లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం మెట్‌పల్లి కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ, పరస్పర రాజీతో వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని స్పష్టం చేశారు. లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కారమైన కేసులపై అప్పీల్‌కు అవకాశం ఉండదని కూడా ఆమె వివరించారు. ఈ సదస్సు అనంతరం నిర్వహించిన రెండో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 1,645 కేసులను పరిష్కరించారు. వీటిలో పరస్పర రాజీ ద్వారా 97 కేసులు, మీడియేషన్ ద్వారా 16 కేసులు, అడ్మిషన్స్ ద్వారా 58 కేసులు, పీఎల్‌సీ ద్వారా 25 కేసులు మరియు ఎస్టీసీ ద్వారా 1,449 కేసులు పరిష్కారమయ్యాయి. అడ్మిషన్స్ ద్వారా కక్షిదారులు మొత్తం రూ.4,56,200 చెల్లించగా, పీఎల్‌సీ ద్వారా రైతులు బ్యాంకులకు రూ.6,78,629 చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దయ్యా రాజారాం, ఏపీపీ జి. ప్రణయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రామ్‌రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, మీడియేషన్ సభ్యులు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, తునికి వేణుగోపాల్, పసునూరి శ్రీనివాస్‌తో పాటు పలువురు న్యాయవాదులు, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం మెట్‌పల్లి కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ, పరస్పర రాజీతో వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని స్పష్టం చేశారు. లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కారమైన కేసులపై అప్పీల్‌కు అవకాశం ఉండదని కూడా ఆమె వివరించారు. ఈ సదస్సు అనంతరం నిర్వహించిన రెండో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 1,645 కేసులను పరిష్కరించారు. వీటిలో పరస్పర రాజీ ద్వారా 97 కేసులు, మీడియేషన్ ద్వారా 16 కేసులు, అడ్మిషన్స్ ద్వారా 58 కేసులు, పీఎల్‌సీ ద్వారా 25 కేసులు మరియు ఎస్టీసీ ద్వారా 1,449 కేసులు పరిష్కారమయ్యాయి. అడ్మిషన్స్ ద్వారా కక్షిదారులు మొత్తం రూ.4,56,200 చెల్లించగా, పీఎల్‌సీ ద్వారా రైతులు బ్యాంకులకు రూ.6,78,629 చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దయ్యా రాజారాం, ఏపీపీ జి. ప్రణయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రామ్‌రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, మీడియేషన్ సభ్యులు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, తునికి వేణుగోపాల్, పసునూరి శ్రీనివాస్‌తో పాటు పలువురు న్యాయవాదులు, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5)తో కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు. ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, ఉత్కం విజయ్ వాటిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి నిధులను పంచుకున్నారు. అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దాన్ని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపారు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు. అంతేకాకుండా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు. ఈ మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సుమారు ₹91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. నిందితులు ఉత్కం విజయ్ (A1), కమ్మరి రాజశేఖర్ (A2), చెపూరి మధుకర్ (A4), వాసాల గణేష్ (A5), గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, ₹14,16,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న ₹46,21,358 మొత్తాన్ని ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కులేరి ప్రేమ్ సాగర్, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణలు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా, అభ్యసన ప్రక్రియలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభరీతిలో బోధించడానికి వీలుగా, విద్యార్థులతో కలిసి బోధనోపకరణలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల బోధనోపకరణల వర్క్ షాప్‌లో భాగంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్, కవిత, కార్తీక్ లు పాల్గొన్నారు.2
- జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.1
- సిరిసిల్లకు చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ పి. లీలా శిరీషా, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.1
- సిరికొండ మండలంలో జూన్ 20న ప్రత్యేక విస్తృత సవరణ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా, తహసీల్దార్ ఆధ్వర్యంలో రైతు వేదికలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధులు, బాధ్యతలపై అధికారులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ ఈ సందర్భంగా సూచించారు.1
- కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగా గురువు విష్ణు మాట్లాడుతూ, యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ తూం రాజ్ కుమార్, బీజేపీ నాయకులు పెరుక శ్రవణ్ కుమార్, తూం నారాయణ, సదాల భాస్కర్ తో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. 'నేనుసైతం' కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణలో, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, వాటి ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నియమాలు, గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది ఉన్నారు.1
- కరీంనగర్-2 డిపోకు చెందిన ఒక ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది ప్రయాణికులను డ్రైవర్ అప్రమత్తంగా కిందకు దించడంతో ఎలాంటి పెను ప్రమాదం జరగకుండా తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.1