logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ధర్మవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలాలలో మద్యం దుకాణాల రెన్యువల్స్ కు చేసినట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు ధర్మవరం: జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. 18 ఓపెన్ క్యాటగిరి 2 రిజర్వుడ్ కేటగిరి ధర్మవరము, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మద్యం దుకాణాలు రెన్యువల్ నిమిత్తము గెజిట్ విడుదల చేయడం జరిగిందని ధర్మవరం ఎక్సైజ్ సీఐ ఎన్ చంద్రమణి తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయంలో లైసెన్సు మద్యం లైసెన్స్ దారులకు సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓపెన్ క్యాటగిరి, రిజర్వేషన్ కేటగిరి కింద మద్యం దుకాణాల యొక్క రెన్యువల్ ఫీజు, కట్టవలసిన లైసెన్స్ ఫీజు ఇతర వివరాలని వారికి క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు. సంవత్సరానికి 2026 - 27 లైసెన్స్ ఫీజును 4 వాయిదాలలో చెల్లించే అవకాశం ఉంటుంది అని తెలిపారు. పర్మిట్ రూమ్ మొత్తంను 3 వాయిదాలలో చెల్లించవచ్చు అని తెలిపారు . సెప్టెంబర్ నెల 21వ తారీకు సాయంత్రం 05 గంటల లోపల మద్యం దుకాణాల రెన్యూవల్ సరిపడా రుసుమును ప్రభుత్వం వారికి చెల్లించాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగినది అని తెలిపారు.కాగా రెన్యువల్ కు ముందుకు రాని మద్యం దుకాణాలకు, సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు చెల్లించని వాటికి వారి మద్యం లైసెన్సులు రద్దు చేసి, వాటి స్థానంలో సెప్టెంబర్ నెల 22వ తారీకు నుండి నూతన మద్యం షాపుల టెండర్లకు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఎస్సైలు చాంద్ బాషా, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు, మద్యం దుకాణాల వారు పాల్గొన్నారు.

2 hrs ago
user_పుట్టపర్తి మల్లికార్జున
పుట్టపర్తి మల్లికార్జున
చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
13e644df-b46a-4817-bee8-bfb80cc5d5b8

ధర్మవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలాలలో మద్యం దుకాణాల రెన్యువల్స్ కు చేసినట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు ధర్మవరం: జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. 18 ఓపెన్ క్యాటగిరి 2 రిజర్వుడ్ కేటగిరి ధర్మవరము, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మద్యం దుకాణాలు రెన్యువల్ నిమిత్తము గెజిట్ విడుదల చేయడం జరిగిందని ధర్మవరం ఎక్సైజ్ సీఐ ఎన్ చంద్రమణి తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయంలో లైసెన్సు మద్యం లైసెన్స్ దారులకు సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓపెన్ క్యాటగిరి, రిజర్వేషన్ కేటగిరి కింద మద్యం దుకాణాల యొక్క రెన్యువల్ ఫీజు, కట్టవలసిన లైసెన్స్ ఫీజు ఇతర వివరాలని వారికి క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు. సంవత్సరానికి 2026 - 27 లైసెన్స్ ఫీజును 4 వాయిదాలలో చెల్లించే అవకాశం ఉంటుంది అని తెలిపారు. పర్మిట్ రూమ్ మొత్తంను 3 వాయిదాలలో చెల్లించవచ్చు అని తెలిపారు . సెప్టెంబర్ నెల 21వ తారీకు సాయంత్రం 05 గంటల లోపల మద్యం దుకాణాల రెన్యూవల్ సరిపడా రుసుమును ప్రభుత్వం వారికి చెల్లించాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగినది అని తెలిపారు.కాగా రెన్యువల్ కు ముందుకు రాని మద్యం దుకాణాలకు, సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు చెల్లించని వాటికి వారి మద్యం లైసెన్సులు రద్దు చేసి, వాటి స్థానంలో సెప్టెంబర్ నెల 22వ తారీకు నుండి నూతన మద్యం షాపుల టెండర్లకు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఎస్సైలు చాంద్ బాషా, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు, మద్యం దుకాణాల వారు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116
    1
    శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
    user_Narasimharaju
    Narasimharaju
    Astrologer అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    1
    నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్
ఓడి చెఱువు  సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    1
    వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి
వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని
సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    1
    కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.
    1
    రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ
రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్
కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    2
    గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు
యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు
గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు
యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు
గుమ్మనూరు, సెప్టెంబర్ 15:
ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి.
ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు.
వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    1
    పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్
కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు  సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం
తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.