Shuru
Apke Nagar Ki App…
MBNR రెండో రోజుకూ చేరిన వీబీ-జీఆర్‌ఏఎం జీ సిబ్బంది నిరసనలు మహబూబ్‌నగర్: ఉపాధి హామీ (VB-G RAM G) ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు శనివారం రెండో రోజుకు చేరాయి. మహబూబ్‌నగర్ జిల్లా డిఆర్‌డిఏ (DRDA) కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించి 'పెన్‌డౌన్, షట్‌డౌన్' పాటించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. విధులు నిలిచిపోవడంతో పలు పరిపాలనా పనులు స్థంభించాయి. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
NAVADEEP
MBNR రెండో రోజుకూ చేరిన వీబీ-జీఆర్‌ఏఎం జీ సిబ్బంది నిరసనలు మహబూబ్‌నగర్: ఉపాధి హామీ (VB-G RAM G) ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు శనివారం రెండో రోజుకు చేరాయి. మహబూబ్‌నగర్ జిల్లా డిఆర్‌డిఏ (DRDA) కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించి 'పెన్‌డౌన్, షట్‌డౌన్' పాటించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. విధులు నిలిచిపోవడంతో పలు పరిపాలనా పనులు స్థంభించాయి. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం మన తెలుగు రాష్ట్రాలకు శుభ సూత్రం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆనందం ఆంధ్రాలో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు మన తెలుగు విమానయాన శాఖ మంత్రి ఉండటం మన తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద మరో విమానాశ్రయం రావడం శుభ సూచకమని తెలియజేస్తున్నారు త్వరలో మన తెలంగాణలో కూడా అతిపెద్ద విమానాశ్రయం వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుందని తెలంగాణకు ఇది కూడా ఒక వరమవుతుందని ఉత్తరాంధ్ర రావు అభివృద్ధి చెందినట్లు ఉత్తర తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుందని స్థానికులు అనుకుంటున్నారు తెలంగాణలోని తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని సంతోషం వ్యక్తం చేశారు వచ్చే 2028 సంవత్సరంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే డబ్బులు ఇంజన్ సర్కార్ పనులు మరింత వేగం సొంతంగా జరిగి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాం అని తెలియజేశారు అనేక పరిశ్రమలు1
- బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు: కవిత బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేసారు.1
- జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక ధరూర్ మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో :1,77,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో : 1,76,000 వేల, క్యూ సెక్కులు నీటిని 29 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.1
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్1
- మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.4
- పలుకూరు విద్యార్థులకు నగదు పురస్కారాలు బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనిపించిన సాయి దీపిక ఎస్ చంద్ర హసన్ 1200 ప్రకారం 3600 ఇవ్వడం జరిగినది అలాగే అచ్చిత రేష్మ చరిత కమ్మరి శరణ్య అనే విద్యార్థులకు ₹1000 ప్రకారం 3000 రూపాయలు నగదు పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్య యొక్క విశిష్టత పై మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందప్ప పరమేశ్వరుడు కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హెచ్ఎం గౌరీ శంకర్ ను బ్రహ్మానంద చారి ఘనంగా సన్మానించి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.2
- సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ నాయకులు ఈ నెల 6 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. "సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ" పోస్టర్ ను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరణ చేశారు.1
- విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.4