logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

​చిన్న జగంపేటలో భారీ అగ్నిప్రమాదం -రెండు ఇళ్లు దగ్ధం పిఠాపురం: గొల్లప్రోలు మండలంలోని చిన్న జగంపేట గ్రామం సగరపేట కాలనీలో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎం. అప్పయ్యమ్మ ఆదివారం రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆమె వెంటనే అప్రమత్తమై ఇంటి నుండి బయటకు పరుగులు తీసింది. అప్పయ్యమ్మ ముగ్గురు కుమారులు ఉపాధి నిమిత్తం ఇటీవలే ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఈ అగ్నికీలల ధాటికి ఇళ్లలోని గృహోపకరణాలు, వంట సామగ్రి, బియ్యం, నగదు మరియు కట్టుబట్టలు పూర్తిగా బూడిదయ్యాయి. సర్వం కోల్పోవడంతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులుగా మారి కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు,ఒక చిన్న పశువుల పాక పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అగ్నిమాపక అధికారి రామకృష్ణరాజు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి ఆశ్రయం కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

20 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
20 hrs ago
abed6234-d41f-4126-9f39-8a7a8a638160

​చిన్న జగంపేటలో భారీ అగ్నిప్రమాదం -రెండు ఇళ్లు దగ్ధం పిఠాపురం: గొల్లప్రోలు మండలంలోని చిన్న జగంపేట గ్రామం సగరపేట కాలనీలో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎం. అప్పయ్యమ్మ ఆదివారం రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆమె వెంటనే అప్రమత్తమై ఇంటి నుండి బయటకు పరుగులు తీసింది. అప్పయ్యమ్మ ముగ్గురు కుమారులు ఉపాధి నిమిత్తం ఇటీవలే ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రమాద

1e7f0ce1-809c-4240-8318-45a8945ecd63

సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఈ అగ్నికీలల ధాటికి ఇళ్లలోని గృహోపకరణాలు, వంట సామగ్రి, బియ్యం, నగదు మరియు కట్టుబట్టలు పూర్తిగా బూడిదయ్యాయి. సర్వం కోల్పోవడంతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులుగా మారి కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు,ఒక చిన్న పశువుల పాక పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అగ్నిమాపక అధికారి రామకృష్ణరాజు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి ఆశ్రయం కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    1
    *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన*
*14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం*
*ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా*
*కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్*
*పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* 
భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC  మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA  అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు.
ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం 
వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై  వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    user_Shivaram
    Shivaram
    Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.
    1
    పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    1
    చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం..
అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ​.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ​ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. ​గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి
    1
    ​.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
​
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు.
​గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు.
మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    1
    . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.
    1
    SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ 
అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు  స్వీకరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.