logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దళితుల సంక్షేమానికి కాంగ్రెస్‌ కృషి..సామాజిక న్యాయం,రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం : కవ్వంపల్లి దళితులు,బహుజనుల సంక్షేమం,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం చైర్మన్‌,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదిలాబాద్‌లోని టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ముందు కలెక్టర్‌ చౌరస్తాలో కొమురం భీం,అంబేడ్కర్‌ చౌరస్తాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పుల చప్పుళ్లతో ర్యాలీగా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతనంగా నియమితులైన జిల్లా,మండల ఎస్సీ విభాగం నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తోందన్నారు.అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు,సన్నబియ్యం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,చేయూత పింఛన్లు,ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో దళితులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసి దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నరేష్‌ జాదవ్‌ పిలుపునిచ్చారు. దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్‌ విధానాలను వివరించాలని కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. దళితుల ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని అన్నారు. దళితులు,మైనారిటీలు,గిరిజనులు ఐక్యంగా రాజ్యాంగ హక్కులు,సామాజిక న్యాయం కోసం పోరాడాలని కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ ఎస్సీ విభాగం కోఆర్డినేటర్‌ సిద్ధార్థ హితంబ్రే, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌,ఆడే గజేందర్‌,సాజిద్‌ఖాన్‌,అల్లూరి సంజీవరెడ్డి,పరమేశ్వర్‌,దుర్గం శేఖర్‌,అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డీసీసీ సాజిద్‌ఖాన్‌,ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్‌,తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Adilabad Urban, Telangana•
1 hr ago

దళితుల సంక్షేమానికి కాంగ్రెస్‌ కృషి..సామాజిక న్యాయం,రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం : కవ్వంపల్లి దళితులు,బహుజనుల సంక్షేమం,సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం చైర్మన్‌,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదిలాబాద్‌లోని టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ముందు కలెక్టర్‌ చౌరస్తాలో కొమురం భీం,అంబేడ్కర్‌ చౌరస్తాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పుల చప్పుళ్లతో ర్యాలీగా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతనంగా నియమితులైన జిల్లా,మండల ఎస్సీ విభాగం నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తోందన్నారు.అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు,సన్నబియ్యం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,చేయూత పింఛన్లు,ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో దళితులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసి దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నరేష్‌ జాదవ్‌ పిలుపునిచ్చారు. దళిత కుటుంబాలను కలుసుకుని కాంగ్రెస్‌ విధానాలను వివరించాలని కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. దళితుల ఐక్యతతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని అన్నారు. దళితులు,మైనారిటీలు,గిరిజనులు ఐక్యంగా రాజ్యాంగ హక్కులు,సామాజిక న్యాయం కోసం పోరాడాలని కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ ఎస్సీ విభాగం కోఆర్డినేటర్‌ సిద్ధార్థ హితంబ్రే, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌,ఆడే గజేందర్‌,సాజిద్‌ఖాన్‌,అల్లూరి సంజీవరెడ్డి,పరమేశ్వర్‌,దుర్గం శేఖర్‌,అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డీసీసీ సాజిద్‌ఖాన్‌,ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్‌,తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వంతెనకు ఇరువైపులా భద్రతా పిల్లర్లను ఏర్పాటు చేయాలి.... భీంపూర్ మండలంలోని నిప్పని గ్రామ సమీపంలోని వాగుపై గల వంతెనకు ఇరువైపులా భద్రతా పిల్లర్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ వంతెన గుండా అనునిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    వంతెనకు ఇరువైపులా భద్రతా పిల్లర్లను ఏర్పాటు చేయాలి....
భీంపూర్ మండలంలోని నిప్పని గ్రామ సమీపంలోని వాగుపై గల వంతెనకు ఇరువైపులా భద్రతా పిల్లర్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ వంతెన గుండా అనునిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి : మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని బజరంగ్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుతూ భావితరాలకు అందించాలని సూచించారు. జల్‌–జంగల్‌–జమీన్‌పై హక్కులతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్‌ జాదవ్‌, AIBSS నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    1
    ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి : 
మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్
ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని బజరంగ్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుతూ భావితరాలకు అందించాలని సూచించారు. జల్‌–జంగల్‌–జమీన్‌పై హక్కులతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్‌ జాదవ్‌, AIBSS నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    16 hrs ago
  • ఆదివాసీ వేడుకల్లో అధికారుల సందడి.. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ నృత్యం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాల్లో గిరిజనులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ మకరంద్ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిన ఈ దృశ్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి హాజరైన ప్రజలు అధికారుల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చప్పట్లతో అభినందించారు.
