పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి.... జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపు..... ప్రభుత్వ పాఠశాలలు మరియు అందులో విద్యాభ్యాసం చేస్తున్న పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని, విద్యాంజలి కార్యక్రమంలో నమోదు చేసుకుని పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బసినికొండలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించేందుకు రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపీనాథ్ ముందుకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమ ప్రారంభోత్సవానికి, ఏపీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభివృద్ధికి సహకారం అందించిన దాతను అభినందించారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు మరియు విద్యార్థుల అభివృద్ధికి విరివిగా సహాయ సహకారాలు అందించి, బడుల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం “విద్యాంజలి” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన వందలాది రకాల సేవలను స్వచ్ఛందంగా అందించవచ్చని, సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ధ్రువపత్రం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, రఘు, మధుసూదన, సమగ్ర శిక్షా సీఎంఓ కరుణాకర్, మండల విద్యా శాఖాధికారులు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ1
- మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- అన్నమయ్య జిల్లా:- *మదనపల్లెలో సంబరాలు రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అంత్యక్రియలు పూర్తికాకముందే ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ వార్త వెలువడగానే నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. “న్యాయం గెలిచింది”, “పోలీసులు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. టపాసులు, బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ పరిణామం మరింత చర్చనీయాంశమైంది.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లె: బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన ప్రదేశంలో ఉద్రిక్తత. వందలాదిగా తరలివచ్చిన స్థానికులు.. హిజ్రాలు సైతం రంగ ప్రవేశం.హంతకున్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు... ప్రజా కోర్టులో నిందితుని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబ డిమాండ్.1