకు పనిముట్లు అందజేయడంతో పాటు వేసవి కాలంలో టెంట్లు అందుబాటులో ఉంచి మజ్జిగ సదుపాయం కల్పించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వివాద భూముల రిసర్వే పూర్తి చేసి, ఎవరి భూములు వాళ్లకి అప్పగించాలని, రద్దీ కారణంగా కుందుర్పి బ్యాంకులో రెన్యువల్ కు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బెస్తరపల్లి లో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించి ఏర్పాటు చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సచివాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రామరాజు, ఎల్లప్ప, నాగరాజు, గంగప్ప, నాగభూషణ, బి. కే. విజయ్ కుమార్, జయప్ప, తిప్పేస్వామి, చలపతి, హిమాన్, నారాయణ, హిమం సాబ్ తదితరులు పాల్గొన్నారు.
బెస్తరపల్లి సచివాలయంలో వివిధ సమస్యలపై వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు కుందుర్పి మండలం బెస్తరపల్లి సచివాలయంలో సీనియర్ సిపిఐ నాయకులు బి.కే. గోపాల్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉపాధి హామీ పనిని కల్పించాలని, కూలీలకు పనిముట్లు అందజేయడంతో పాటు వేసవి కాలంలో టెంట్లు అందుబాటులో ఉంచి మజ్జిగ సదుపాయం కల్పించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వివాద భూముల రిసర్వే పూర్తి చేసి, ఎవరి భూములు వాళ్లకి అప్పగించాలని, రద్దీ కారణంగా కుందుర్పి బ్యాంకులో రెన్యువల్ కు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బెస్తరపల్లి లో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించి ఏర్పాటు చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సచివాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రామరాజు, ఎల్లప్ప, నాగరాజు, గంగప్ప, నాగభూషణ, బి. కే. విజయ్ కుమార్, జయప్ప, తిప్పేస్వామి, చలపతి, హిమాన్, నారాయణ, హిమం సాబ్ తదితరులు పాల్గొన్నారు.
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్య సాయి కార్మికుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ఆర్యా, నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ 'నిరాహార దీక్ష' గురించి ముందస్తు నోటీసు. ఆర్యా, నేను, డాక్టర్ అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్తగా మరియు పుంగనూరు పౌరుడిగా ఈ క్రింది విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని చెరువు కట్ట రోడ్డు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల వస్తున్న విపరీతమైన దుమ్ము కారణంగా స్థానిక నివాసితులు, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గతంలోనే పత్రికల ద్వారా మరియు అధికారులకు విన్నపాల ద్వారా విన్నవించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోడ్డు పనులు పూర్తి చేసే వరకు దుమ్ము లేవకుండా నిరంతరం నీటిని చల్లాలని మరియు యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నా విజ్ఞప్తికి అధికారులు స్పందించని పక్షంలో, 13-05-2026 బుధవారము నుండి (లేదా మీరు నిర్ణయించుకున్న తేదీ నుండి) నేను నిరాహార దీక్షకు కూర్చుంటున్నానని ఈ నోటీసు ద్వారా తెలియజేస్తున్నాను. ఈ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలో నిర్వహించబడుతుంది. కావున, తగిన భద్రత మరియు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. 1
- అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలం జీడిపల్లిలో కుక్కల దాడిలో ఒకేసారి 52 గొర్రెపిల్లలు మృతి చెందాయి. ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన ఈ గొర్రెపిల్లల మృతితో రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో ఎర్రిస్వామి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.1