Shuru
Apke Nagar Ki App…
బొర్యాకుంట చేపల చెరువు వేలం పాట రూ.4,090 అజ్మీరా సుక్యకు దక్కిన చేపల చెరువు వేలం బొర్యాకుంట చేపల చెరువు వేలం పాట రూ.4,090 అజ్మీరా సుక్యకు దక్కిన చేపల చెరువు వేలం *భజ్యతండా , సెప్టెంబర్ 15:* ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని భజ్యతండ గ్రామపంచాయతీలో బొర్యాకుంట చేపల చెరువు వేలంపాట మంగళవారం నిర్వహించారు. మత్స్యశాఖ సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో పలువురు పాటదారులు పాల్గొన్నారు. చేపల చెరువు వేలంపాటలో అజ్మీరా సురేష్, అజ్మీరా సుక్య మధ్య పోటీ నెలకొంది. చివరికి రూ.4,090లకు అజ్మీరా సుక్య వేలాన్ని కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హనుమంతరావు, పంచాయతీ సెక్రటరీ ధరావత్ జ్యోతి, మత్స్యశాఖ సరిత, పాటదారులు అజ్మీరా సురేష్, అజ్మీరా సుక్య తదితరులు పాల్గొన్నారు.
Hatkar Rambabu
బొర్యాకుంట చేపల చెరువు వేలం పాట రూ.4,090 అజ్మీరా సుక్యకు దక్కిన చేపల చెరువు వేలం బొర్యాకుంట చేపల చెరువు వేలం పాట రూ.4,090 అజ్మీరా సుక్యకు దక్కిన చేపల చెరువు వేలం *భజ్యతండా , సెప్టెంబర్ 15:* ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని భజ్యతండ గ్రామపంచాయతీలో బొర్యాకుంట చేపల చెరువు వేలంపాట మంగళవారం నిర్వహించారు. మత్స్యశాఖ సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో పలువురు పాటదారులు పాల్గొన్నారు. చేపల చెరువు వేలంపాటలో అజ్మీరా సురేష్, అజ్మీరా సుక్య మధ్య పోటీ నెలకొంది. చివరికి రూ.4,090లకు అజ్మీరా సుక్య వేలాన్ని కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హనుమంతరావు, పంచాయతీ సెక్రటరీ ధరావత్ జ్యోతి, మత్స్యశాఖ సరిత, పాటదారులు అజ్మీరా సురేష్, అజ్మీరా సుక్య తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.1
- ఖమ్మం నగరం 27 డివిజన్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇల్లులు కూలగొట్టడానికి వస్తున్న వారిని అడ్డుకొని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి పై ధర్నా చేస్తున్న బాధితులు....మాకు ఇచ్చిన నోటీసులు వెంటనే ఉపసంహారించు కొని ఇళ్ళు కూల్చే పనిని మానుకోవాలని డిమాండ్ చెస్తున్నారు, వీరికి మద్దతు గా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు....1
- నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు.. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ... భద్రాచలం: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. శిక్షణలో భాగంగా హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, బ్యూటీషియన్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, బేసిక్ గ్రాఫిక్ డిజైన్, షోరూమ్ హోస్ట్, టూర్ గైడ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యూటీషియన్ కోర్సు భద్రాచలంలో 30 రోజుల పాటు, ఎలక్ట్రికల్ కోర్సు బూర్గంపాడు, హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లో 45 రోజులు, హెల్త్‌కేర్ కోర్సు హైదరాబాద్‌లో 50 రోజులు, హాస్పిటాలిటీ కోర్సు షాద్‌నగర్‌లో 65 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల, కోర్సును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్/ఎస్‌ఎస్‌సీ మెమో, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అవసరమని తెలిపారు. శిక్షణలో 80 శాతం ప్రాక్టికల్, 20 శాతం థియరీతో పాటు ప్రీ, పోస్ట్ పరీక్షలు నిర్వహిస్తామని, అర్హత కలిగిన వారికి ఉద్యోగ మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. సంప్రదించండి: కో-ఆర్డినేటర్ ఆర్. గోపాల్ – 8231821693. టోల్‌ఫ్రీ: 1800-12-000-4007.1
- భద్రాచలానికి మూడో వంతెన పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌కు కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ను మంజూరు చేయడాన్ని* స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.* ముఖ్య అతిథిగా పాల్గొన్న *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి* మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో *పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్‌ను* కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం *పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్‌ను మంజూరు చేయడం* గొప్ప విషయమన్నారు. ఈ ప్రాజెక్టులో *భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం* జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది *దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం* ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల *విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి *భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని* బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో *బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు.1
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్ ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.2
- గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్‌కు పాలాభిషేకం ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గిరిజనులు, ఆదివాసీలు, తండాల్లో నివసించే లంబాడీల విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.1
- మేడే కాలనీలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు.. స్కూల్ ఎదుట అధ్వానంగా ఉన్న పరిస్థితులపై సర్పంచ్ పరిశీలన... సారపాక: మేడే కాలనీలోని పాఠశాల ఎదుట అధ్వానంగా ఉన్న డ్రైనేజీ, రహదారి సమస్యలను సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు, స్థానికులు రాకపోకలు సాగించే ప్రాంతంలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. రహదారి పరిస్థితిని కూడా పరిశీలించిన ఆయన సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థల హద్దులకు సంబంధించిన విషయంలో సర్పంచ్, కొందరు స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పాఠశాల ఎదుట ఉన్న స్థలం తమ పరిధిలోకి వస్తుందనే విషయంలో ఇరువర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ సమస్యతో మురుగునీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, రహదారి సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే స్థల హద్దుల విషయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి సంబంధిత రికార్డులను పరిశీలించి, అధికారుల సమక్షంలో హద్దులను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమస్యపై అధికారులు స్పందించి పాఠశాల పరిసరాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరుతున్నారు.4
- ముదిగొండ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు ముదిగొండ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంవీఐ తనిఖీల నిమిత్తం ట్రాక్టర్ను రోడ్డుపై నిలపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. తాను ఎటువంటి వాహనాలు ఆపలేదని ఎంవీఐ అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.1