ఈనెల 15వ తారీకు నుంచి 23వ తారీకు వరకు తీజ్ ఉత్సవాలు ఓయూ లోఫాస్టర్ ఆవిష్కరణ.. ఈనెల 23వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శరత్ నాయక్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉత్సవాలకు బంజారా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 13 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 15వ తారీకు నుంచి 23వ తారీకు వరకు తీజ్ ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. టూటా ప్రధాన కార్యదర్శి ప్రో. శ్రీను చౌహన్, విద్యార్థి నాయకులు డా. కరాటే రాజు, విజేందర్ పవార్, అశోక్ నాయక్, మహేష్ నాయక్, రవి నాయక్, శరత్ నాయక్, రవీందర్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 15వ తారీకు నుంచి 23వ తారీకు వరకు తీజ్ ఉత్సవాలు ఓయూ లోఫాస్టర్ ఆవిష్కరణ.. ఈనెల 23వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శరత్ నాయక్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల
వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉత్సవాలకు బంజారా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 13 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 15వ
తారీకు నుంచి 23వ తారీకు వరకు తీజ్ ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. టూటా ప్రధాన కార్యదర్శి ప్రో. శ్రీను చౌహన్, విద్యార్థి నాయకులు డా. కరాటే రాజు, విజేందర్ పవార్, అశోక్ నాయక్, మహేష్ నాయక్, రవి నాయక్, శరత్ నాయక్, రవీందర్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- కంటి వెలుగు ఆపేశారు: కేటీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన 'కంటి వెలుగు'ను కొనసాగించేలా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మనల్ని చూసైనా ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని హితవు పలికారు.2
- కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్‌ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి1
- నర్సాపూర్ పట్టణంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం.. ... ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారి అధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎబివిపి నాయకులు రంజిత్ మోహన్ గారు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగ యాత్ర సందర్భంగా 500 అడుగుల జాతీయ పతకంతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ సిగ్నల్ పాయింట్ నుండి తిరిగి మళ్ళీ సిగ్నల్ పాయింట్ వరకు ఘనంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడుతూ నేడు విద్యార్థులందరూ త్రివర్ణ పతాక చేతపట్టి నర్సాపూర్ పట్టణంలో విజయవంతంగా ఈ ర్యాలీని జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనం అందరం మన యొక్క ఇంటి పైన కుటుంబ సభ్యులతో జాతీయ జెండాను ఎగురవేసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో భారత దేశం యొక్క గొప్పతనని చాటి చెప్పాల్సిన అవసరం మన అందరిది అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీకి సహకరించిన విద్యార్థినీ విద్యార్థులకు టీచర్లకు ప్రెస్ రిపోర్టర్లకు పోలీస్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ భుచేష్ యాదవ్, సీనియర్ నాయకులు పంజా విజయ్ కుమార్, నర్సాపూర్ కౌన్సిలర్ నిరంజన్ దాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్, నారాయణ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శులు అశోక్ సాదుల, ఎరుకల భిక్షపతి, బాదే బాలరాజ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జనార్ధన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండం శంకర్, బిట్ల మహేష్, మండల అధ్యక్షులు నీరుడి చంద్రయ్య, నీలి నాగేష్, పెద్దపులి రవి, నాగ ప్రభు గౌడ్, నాగేందర్ రెడ్డి, నర్సాపూర్ మండల ప్రధాన కార్యదర్శిలు కోదండ రామిరెడ్డి, సంఘసాని రాజు, యువ మోర్చా జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్, పోతరాజు అనిల్, రాజేష్, చందు, సాయి, చారి, వంశీ, సురేష్, గణేష్, నరేష్, మహేందర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు మోర్చాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.1
- తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- కల్తీ ఆహారానికి చెక్ పెట్టిన ఉప్పల్ SOT... పీర్జాధిగూడ గల్ఫ్ బేకరిపై దాడి విశ్వసనీయ సమాచారంతో SOT ఉప్పల్ జోన్ బృందం పీర్జాదిగూడలోని గల్ఫ్ బేకరీపై దాడి నిర్వహించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ముడి పదార్థాలు, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ఫ్లేవర్, జామ్, సాస్ మరియు కేకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తే కఠిన చర్యలు తప్పవు.2
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- పటాన్‌చెరు ఆబ్కారీ స్టేషన్ నుంచి హెరాయిన్ కేసు నిందితుడు పరారీ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఆబ్కారీ స్టేషన్ నుంచి హెరాయిన్ కేసులో అరెస్టైన నిందితుడు సహిదూర్ రహమాన్ పరారయ్యాడు. మంగళవారం రాత్రి పటాన్‌చెరు శివారులో హెరాయిన్ విక్రయిస్తున్న సమయంలో ఆబ్కారీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆబ్కారీ స్టేషన్‌లోని లాక్‌అప్‌లో ఉంచారు. అయితే బుధవారం తెల్లవారుజామున లాక్‌అప్ గ్రీల్స్‌ను విరగగొట్టి నిందితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనపై ఆబ్కారీ అధికారులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీకి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.1