logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన గౌడ కౌన్సిలర్ లను ఘనంగా సన్మానించారు.. మహబూబాబాద్ జిల్లా గోపా కమిటీ ఆధ్వర్యంలో... మహబూబాబాద్, మార్చి10, మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన గౌడ కులానికి చెందిన కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్, గాడిపల్లి నాగేశ్వరరావు, గాడిపల్లి లావణ్యచరణ్ గౌడ్, ధూపటి స్పందన వినయ్ గౌడ్ లను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి గోపా జిల్లాకమిటి పక్షాన అభినందనలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో గోపా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, జిల్లాప్రధానకార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, గోపారాష్ట నాయకులు బిక్కి వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి, చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్, గోపా జిల్లా లీగల్ అడ్వైజర్ సుభాష్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి బుర్ర గోవర్ధన్ గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క నాగార్జునగౌడ్, డివిజన్ ట్రెజరర్ గడ్డం యాదగిరి గౌడ్, గడ్డం విజయ్, జిల్లాకార్యవర్గసభ్యులు ఉమ్మగాని శ్రీనివాస్, కౌండిన్య సహకార పరపతి సంఘం తొర్రూర్ కార్యదర్శి కుంభం మహేష్ కుమార్ గౌడ్, తొర్రూరు గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడు కుర్ర నరేష్ గౌడ్, పొలగాని అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తనపైన ప్రత్యేక అభిమానంతో సన్మానించిన గోపా జిల్లా కమిటీ కి నలుగురు కౌన్సిలర్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.., బాధ్యతాయుతంగా పనిచేసి మన గౌరవాన్ని పెంచుతామని వారు తెలిపారు.

3 hrs ago
user_Venkatgoud kallepu
Venkatgoud kallepu
Singer Warangal, Telangana•
3 hrs ago
3961d86d-3765-45f2-ac2e-7bf15a97495d

మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన గౌడ కౌన్సిలర్ లను ఘనంగా సన్మానించారు.. మహబూబాబాద్ జిల్లా గోపా కమిటీ ఆధ్వర్యంలో... మహబూబాబాద్, మార్చి10, మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన గౌడ కులానికి చెందిన కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్, గాడిపల్లి నాగేశ్వరరావు, గాడిపల్లి లావణ్యచరణ్ గౌడ్, ధూపటి స్పందన వినయ్ గౌడ్ లను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి గోపా జిల్లాకమిటి పక్షాన అభినందనలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో గోపా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, జిల్లాప్రధానకార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, గోపారాష్ట నాయకులు బిక్కి వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి, చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్, గోపా జిల్లా

965f69c9-384a-4bd3-96cf-69d54c208a72

లీగల్ అడ్వైజర్ సుభాష్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి బుర్ర గోవర్ధన్ గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క నాగార్జునగౌడ్, డివిజన్ ట్రెజరర్ గడ్డం యాదగిరి గౌడ్, గడ్డం విజయ్, జిల్లాకార్యవర్గసభ్యులు ఉమ్మగాని శ్రీనివాస్, కౌండిన్య సహకార పరపతి సంఘం తొర్రూర్ కార్యదర్శి కుంభం మహేష్ కుమార్ గౌడ్, తొర్రూరు గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడు కుర్ర నరేష్ గౌడ్, పొలగాని అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తనపైన ప్రత్యేక అభిమానంతో సన్మానించిన గోపా జిల్లా కమిటీ కి నలుగురు కౌన్సిలర్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.., బాధ్యతాయుతంగా పనిచేసి మన గౌరవాన్ని పెంచుతామని వారు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ:కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు వడ్డించిన ఇడ్లీలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఆహారం నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులు మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తమ ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థులకు, అధికారులు ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
    1
    హన్మకొండ:కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు వడ్డించిన ఇడ్లీలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఆహారం నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు.
విద్యార్థులు మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తమ ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థులకు, అధికారులు ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    1
    ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు.
ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    30 min ago
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.
    4
    కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు.
తంగళ్ళపల్లి మండలంలో
మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    26 min ago
  • *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    1
    *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త*
ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది 
ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    24 min ago
  • అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.
    1
    అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    4
    అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన అన్నారం రవీందర్ (36) అనే రైతు ఎద్దు పొడవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫిబ్రవరి 25న తన మొక్కజొన్న చేనులో దున్నుతుండగా ఎద్దు ఛాతి, మెడ, నడుము భాగాల్లో తీవ్రంగా పొడిచింది. తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన అన్నారం రవీందర్ (36) అనే రైతు ఎద్దు పొడవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫిబ్రవరి 25న తన మొక్కజొన్న చేనులో దున్నుతుండగా ఎద్దు ఛాతి, మెడ, నడుము భాగాల్లో తీవ్రంగా పొడిచింది. తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.