Shuru
Apke Nagar Ki App…
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత 11 కేవీ విద్యుత్ లైన్ నిర్వహణ పనులు.. - ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం.. మెట్ పల్లి, ఆగస్టు 1: 11 కేవీ విద్యుత్ లైన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు (లైన్ క్లియరెన్స్) పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 2) ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ రవి తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిపివేయబడే ప్రాంతాలు: బాలకిషన్ నగర్, నిఖిల్ భారత్ స్కూల్ పరిసరాలు, బోయవాడ, మార్కెట్ ఏరియా, శివాజీ నగర్, బంటుపేట తదితర ప్రాంతాలు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించి అసౌకర్యాన్ని సహనంతో స్వీకరించాలని ఏడీఈ రవి విజ్ఞప్తి చేశారు.
Mahammad Vaseem
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత 11 కేవీ విద్యుత్ లైన్ నిర్వహణ పనులు.. - ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం.. మెట్ పల్లి, ఆగస్టు 1: 11 కేవీ విద్యుత్ లైన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు (లైన్ క్లియరెన్స్) పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 2) ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ రవి తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిపివేయబడే ప్రాంతాలు: బాలకిషన్ నగర్, నిఖిల్ భారత్ స్కూల్ పరిసరాలు, బోయవాడ, మార్కెట్ ఏరియా, శివాజీ నగర్, బంటుపేట తదితర ప్రాంతాలు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించి అసౌకర్యాన్ని సహనంతో స్వీకరించాలని ఏడీఈ రవి విజ్ఞప్తి చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము4
- చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.1
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.1
- కరీంనగర్‌లో కళాకారుల ఆధ్వర్యంలో బోనాల జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కళాకారుల ఆధ్వర్యంలో వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీ, బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి కోతీరాంపూర్ పోచమ్మ ఆలయం వరకు ఈ జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా సాగనుంది. గోడపత్రిక ఆవిష్కరణ ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి కళాకారులు నేడు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం జాతరకు సంబంధించిన గోడపత్రికల ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ - శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్,కళాకారులు గోగుల ప్రసాద్,సంద స్వప్న పలువురు బీఆర్ఎస్ నాయకులు, మరియు కళాకారులు తదితరులు ఉన్నారు.1
- సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్ ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు1