Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from Tirupati and nearby areas
- Post by Bondhu Suresh2
- *బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీరు, నాసి రకం భోజనం* నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటి వివాదం కలకలం రేపుతోంది. ట్యాప్‌ల నుండి బురద నీరు వస్తుండటంతో విద్యార్థులు చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని TSAS విద్యార్థి సంఘం వీడియోలు విడుదల చేసింది. కలెక్టర్ సమీక్షతో గత నెల 30న తరగతులు ప్రారంభమైన నాటి నుండే ఈ కలుషిత నీటి సమస్య తీవ్రమైందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.1
- ధరణి తిమ్మాయపల్లెలో శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని దర్శించుకున్న విదేశీ భక్తులు. బద్వేలు, నవంబర్ 10: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు డివిజన్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గ లోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని పలు దేశాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అమెరికా, న్యూజిలాండ్, యూరప్ తదితర దాదాపు పది దేశాల నుంచి వచ్చిన విదేశీ భక్తులు ఆశ్రమాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అవధూత కొండయ్య స్వామి వారి ఆధ్యాత్మిక ప్రస్థానం, విశిష్టతలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆశ్రమ దివ్య వాతావరణం, స్వామి వారి సాన్నిధ్యం తమకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందించాయని విదేశీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ భక్తుల రాకతో ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. భక్తులు స్వామి వారి చరిత్ర, ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు, సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ నిర్వాహకులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- శ్రీరామ్ చిన్న బాబును కలిసిన విద్యుత్ శాఖ సిబ్బంది.... *విద్యుత్ శాఖ సిబ్బంది మర్యాదపూర్వక భేటీ* తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు, మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు నివాసంలో విద్యుత్ శాఖ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో విద్యుత్ సరఫరా, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. సిబ్బంది సమస్యలపై కూడా చినబాబు ఆరా తీశారు.1
- శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఘనంగా చండీహోమం.... . దిగువపల్లి, చౌడేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా ఆంధ్ర రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు నేడు అనగా 09-11-2026 వ తేదీ అమావాస్య సందర్భంగా చండీహోమం నిర్వహించడం జరిగింది. సదరు చండీహోమంలో ఒక దంపతులు పాల్గొని వారి అభీష్ట సిద్ధి కొరకు హోమం చేయడం జరిగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా చండీహోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరంగారు దంపతులకు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదములు అందజేశారు.4
- కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.1
- కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో తాగునీటికోసం రోడ్డు ఎక్కిన ప్రజలు! కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో తాగునీటి కోసం ఖాళీ బిందులతో రోడ్డెక్కినప్రజలు ఒకటో వార్డులో గత 15 రోజులుగా నీటికొరత తీవ్రంగా ఉందని.. అధికారులకి,కూటమి నేతలకు ఎన్నీసార్లు మోరపేట్టుకున్న పట్టించుకోవడం లేదని మహిళలు,కాలనీ వాసులు ఆగ్రహంతో మoడిపడుతున్నారు.వీరు తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.1
- బద్వేలులో తెలుగుదేశం నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఫైర్.. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరిక..! మబద్వేలు,నవంబర్ 9: కడప జిల్లా బద్వేలులో రాజకీయంగా మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. నామపత్రాల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. గెలుపోటములను నిర్ణయించేది నాయకులు కాదని, ప్రజలేనని స్పష్టం చేస్తూ తెలుగుదేశం నేతలకు హెచ్చరిక జారీ చేశారు.తమ పార్టీ అభ్యర్థులపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంశాలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరు అభివృద్ధి కోసం పని చేస్తున్నారో, ఎవరు కేవలం ఆరోపణలతో కాలం గడుపుతున్నారో తెలుసుకోగలరని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.4