Shuru
Apke Nagar Ki App…
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరణ సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
Praveen
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరణ సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- " *ఎవరు ఈ కాన్షీరామ్ ?? కాన్షీరామ్ ఎక్కడా విన్న ఈ పేరే????నాటి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నేటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాన్షీరామ్ దాదాసాహెబ్ గురించి మాట్లాడటం ఏంటి మతలాబు బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ అగ్రకులాల పేదల ఆయనను అర్థం చేసుకునేది ఎప్పుడో* ???? 🧭 కాన్షీరామ్ వారసత్వం: ఆలోచనల అసలు సారం Kanshi Ram గారు భారతదేశంలో దళిత, బహుజన రాజకీయ చైతన్యానికి కీలక వ్యక్తి. ఆయన ప్రధానంగా చెప్పినది: “రాజకీయ శక్తి లేకుండా సామాజిక మార్పు అసాధ్యం” బహుజన వర్గాలు (SC, ST, BC, మైనారిటీలు) కలిసినప్పుడు మాత్రమే పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది అంటే ఆయన ఆలోచనల అసలు ఉద్దేశ్యం—సంఖ్యాబలం ఉన్న వర్గాలు తమ రాజకీయ హక్కులను వినియోగించుకుని స్వయం ప్రతినిధిత్వాన్ని సాధించాలి. --- 🗳️ ఇతర పార్టీలు కాన్షీరామ్ పేరు వినియోగించడం — ఎందుకు? ఈరోజుల్లో అనేక రాజకీయ పార్టీలు (ప్రాంతీయమైనా, జాతీయమైనా) Kanshi Ram గారి పేరు లేదా సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంటాయి. ఇందుకు కొన్ని కారణాలు: బహుజన ఓటు బ్యాంక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం సామాజిక న్యాయం అనే భావన ప్రజల్లో బలంగా ఉండటం చారిత్రక నాయకుల వారసత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం ఇది రాజకీయాల్లో సాధారణ వ్యూహం. కానీ పేరు చెప్పడం వేరు, ఆలోచనలను అమలు చేయడం వేరు—ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. --- ⚖️ “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” — విశ్లేషణ ఈ నినాదం భావోద్వేగంగా బలంగా ఉన్నా, కొన్ని వాస్తవాలు గమనించాలి: ✔️ సానుకూల దృష్టికోణం ఓటు హక్కు మనకున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఒకే వర్గం చైతన్యంగా ఉంటే రాజకీయ ప్రభావం పెరుగుతుంది స్వయం నాయకత్వం (self-representation) ద్వారా సమస్యలు బాగా ప్రతిబింబిస్తాయి ⚠️ సవాళ్లు సమాజం పూర్తిగా ఏకరీతి కాదు—SC, ST, BC, మైనారిటీల్లో కూడా విభజనలు ఉంటాయి కేవలం కులం లేదా వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తే విభజనలు మరింత పెరిగే ప్రమాదం మంచి పాలనకు సామర్థ్యం, విధానాలు, పారదర్శకత కూడా అవసరం—కేవలం గుర్తింపు (identity) సరిపోదు --- 🧠 ఓటర్ల బాధ్యత — భావోద్వేగం vs విశ్లేషణ ఓటు వేయడం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకూడదు. పరిశీలించాల్సిన అంశాలు: అభ్యర్థి పనితీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అవినీతి, పారదర్శకత విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో పాలసీలు --- 🔍 తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సందర్భం ఈ రెండు రాష్ట్రాల్లో: బహుజన వర్గాల సంఖ్య ఎక్కువే అయినా రాజకీయంగా వారు విభజితంగా ఉంటారు ప్రధాన పార్టీల మధ్య పోటీ కారణంగా ఓట్లు విడిపోతాయి దీని వల్ల ఏకీకృత శక్తి తగ్గుతుంది—ఇది మీ ఆవేదనలో కనిపిస్తున్న ముఖ్యాంశం. --- 🧩 ముందుకు మార్గం ఏమిటి? 1. చైతన్యం పెరగాలి – ఓటు విలువపై అవగాహన 2. విభజనలు తగ్గాలి – వర్గాల మధ్య ఐక్యత 3. నాయకత్వ నాణ్యత పెరగాలి – కేవలం గుర్తింపు కాకుండా సామర్థ్యం 4. పాలసీ ఆధారిత రాజకీయాలు – దీర్ఘకాల అభివృద్ధి కోసం --- 📝 సారాంశం మీరు చెప్పిన “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” అనే భావనలో ఒక బలమైన స్వాభిమాన సందేశం ఉంది. కానీ అది సఫలమవ్వాలంటే: ఐక్యత + అవగాహన + సమర్థ నాయకత్వం మూడూ కలిసివస్తేనే సాధ్యం.1
- పత్రికా ప్రకటన తేది: 26.04.2026 కామారెడ్డి జిల్లా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా వాసవి మాతా జయంతి ఉత్సవం ఆదివారం నాడు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాల అలంకరించారు. ఈ కార్యక్రమం లో వైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1
- జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.2
- గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్‌పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్‌పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కరీంనగర్ లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీల్లో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈరోజు అఖిల సాయికృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాకులు తెలిపారు. దేవిపుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు.1
- *హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన......!!* * *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు* *మహాసభ సందర్భంగా ఆత్మీయ కలయికలో DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారిని సాల్వతో సత్కరించిన బిర్ల ఐలయ్య ఆలేరు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్*1
- కామారెడ్డి జిల్లా, 26-04-2026 కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఘనంగా నిర్వహించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు మరియు శివపార్వతుల కల్యాణ మహోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథిగా హాజరై నారు, కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గారు ముందుగా వాసవి మాత ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ గారు మాట్లాడుతూ, వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవమని, ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సమానంగా కృషి చేస్తోందని, ప్రతి సమాజానికి తమ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందని షబ్బీర్ అలీ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి , ఐరేనీ సందీప్, దేవరాజ గౌడ్, గంప ప్రసాద్,దివ్య పాత, వలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం, భాస్కర్. తిరుమల గౌడ్, ఐరనీ నరసయ్య, ఇంద్రసేనారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వైశ్య సంఘాల నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి భావంతో జరిగిన ఈ వేడుకలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది1