Shuru
Apke Nagar Ki App…
వెంకటాచలం: ప్రేమ వ్యవహారం.. యువకుడి ఆత్మహత్య వెంకటాచలానికి చెందిన శివకుమార్ (22) ప్రేమ వ్యవహారంతో మనస్థాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని, 24 గంటలు గడిచినా పోస్టుమార్టం చేయలేదని ఆరోపించారు. అబ్బాయికి జరిగితే చిన్నచూపు చూస్తూ అమ్మాయికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేసి తమ బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
SRIHARI POONDLA
వెంకటాచలం: ప్రేమ వ్యవహారం.. యువకుడి ఆత్మహత్య వెంకటాచలానికి చెందిన శివకుమార్ (22) ప్రేమ వ్యవహారంతో మనస్థాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని, 24 గంటలు గడిచినా పోస్టుమార్టం చేయలేదని ఆరోపించారు. అబ్బాయికి జరిగితే చిన్నచూపు చూస్తూ అమ్మాయికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేసి తమ బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- అక్రమ ఇసుక తవ్వకాలు పట్టా పట్టించుకొని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల మౌనం ఎందుకు? మోటుపల్లి సర్వే నంబర్లు 114, 115లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చిన్నగంజాం మండలం: మోటుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 114, 115లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుకను భారీ స్థాయిలో తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్లు 114, 115లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.3
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1