Shuru
Apke Nagar Ki App…
తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో దద్దరిల్లిన ఆదిలాబాద్.. ADB: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీ దద్దరిల్లింది. డీజే పాటలు, సాంస్కృతిక నృత్యాలతో కొనసాగిన ఊరేగింపుతో పట్టణంలోని కూడలిలు ఆదివాసీలతో కిక్కిరిసిపోయాయి. ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని నాయకుడు గోడం గణేష్ కోరారు.
Mallaiah Potta
తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో దద్దరిల్లిన ఆదిలాబాద్.. ADB: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీ దద్దరిల్లింది. డీజే పాటలు, సాంస్కృతిక నృత్యాలతో కొనసాగిన ఊరేగింపుతో పట్టణంలోని కూడలిలు ఆదివాసీలతో కిక్కిరిసిపోయాయి. ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని నాయకుడు గోడం గణేష్ కోరారు.
More news from Telangana and nearby areas
- దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి..సామాజిక న్యాయం,రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం : కవ్వంపల్లి దళితులు,బహుజనుల సంక్షేమం,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదిలాబాద్‌లోని టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ముందు కలెక్టర్ చౌరస్తాలో కొమురం భీం,అంబేడ్కర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పుల చప్పుళ్లతో ర్యాలీగా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతనంగా నియమితులైన జిల్లా,మండల ఎస్సీ విభాగం నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తోందన్నారు.అర్హులైన పేదలకు రేషన్ కార్డులు,సన్నబియ్యం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,చేయూత పింఛన్లు,ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో దళితులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసి దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నరేష్ జాదవ్ పిలుపునిచ్చారు. దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్ విధానాలను వివరించాలని కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. దళితుల ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని అన్నారు. దళితులు,మైనారిటీలు,గిరిజనులు ఐక్యంగా రాజ్యాంగ హక్కులు,సామాజిక న్యాయం కోసం పోరాడాలని కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ ఎస్సీ విభాగం కోఆర్డినేటర్ సిద్ధార్థ హితంబ్రే, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్,ఆడే గజేందర్,సాజిద్‌ఖాన్,అల్లూరి సంజీవరెడ్డి,పరమేశ్వర్,దుర్గం శేఖర్,అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డీసీసీ సాజిద్‌ఖాన్,ఆసిఫాబాద్ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్,తదితరులు పాల్గొన్నారు.1
- *దళితులు, బహుజనుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి* - **కవ్వంపల్లి*సత్య నారాయణ గారు* *ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో దళితులకు ఎక్కువ అవకాశం కల్పించాం* - డీసీసీ డా నరేశ్ జాదవ్ gaaru *ఆదిలాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం విస్తృత సమావేశం* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని TNGO ఫంక్షన్ హాల్ లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జాతీయ కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ సిద్ధార్థ హితంబ్రే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారు, డీసీసీ డా నరేష్ జాదవ్ గారు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మొదటగా కలెక్టర్ చౌరస్తాలోని కొమరం భీం విగ్రహానికి పూల మాల తో నివాళులు అర్పించి అక్కడి నుండి అంబేద్కర్ చౌరస్తా లో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలతో నివాళులర్పించి అక్కడి నుండి డప్పుల చప్పుడు తో ర్యాలీగా TNGO గార్డెన్ లో వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక వద్ద చేరుకున్న వేరు బౌద్ధ సంప్రదాయంలో అంబేద్కర్ గారి విగ్రహం పూల తో నివాళులు అర్పించారు. నూతనంగా నియమించబడ్డ జిల్లా కాంగ్రెస్ ఎస్సి విభాగం కమిటీకి మరియు నూతనంగా నియమించ బడ్డ ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగ మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా డీసీసీ డా నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన పాలించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పాత్ర పోషించిందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలు, డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక సమానత్వం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్ప గా మార్చిందని గత ప్రభుత్వా పాలనలో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం ముఖ్యంగా దళితులు, బహుజన వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లు ఇచ్చిందని,రేషన్ కార్డు ల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణి,మహిళలకు ఫ్రీ బస్, చేయూత పెన్షన్ లు,అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నమాని పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కూడా దళితులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు తెలిపారు. డీసీసీ జనరల్ బాడీలో దళితులకు పెద్దపీట వేయడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా దళిత నాయకులకు పార్టీ టికెట్లు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విభాగం మరింత బలోపేతమై, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆయన అన్నారు . గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలనిఆదిలాబాద్ డీసీసీ ఎస్సీ విభాగ చైర్మన్ పరమేశ్వర్ గారికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం ప్రతి కార్యకర్త చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారిని, అలాగే కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన రాష్ట్ర ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ గారిని డీసీసీ డా నరేష్ జాదవ్ గారు అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం దళిత విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎస్సీ విభాగాన్ని పునర్నిర్మించి మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. దళితులందరూ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే బీజేపీకి గెలిచే అవకాశమే ఉండదని శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ విభాగం నాయకులు దళితులను కాంగ్రెస్ పార్టీ వైపు చైతన్యపరిచే విధంగా గ్రామస్థాయి నుంచి విస్తృతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ విధానాలను, సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న కృషిని వివరించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో దళితుల జనాభా 20 శాతానికి పైగా ఉందని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఎస్సీ విభాగం నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీ విజయానికి దళిత ఓటర్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు దళితులు, మైనారిటీలు, గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ విలువలకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు ఈ సమావేశంలో వారి తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గారు,బోథ్ నియోజకవర్గం ఇంచార్జి ఆడే గజేందర్ గారు,మాజీ డీసీసీ సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి గారు,ఆసిఫాబాద్ ఇంచార్జి శ్యామ్ నాయక్ గారు, అదిలాబాద్ ఎస్సి డిపార్ట్మెంట్ పార్లమెంట్ కోఆర్డినేటర్ సమతా సుదర్శన్ గారు,బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్య నారాయణ గారు,ఇచ్చోడా మార్కెట్ చైర్మన్ కుంరం సత్యవతి కోటేష్ గారు, జైనథ్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి గారు,ఆత్మ డైరెక్టర్ లు కౌడాలా నారాయణ గారు, గిమ్మ సంతోష్ రావు గారు,సేవా దళ్ అధ్యక్షులు మోతి రామ్ గారు, మైనారిటీ అధ్యక్షులు షాహిద్ అలీ గారు, ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, సెద్మకి ఆనంద్ రావు,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిమ్మ దీపక్ గారు, చంద్రయ్య గారు, బ్రీజులాల్ గారు, బొల్లారం బాబన్న గారు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లు మల్యాల కరుణాకర్ గారు, అక్తర్ అలీ గారు, దేవిదాస్ chary గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి గారు, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్ గారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు2
- ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో మూలాన పడేసిన ఐకెపి యంత్రం ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలోని ఐకెపి యంత్రం మూడు నెలల క్రితం యాసంగి పంట తూర్పారం పట్టిన తర్వాత ఐకెపి యంత్రాన్ని సత్తెనపల్లి ఇండ్ల పక్కన పొలాలలో అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లారు ఇలా చేయడంతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్టు ఆవుతుందని రైతులు గ్రామ ప్రజలు తెలియజేశారు1
- కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాల్సిందే; పోతు విజయ శంకర్ అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాల్సిందేనని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్, సిపిఎం జన్నారం మండల కార్యదర్శి మురిమడుగు లింగన్న డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు ధర్నా రాస్తారోకో చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- During their interaction with Prime Minister Narendra Modi , the CWG 2026 winners shared their experiences with him and highlighted how the Sports Authority of India (SAI) and initiatives like Khelo India supported them throughout their journey.1
- ఉద్రిక్తంగా మారిన జైల్ భరో కార్యక్రమం.. వామపక్ష నేతల అరెస్ట్ ADB: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో వామపక్ష ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ ను తరలించారు.1