రాఖీ పౌర్ణమి వేళ జంజిరాల పౌర్ణమి వేడుకలు ఘనంగా.. శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు హనుమకొండ జిల్లా, కమలాపూర్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంజిరాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాల్లో గ్రామస్థులు, పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞోపవీత ధారణ, హోమ పూజలు, రక్షాబంధన్ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంజిరాల పౌర్ణమి విశిష్టతను గుర్తుచేసుకుంటూ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కమలాపూర్‌లోని గ్రామ దేవతల ఆలయాలతో పాటు స్థానిక శివాలయాలు, హనుమాన్ ఆలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లోని దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన జంజిరాల పౌర్ణమి వేడుకలతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
రాఖీ పౌర్ణమి వేళ జంజిరాల పౌర్ణమి వేడుకలు ఘనంగా.. శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు హనుమకొండ జిల్లా, కమలాపూర్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంజిరాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాల్లో గ్రామస్థులు, పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞోపవీత ధారణ, హోమ పూజలు, రక్షాబంధన్ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంజిరాల పౌర్ణమి విశిష్టతను గుర్తుచేసుకుంటూ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కమలాపూర్‌లోని గ్రామ దేవతల ఆలయాలతో పాటు స్థానిక శివాలయాలు, హనుమాన్ ఆలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లోని దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన జంజిరాల పౌర్ణమి వేడుకలతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
- రాఖీ పౌర్ణమి వేళ జంజిరాల పౌర్ణమి వేడుకలు ఘనంగా.. శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు హనుమకొండ జిల్లా, కమలాపూర్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంజిరాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాల్లో గ్రామస్థులు, పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞోపవీత ధారణ, హోమ పూజలు, రక్షాబంధన్ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంజిరాల పౌర్ణమి విశిష్టతను గుర్తుచేసుకుంటూ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కమలాపూర్‌లోని గ్రామ దేవతల ఆలయాలతో పాటు స్థానిక శివాలయాలు, హనుమాన్ ఆలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లోని దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన జంజిరాల పౌర్ణమి వేడుకలతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.1
- పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు జనగామ జిల్లా : పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాల లో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి గోవులకు దీపహారతి ఇచ్చారు. స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఇచ్చారు. గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ రక్షాబంధన్ వేడుకలు చేశారు.మూగజీవులపై ప్రేమాభిమానాలు చాటుకున్న ఆ కుటుంబం. సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన వినూత్న వేడుకలు జరిగాయి.పాలకుర్తిలో ఆకట్టుకున్న గోమాతలతో రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు.1
- బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.1
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు1
- *ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా కౌశిక హరి - లత దంపతుల ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఆప్యాయంగా జరిగాయి. వారి ముద్దుల కూతురు తన చిన్నారి తమ్ముడికి, ప్రేమానురాగాలతో తన డాడీకి రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంది. కుటుంబ బంధాల తీపిని తెలిపే ఈ మధుర క్షణాలు మీకోసం!* రక్షాబంధన్ సందర్భంగా కౌశిక హరి - లత దంపతుల ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఆప్యాయంగా జరిగాయి. వారి ముద్దుల కూతురు తన చిన్నారి తమ్ముడికి, ప్రేమానురాగాలతో తన డాడీకి రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంది. కుటుంబ బంధాల తీపిని తెలిపే ఈ మధుర క్షణాలు మీకోసం!* 💖✨ 🏵️1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1