logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్ : చైర్మన్ గా కనుగు రాధిక, వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 14 మంది కౌన్సిలర్లతో పాటు బీఎస్పీ 1, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ముందుగా 32 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేపట్టారు. తర్వాత నిర్వహించిన చైర్మన్ ఎన్నికలకు 24 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానుగు రాధిక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ ప్రతిపాదించారు. వారి ప్రతి పాదన ను 19 వ వార్డు కౌన్సిలర్ గంట సంపత్ బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది కౌన్సిలర్లు ఒక బీఎస్పీ కౌన్సిలర్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే రోహిత్ రావు చేతులెత్తి బలపరిచారు. బిజెపి సభ్యులు ఎన్నిక సమయంలో లేకపోవడంతో 30 మంది సభ్యులలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి 16 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. బిఆర్ఏస్ పార్టీ తరఫున మూడో వార్డు కౌన్సిలర్ కొట్టాల లలితను ఆ పార్టీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ప్రతిపాదించారు. బట్టి ఉదయ్ కుమార్ బలపరిచారు వారికి సరిపోయిన అన్ని ఓట్లు లేకపోవడంతో ముందుగా 16 ఓట్లు వచ్చిన కానుగు రాధికను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు. అనంతరం బిఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. కోరం ఉన్నందున వైస్ చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారులు చేపట్టారు వైస్ చైర్మన్ అభ్యర్థిగా దొంతి నరేష్ గౌడ్ ను అరుణార్థి వెంకటరమణ ప్రతిపాదించారు. తోడుపునూరి శివరామకృష్ణ బలపరిచారు దీంతో వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక దొంతి నరేష్ గౌడ్ లను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధిని చేసి చూపుతామని ఆయన తెలిపారు.

1 day ago
user_MERCY
MERCY
Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
1 day ago

మెదక్ : చైర్మన్ గా కనుగు రాధిక, వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 14 మంది కౌన్సిలర్లతో పాటు బీఎస్పీ 1, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ముందుగా 32 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేపట్టారు. తర్వాత నిర్వహించిన చైర్మన్ ఎన్నికలకు 24 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానుగు రాధిక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ ప్రతిపాదించారు. వారి ప్రతి పాదన ను 19 వ వార్డు కౌన్సిలర్ గంట సంపత్ బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది కౌన్సిలర్లు ఒక బీఎస్పీ కౌన్సిలర్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే రోహిత్ రావు చేతులెత్తి బలపరిచారు. బిజెపి సభ్యులు ఎన్నిక సమయంలో లేకపోవడంతో 30 మంది సభ్యులలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి 16 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. బిఆర్ఏస్ పార్టీ తరఫున మూడో వార్డు కౌన్సిలర్ కొట్టాల లలితను ఆ పార్టీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ప్రతిపాదించారు. బట్టి ఉదయ్ కుమార్ బలపరిచారు వారికి సరిపోయిన అన్ని ఓట్లు లేకపోవడంతో ముందుగా 16 ఓట్లు వచ్చిన కానుగు రాధికను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు. అనంతరం బిఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. కోరం ఉన్నందున వైస్ చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారులు చేపట్టారు వైస్ చైర్మన్ అభ్యర్థిగా దొంతి నరేష్ గౌడ్ ను అరుణార్థి వెంకటరమణ ప్రతిపాదించారు. తోడుపునూరి శివరామకృష్ణ బలపరిచారు దీంతో వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక దొంతి నరేష్ గౌడ్ లను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధిని చేసి చూపుతామని ఆయన తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • కన్నుల పండుగగా రథోత్సవం వైభవంగా నిర్వహణ ఏడుపాయల వన దుర్గ మాత జాతర మహోత్సవ చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతులు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    1
    కన్నుల పండుగగా రథోత్సవం వైభవంగా నిర్వహణ
ఏడుపాయల వన దుర్గ మాత   జాతర మహోత్సవ చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగగా జరిగింది. 
ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు.
ప్రత్యేక పూజలు, హారతులు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది.
ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. 
దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    20 min ago
  • కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/
ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో 
మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    52 min ago
  • Mattress Manufacturers Company in Hyderabad Call Now: 8106660022
    1
    Mattress Manufacturers Company in Hyderabad Call Now: 8106660022
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    5 hrs ago
  • మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    2
    ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • మెదక్ జిల్లా*17 ఫిబ్రవరి 2026 మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిఫిబ్రవరి 17 , 2026:ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ., ఏ.ఈ.ఆర్.ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు గాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని తెలిపారు. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ రాహుల్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి , తాసిల్దార్ శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    మెదక్ జిల్లా*17 ఫిబ్రవరి 2026
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి 
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిఫిబ్రవరి 17 , 2026:ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ., ఏ.ఈ.ఆర్.ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు గాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని తెలిపారు. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ రాహుల్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి  , తాసిల్దార్ శ్రీనివాస్  అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.