ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య పనులు పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు.. 11వ వార్డులో శుభ్రత పనుల పర్యవేక్షణ మెట్‌పల్లి, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 1వ వార్డు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి ఆటోలో లిఫ్ట్ చేశారు. అనంతరం 11వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. పట్టణంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్లు ధోనికెల శిరీష-నవీన్, మాసుల ప్రవీణ్, నునుగొండ నరేష్, పందిరి రమేష్, రెబ్బెస్ మహేష్, ఖాజా అజీమ్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నరేష్ నిజాం తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య పనులు పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు.. 11వ వార్డులో శుభ్రత పనుల పర్యవేక్షణ మెట్‌పల్లి, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 1వ వార్డు
జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి ఆటోలో లిఫ్ట్ చేశారు. అనంతరం 11వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యం
కావాలని కోరారు. పట్టణంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్లు ధోనికెల శిరీష-నవీన్, మాసుల ప్రవీణ్, నునుగొండ నరేష్, పందిరి రమేష్, రెబ్బెస్ మహేష్, ఖాజా అజీమ్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నరేష్ నిజాం తదితరులు పాల్గొన్నారు.
- నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో భానుడి భగభగలకు కేవలం మనుషులే కాదు అడవిలోని మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో అల్లాడిపోతున్న జీవాలు చల్లదనం కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పెద్ద చెట్టు ఉంది. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక కోతి ఆ చెట్టు నీడకు వచ్చింది. అక్కడ చెట్టుకు కట్టిన ఊయలను చూసిన వానరం ఏమాత్రం తడబడకుండా అందులోకి దూరింది. కాసేపు హాయిగా ఊగుతూ అలసటను మర్చిపోయి ఆటలాడింది. పెరుగుతున్న ఎండలకు మూగజీవాలు పడుతున్న అవస్థలు ఒకవైపు ఆవేదన కలిగిస్తుంటే మరోవైపు ఈ కోతి చేసిన పని ప్రకృతి ప్రేమికులను ఆలోచింపజేస్తోంది. మండుతున్న వేసవిలో పక్షులు జంతువుల కోసం నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని నియోజకవర్గ సాధన కమిటీ కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచిన అక్కల సాయి త్రినితను ఆయన కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్, గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్, చెలిగంటి మల్లేష్, గూడెం, గ్రామస్తులు పాల్గొన్నారు..1
- Post by Rajitha Antharpula9
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.1
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- Post by Rajitha Antharpula1