బాల్య స్మృతులకు మళ్లీ జీవం .... పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 2005-06 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఆనందంతో మునిగిపోయారు. పాఠశాల రోజులలో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ తమ బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. ఒకే తరగతి గదిలో చదివిన రోజులు, కలిసి చేసిన ఆటపాటలు, పంచుకున్న అనుబంధం—all ఇవన్నీ మరోసారి ప్రత్యక్షమయ్యాయి. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ అప్పటి సరదా సంఘటనలను గుర్తుచేసుకొని నవ్వులు పూయించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఆటపాటలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యార్థులు వివిధ రంగాల్లో ఎదిగి ఉన్నత స్థానాల్లో నిలవడం గర్వకారణమని తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత కూడా గురువులను గుర్తు పెట్టుకుని ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల మధ్య స్నేహబంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు నారెడ్డి సుదర్శన్ రెడ్డి, శేషాచారి, మోహనరెడ్డి, కిరణ్, సురేష్, శ్రీధర్ శర్మ, ఆంజనేయులు, స్వామి, శ్రీనివాస్, వెంకటరాజం, సత్తర్ తదితరులు పాల్గొన్నారు. చివరగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సహపంక్తి భోజనాలు చేసి, గ్రూప్ ఫోటోలు దిగుతూ తీయని జ్ఞాపకాలతో కార్యక్రమాన్ని ముగించారు.
బాల్య స్మృతులకు మళ్లీ జీవం .... పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 2005-06 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఆనందంతో మునిగిపోయారు. పాఠశాల రోజులలో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ తమ బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. ఒకే తరగతి గదిలో చదివిన రోజులు, కలిసి చేసిన ఆటపాటలు, పంచుకున్న అనుబంధం—all ఇవన్నీ మరోసారి ప్రత్యక్షమయ్యాయి. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ అప్పటి సరదా సంఘటనలను గుర్తుచేసుకొని నవ్వులు పూయించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఆటపాటలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యార్థులు వివిధ రంగాల్లో ఎదిగి ఉన్నత స్థానాల్లో నిలవడం గర్వకారణమని తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత కూడా గురువులను గుర్తు పెట్టుకుని ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల మధ్య స్నేహబంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు నారెడ్డి సుదర్శన్ రెడ్డి, శేషాచారి, మోహనరెడ్డి, కిరణ్, సురేష్, శ్రీధర్ శర్మ, ఆంజనేయులు, స్వామి, శ్రీనివాస్, వెంకటరాజం, సత్తర్ తదితరులు పాల్గొన్నారు. చివరగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సహపంక్తి భోజనాలు చేసి, గ్రూప్ ఫోటోలు దిగుతూ తీయని జ్ఞాపకాలతో కార్యక్రమాన్ని ముగించారు.
- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలల లో గత రాత్రి ఆకతాయిలు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో ఉన్న సామాగ్రి తో పాటు టీచింగ్ మెటీరియల్ ను ధ్వంసం చేశారు. నేడు ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో సామాగ్రి.ధ్వంసం అయి ఉండడం తో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొంత మంది గంజాయి మత్తులో ఈ అరాచకం సృష్టించి ఉంటారని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టీచింగ్ మెటీరియల్ ధ్వంసం చేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు..1
- Post by Vodnala thirupthi1
- *హుజూరాబాద్ డంప్ యార్డ్ పై బీజేపీ యుద్దభేరీ...* *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు. *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.1
- తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన ఆయన... తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి... మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప... కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదన్న గంగుల... కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని గంగుల తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమా అంటు ప్రశ్నించారు. ఎకరాన ఎన్ని క్వింటాళ్ళు పండితే అన్ని క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న గంగుల... ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాన్ని నడిపించి... మధ్యలో ఎత్తివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.3