    1
    ఆదివాసీ వేడుకల్లో అధికారుల సందడి.. గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ నృత్యం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాల్లో గిరిజనులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ మకరంద్ సంప్రదాయ నృత్యంలో పాల్గొని సందడి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటిన ఈ దృశ్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కార్యక్రమానికి హాజరైన ప్రజలు అధికారుల నృత్యాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చప్పట్లతో అభినందించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • ఆదర్శ గ్రామం హివారే బజార్‌ను సందర్శించిన నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం Tags దేశంలోనే నెంబర్ వన్ గ్రామపంచాయతీగా పేరొందిన హివారే బజార్‌ను (మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా) ఆదివారం నందిపేట్ గ్రామ పాలక వర్గ సభ్యులు సందర్శించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కరువును జయించి దేశ ఆదర్శ గ్రామంగా మారిన తీరును పరిశీలించారు. అదే స్ఫూర్తితో నందిపేట్‌లోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చామని సర్పంచ్ ఎర్రం లింగం తెలిపారు. ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. #HivareBazar #ModelVillage
    1
    ఆదర్శ గ్రామం హివారే బజార్‌ను సందర్శించిన నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం
Tags 
దేశంలోనే నెంబర్ వన్ గ్రామపంచాయతీగా పేరొందిన హివారే బజార్‌ను (మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా) ఆదివారం నందిపేట్ గ్రామ పాలక వర్గ సభ్యులు సందర్శించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కరువును జయించి దేశ ఆదర్శ గ్రామంగా మారిన తీరును పరిశీలించారు. అదే స్ఫూర్తితో నందిపేట్‌లోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చామని సర్పంచ్ ఎర్రం లింగం తెలిపారు. ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. #HivareBazar  #ModelVillage
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • The week (03-09 August) reflected India's continued focus on strengthening defence preparedness, modernisation and strategic cooperation . From advancing military-civil integration and adopting digital initiatives to strengthening the Territorial Army, promoting youth participation and enhancing future warfare capabilities, the week also saw successful missile testing and deeper defence cooperation with Uzbekistan and Russia. Watch the Weekly Recap for all the top stories.
    1
    The week (03-09 August) reflected India's continued focus on strengthening defence preparedness, modernisation and strategic cooperation
. 
From advancing military-civil integration and adopting digital initiatives to strengthening the Territorial Army, promoting youth participation and enhancing future warfare capabilities, the week also saw successful missile testing and deeper defence cooperation with Uzbekistan and Russia.
Watch the Weekly Recap for all the top stories.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో దద్దరిల్లిన ఆదిలాబాద్.. ADB: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీ దద్దరిల్లింది. డీజే పాటలు, సాంస్కృతిక నృత్యాలతో కొనసాగిన ఊరేగింపుతో పట్టణంలోని కూడలిలు ఆదివాసీలతో కిక్కిరిసిపోయాయి. ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని నాయకుడు గోడం గణేష్ కోరారు.
    1
    తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో దద్దరిల్లిన ఆదిలాబాద్..
ADB: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి హక్కుల పోరాట సమితి  తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీ దద్దరిల్లింది. డీజే పాటలు, సాంస్కృతిక నృత్యాలతో కొనసాగిన ఊరేగింపుతో పట్టణంలోని కూడలిలు ఆదివాసీలతో కిక్కిరిసిపోయాయి. ఆదివాసీల సమగ్ర  అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని నాయకుడు గోడం గణేష్ కోరారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • ఆదివాసీ సంస్కృతికి అధికారుల జేజేలు.. నృత్యంతో వేడుకల్లో ఉత్సాహం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి కలెక్టర్‌ రాజర్షి షా,ఎస్పీ అఖిల్‌ మహాజన్‌,ఐటీడీఏ పీఓ మకరంద్‌ ఉత్సాహంగా నృత్యం చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నృత్యం చేయడంతో వేడుకల్లో ఉత్సాహం నెలకొంది. ఈ దృశ్యాలు అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.
    1
    ఆదివాసీ సంస్కృతికి అధికారుల జేజేలు.. నృత్యంతో వేడుకల్లో ఉత్సాహం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి కలెక్టర్‌ రాజర్షి షా,ఎస్పీ అఖిల్‌ మహాజన్‌,ఐటీడీఏ పీఓ మకరంద్‌ ఉత్సాహంగా నృత్యం చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నృత్యం చేయడంతో వేడుకల్లో ఉత్సాహం నెలకొంది. ఈ దృశ్యాలు అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    22 hrs ago
  • నాగపూరి చందు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన నాగపూరి చందు మృతదేహానికి సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెంచికల్‌పేట్ మండలం మోట్లగూడ వద్ద కరెంటు స్తంభంపై పనిచేస్తుండగా చందుకు షాక్ తగిలి మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం, పెన్షన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు.
    1
    నాగపూరి చందు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన నాగపూరి చందు మృతదేహానికి సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెంచికల్‌పేట్ మండలం మోట్లగూడ వద్ద కరెంటు స్తంభంపై పనిచేస్తుండగా చందుకు షాక్ తగిలి మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం, పెన్షన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.