logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం – రిజెక్ట్ కోల్‌లో మంటలు..ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ ఒక్కసారిగా అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రతతో పాటు గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం – రిజెక్ట్ కోల్‌లో మంటలు..ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ ఒక్కసారిగా అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రతతో పాటు గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

More news from తెలంగాణ and nearby areas
  • Post by నీరటి మహేందర్
    1
    Post by నీరటి మహేందర్
    user_నీరటి మహేందర్
    నీరటి మహేందర్
    మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.
    2
    సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో  దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు.
పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు.
గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    user_Prakash
    Prakash
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    22 min ago
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం  పోస్టర్ ను  లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను  ఏడు గ్రామాల  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.
    user_Kommera Rajureddy Reporter
    Kommera Rajureddy Reporter
    రియల్ ఎస్టేట్ తిమ్మాపూర్ ఎల్‌ఎండి, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.
    3
    స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.
జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్  మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.
    1
    డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు  స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి మల్లేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సమావేశంలో సీఎం సందేశం వినిపించగా, మండలంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి మల్లేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సమావేశంలో సీఎం సందేశం వినిపించగా, మండలంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మన ఊరు మన బడిలో నిర్మించిన అదనపు గదుల బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ వినూత్న ఆందోళనకు దిగారు. పిల్లలను బయట పంపించి స్కూల్ గేట్ కు తాళం వేశారు. వల్లంపట్ల పాఠశాల అదనపు గదులు, కిచెన్ షెడ్డు నిర్మాణం దాదాపు 22 లక్షలు పెట్టి మాజీ సర్పంచ్ మూడేళ్ళ క్రితం ఫూర్తి చేశారు. పనులు పూర్తై బిల్డింగ్ వినియోగం లోకి వచ్చినా బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ అనసూయ భర్త ఆందోళనకు దిగారు. స్కూల్ అదనపు తరగతి గదులకు, కిచెన్ షెడ్ కు తాళం వేశారు .గదులు తాళం వేయడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు అధికారులు, పోలీసులు చేరుకుని మాజీ సర్పంచ్ భర్తను సముదాయించారు. బిల్లులు వచ్చేవరకు తాళం తీయనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక మరో గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షల వరకు ఉందని అందులో ఐదో పదో ఇచ్చి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో తనకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు‌. స్పాట్ బైట్...
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మన ఊరు మన బడిలో నిర్మించిన అదనపు గదుల బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ వినూత్న ఆందోళనకు దిగారు. పిల్లలను బయట పంపించి స్కూల్ గేట్ కు తాళం వేశారు. వల్లంపట్ల పాఠశాల అదనపు గదులు, కిచెన్ షెడ్డు నిర్మాణం దాదాపు 22 లక్షలు పెట్టి మాజీ సర్పంచ్ మూడేళ్ళ క్రితం ఫూర్తి చేశారు. పనులు పూర్తై బిల్డింగ్ వినియోగం లోకి వచ్చినా బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ అనసూయ భర్త ఆందోళనకు దిగారు. స్కూల్ అదనపు తరగతి గదులకు, కిచెన్ షెడ్ కు తాళం వేశారు .గదులు తాళం వేయడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు అధికారులు, పోలీసులు చేరుకుని మాజీ సర్పంచ్ భర్తను సముదాయించారు. బిల్లులు వచ్చేవరకు తాళం తీయనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక మరో గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షల వరకు ఉందని అందులో ఐదో పదో ఇచ్చి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో తనకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు‌. 
స్పాట్ బైట్...
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.