logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనారోగ్య బాధితుడికి రూ.2.50 లక్షల CMRF సహాయం LOC అందజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన అజామ్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే స్పందించి ఆర్థిక సహాయం అందించారు. బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేయించారు. శనివారం ఆ LOC కాపీని బాధితుడి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అజామ్ ఖాన్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గారి సహాయంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

1 hr ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
1 hr ago
62092b6a-66b3-4be3-b798-a9264a0e9699

అనారోగ్య బాధితుడికి రూ.2.50 లక్షల CMRF సహాయం LOC అందజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన అజామ్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే స్పందించి ఆర్థిక సహాయం అందించారు. బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2,50,000 విలువైన

24ac0c8f-c339-4102-962e-7788e1e9a0d5

ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేయించారు. శనివారం ఆ LOC కాపీని బాధితుడి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అజామ్ ఖాన్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గారి సహాయంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

More news from Telangana and nearby areas
  • నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేక‌ర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    16 hrs ago
  • నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.
    1
    నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    20 hrs ago
  • తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ఆలస్యం నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు – “అత్త, కోడలు రావాలి” అంటూ రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 40 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తొర్రూరు–మహబూబాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కేంద్రానికి సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అత్త (ఝాన్సీ రెడ్డి), కోడలు (యశస్విని రెడ్డి) రావాలి” అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
    1
    తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ఆలస్యం నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు – “అత్త, కోడలు రావాలి” అంటూ రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 40 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో తొర్రూరు–మహబూబాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కేంద్రానికి సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అత్త (ఝాన్సీ రెడ్డి), కోడలు (యశస్విని రెడ్డి) రావాలి” అంటూ నినాదాలు చేశారు.
రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    47 min ago
  • తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • Post by Mana Velugu
    1
    Post by Mana Velugu
    user_Mana Velugu
    Mana Velugu
    Teacher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    16 hrs ago
  • తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    16 hrs ago
  • వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    2
    వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    user_Karam jeevan
    Karam jeevan
    Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.
    1
    నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.