Shuru
Apke Nagar Ki App…
ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి : మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని బజరంగ్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుతూ భావితరాలకు అందించాలని సూచించారు. జల్–జంగల్–జమీన్‌పై హక్కులతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, AIBSS నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
AlluriMahesh
ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి : మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని బజరంగ్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుతూ భావితరాలకు అందించాలని సూచించారు. జల్–జంగల్–జమీన్‌పై హక్కులతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, AIBSS నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వంతెనకు ఇరువైపులా భద్రతా పిల్లర్లను ఏర్పాటు చేయాలి.... భీంపూర్ మండలంలోని నిప్పని గ్రామ సమీపంలోని వాగుపై గల వంతెనకు ఇరువైపులా భద్రతా పిల్లర్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ వంతెన గుండా అనునిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి : మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని బజరంగ్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుతూ భావితరాలకు అందించాలని సూచించారు. జల్–జంగల్–జమీన్‌పై హక్కులతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, AIBSS నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- ఆదర్శ గ్రామం హివారే బజార్‌ను సందర్శించిన నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం Tags దేశంలోనే నెంబర్ వన్ గ్రామపంచాయతీగా పేరొందిన హివారే బజార్‌ను (మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా) ఆదివారం నందిపేట్ గ్రామ పాలక వర్గ సభ్యులు సందర్శించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కరువును జయించి దేశ ఆదర్శ గ్రామంగా మారిన తీరును పరిశీలించారు. అదే స్ఫూర్తితో నందిపేట్‌లోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చామని సర్పంచ్ ఎర్రం లింగం తెలిపారు. ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. #HivareBazar #ModelVillage1
- బాసర ఐఐఐటి అధ్యాపకుడి పై వేటు.. ఎస్సి ఎస్టి కమిషన్ ఆదేశాలతో విధుల్లో నుండి తొలగించిన చేసిన వీసీ గోవర్ధన్.. నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర త్రిబుల్ ఐటీ అధ్యాపకుల్లో లో ఆందోళన వాతావరణం... బాసర ఐఐఐటి లో కాంట్రాక్ట్ అధ్యాపకుడి పై వేటు... కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఐటీ మెంటార్ ఏ. శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్.. గడిచిన రెండేళ్లలో మూడుసార్లు బాసర త్రిబుల్ ఐటీ ని సందర్శించి సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్... కాంట్రాక్టు అధ్యాపకుడు ఏ. శ్రీధర్ పై తీవ్రస్థాయిలో ఫిర్యాదులను అందుకున్న ఎస్సి.ఎస్టి కమిషన్... గతంలో సైతం ఎన్నోసార్లు ఫిర్యాదులు అందగా తీవ్రంగా పరిగణించిన ఎస్సీ ఎస్టీ కమిషన్.. వెంటనే శ్రీధర్ ను విధుల్లో నుండి తొలగించాలని వైస్ ఛాన్స్ లర్ గోవర్ధన్ కు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్... కాంట్రాక్ట్ అధ్యాపకుడు శ్రీధర్ ను తొలగిస్తున్నట్లు సివిఆర్ న్యూస్ తో తెలిపిన కళాశాల వైస్ చాన్సలర్ గోవర్ధన్.1
- వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయ వంతమైన "జైల్ భరో" కార్యక్రమం_ బోధన్:(ఆగస్టు 9): నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాహుల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు, కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బోధన్ పట్టణంలో రాస్తారోఖో–జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. టియుసి-ఐ, సిఐటియు, ఐఎఫ్ టి యు, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం, అఖిలభారత ఐక్య రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తదితర సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే గేట్ వద్ద రాస్తారోఖో చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టియుసి-ఐ రాష్ట్ర నాయకులు బి. మల్లేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జే. శంకర్ గౌడ్, . ఐఎఫ్ టీయు జిల్లా అధ్యక్షులు పి. వరదయ్య, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని, రైతుల పంటలకు ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పడాల శంకర్, సిహెచ్. రమేష్, బి. నాగమణి, డి. పోశెట్టి, జంగం గంగాధర్, సాగర్, దాల్ మల్కా పోశెట్టి, బి. పర్వయ్య, యు. శివ, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.4
- The week (03-09 August) reflected India's continued focus on strengthening defence preparedness, modernisation and strategic cooperation . From advancing military-civil integration and adopting digital initiatives to strengthening the Territorial Army, promoting youth participation and enhancing future warfare capabilities, the week also saw successful missile testing and deeper defence cooperation with Uzbekistan and Russia. Watch the Weekly Recap for all the top stories.1
- తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో దద్దరిల్లిన ఆదిలాబాద్.. ADB: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీ దద్దరిల్లింది. డీజే పాటలు, సాంస్కృతిక నృత్యాలతో కొనసాగిన ఊరేగింపుతో పట్టణంలోని కూడలిలు ఆదివాసీలతో కిక్కిరిసిపోయాయి. ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని నాయకుడు గోడం గణేష్ కోరారు.1
- ఆదివాసీ సంస్కృతికి అధికారుల జేజేలు.. నృత్యంతో వేడుకల్లో ఉత్సాహం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ అఖిల్ మహాజన్,ఐటీడీఏ పీఓ మకరంద్ ఉత్సాహంగా నృత్యం చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తమ అభిమానాన్ని చాటుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నృత్యం చేయడంతో వేడుకల్లో ఉత్సాహం నెలకొంది. ఈ దృశ్యాలు అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.1
- నల్లబెల్లిలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించిన కేటీఆర్ హరీష్ రావు తెలంగాణ ఉద్యమకారులు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గుండె జబ్బుతో హఠాత్తుగా మరణించడం జరిగింది ఆయన సంతాప సభను నల్లబెల్లిలో ఏర్పాటు చేశారు ఆ సభకు కెసిఆర్ గారితో పాటు నల్లబెల్లిలో సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించిన కేటీఆర్, హరీష్ రావు1