logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా *మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,* 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, 1959లో కడెం ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజారిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. డీపీఆర్ ప్రకారం షీట్‌పైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా స్కాంట్ పైల్ ఫౌండేషన్ నిర్మించారని, మూడు బ్యారేజీల పునాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు. ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గత 34 నెలలుగా కాళేశ్వరం మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి 340 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.

1 hr ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
1 hr ago

ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా *మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,* 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, 1959లో కడెం ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజారిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. డీపీఆర్ ప్రకారం షీట్‌పైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా స్కాంట్ పైల్ ఫౌండేషన్ నిర్మించారని, మూడు బ్యారేజీల పునాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల

పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు. ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గత 34 నెలలుగా కాళేశ్వరం మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి 340 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
    2
    మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు
బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు.
"మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్ ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు
    1
    వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్
వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు
ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్
ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్
ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి
నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    51 min ago
  • ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు
అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    1
    సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం."
"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... 
సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది."
**"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 8686618664
    2
    *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 
🙏🙏🙏🙏🙏
*ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం  దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు 
*ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం  దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* 
ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్  అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు  మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్  కోండ్ర శంకర్  తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు
*మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 8686618664
    user_గబ్బేట శ్రీనివాస్
    గబ్బేట శ్రీనివాస్
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    1 day ago
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
    2
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.
    1
    కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని  నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్ విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
    2
    కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్
విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.