Shuru
Apke Nagar Ki App…
ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద గల తాటి వనం బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా దగ్ధమైంది. ఈ ఆకస్మిక సంఘటనతో ప్రక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. తాటి వనం దగ్ధం అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Devender Pasunoori
ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద గల తాటి వనం బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా దగ్ధమైంది. ఈ ఆకస్మిక సంఘటనతో ప్రక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. తాటి వనం దగ్ధం అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
More news from Telangana and nearby areas
- ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద గల తాటి వనం బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా దగ్ధమైంది. ఈ ఆకస్మిక సంఘటనతో ప్రక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. తాటి వనం దగ్ధం అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట ప్రాంతంలో ఈరోజు భారీ వర్షం కురుస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఇలా భారీ స్థాయిలో వర్షం పడటం గమనార్హం.1
- బుధవారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం ఎలిషెట్టిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్‌ను స్థానికులు తెప్పపై జంపన్నవాగు దాటించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, భారీ వర్షాల కారణంగా జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి, సమయానికి వైద్యం అందడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ ఆలస్యం కారణంగా రాకేష్ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలమిత్ర ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. తరగతి గదిలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో తీవ్ర ఆవేదనకు గురైన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, చిన్నారి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతిపై ఆరా తీశారు. గత కొంత కాలంగా ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోందని, అనారోగ్య సమస్యతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను విరమింపజేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తగిన చర్యలు చేపడతామని పోలీసులు వివరించారు.4
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీసుగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గీసుగొండ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీసుగొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక నినాదాల రచన, క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల నుంచి గ్రామ ప్రధాన వీధుల వరకు భారీ అవగాహన ర్యాలీ చేపట్టి, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు. డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన నినాదాలతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలనే కాకుండా కుటుంబాలు, సమాజాన్ని కూడా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్, పొగాకు వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, చదువు, క్రీడలు, సృజనాత్మక రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల సమిష్టి బాధ్యత ఎంతో కీలకమని ఆయన నొక్కి చెప్పారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమం ముగింపులో, విద్యార్థుల చేత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గీసుగొండ పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని పల్లెపహాడ్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మాజీ జెడ్పీటీసీ రాములు నిర్మిస్తున్న ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ లంచం ఇవ్వకపోవడం వల్ల రాజకీయ కక్షతో తన ఇంటిని కూల్చివేశారని రాములు తీవ్రంగా ఆరోపించారు. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి, మల్లన్నసాగర్ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించిన ఆయన, నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలు, ప్లాట్లు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ భూ బాధితుల సమస్యలపై త్వరలో భారీ సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపాలని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ, మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం హామీలు అమలు చేయాలని స్పష్టం చేసింది.1
- శుభ్ మూమెంట్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ చిన్న మరియు మధ్య స్థాయి కార్యక్రమాల కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తోంది. ఈ ఆర్గనైజర్స్ పుట్టినరోజు ఈవెంట్ ప్యాకేజీలు, వివాహ వార్షికోత్సవ ప్యాకేజీలు, కార్పొరేట్ ఈవెంట్ ప్యాకేజీలు మరియు ఫామ్‌హౌస్ పార్టీ ప్యాకేజీలతో సహా పలు రకాల సేవలను అందిస్తున్నారు. మరింత సమాచారం కోసం 8074406344 నంబర్‌ను సంప్రదించవచ్చు.1
- 23/06/2026న మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీస్ భవన్, తెలుగు సంక్షేమ భవన్ వద్ద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో రాజ్యసభ MP టైగర్ ఆర్ కృష్ణన్న బృందంతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ తరపున నిర్వహించారు.1