Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ నుండి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ప్రకటించారు. హైదరాబాద్ నుండి ఆయన ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Sampathkumar neerudu
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ నుండి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ప్రకటించారు. హైదరాబాద్ నుండి ఆయన ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
More news from తెలంగాణ and nearby areas
- పాల్వంచలో గాలి భీభత్సం: శ్రీ. కనకదుర్గమ్మ ఆలయంలో నేలకొరిగిన 62 ఏళ్ల నాటి పవిత్ర వృక్షం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గతరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షం నేలకొరిగింది. సుమారు 62 సంవత్సరాల క్రితం నాటి రావి, వేప చెట్లు కలిసి ఉన్న ఈ భారీ వృక్షానికి ఆలయ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో కాలంగా భక్తులు ఈ చెట్టును దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నారు. అటువంటి వృక్షం గాలివానకు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి ధుమారానికి ఈ భారీ వృక్షం ఒక్కసారిగా దేవస్థానం ప్రాంగణంలోని **రేకుల షేడ్‌పై** కుప్పకూలింది. ఈ ప్రమాదంలో షేడ్ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, ఈ సంఘటన రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ఆలయ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆలయ సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.4
- హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.1
- తిప్పర్తి మండలంలో ఇండియన్ గ్యాస్ కస్టమర్ల సమస్యను పరిష్కరించాలి: సిపిఎం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని సిపిఎం మండల కార్యదర్శి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి మణిదీప్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం, మండల నాయకులు భీమగాని గణేష్ లు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే సిలిండర్ అందజేయాలని డిమాండ్ చేశారు.1
- రాష్ట్రం దివాలా తీసింది: బొల్లా జగన్ ను విమర్శించడం తప్ప చేసింది ఏమీ లేదు. ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేవలం జగన్ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.1
- వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.1
- కూటమి ప్రభుత్వం పెందుర్తి పెద్ద చెరువు గట్టును సుందరంగా తీర్చిదిద్ది, నడకకు అనుకూలంగా మార్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్ ఈ ట్రాక్‌పై ఆనందంగా షికారు చేస్తున్నారు.1
- 40 ఎకరాల పామాయిల్ తోట ఖమ్మం జిల్లా కల్లూరులో అమ్మకానికి సిద్ధంగా ఉంది. నాలుగు బోర్లు, వివిధ వయసుల పామాయిల్ మొక్కలతో కూడిన ఈ భూమికి ఎకరం 31 లక్షలు ధర చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఇచ్చిన నంబర్‌ను సంప్రదించవచ్చు.1
- భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 3 లక్షల విలువగల తులసి దళం కానుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు కండ్లకుంట శ్రీకాంత్ నీలిమ దంపతులు సుమారు 3లక్షల విలువ గల రాగిపై బంగారు పూతతో కలిగిన 108 తులసీ దళాలను విరాళంగా ఆలయ అధికారులకు అందచేత2
- వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగుపై రూ.46 లక్షల వ్యయంతో నూతన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది, రైతన్నలకు లబ్ధి చేకూరుతుంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని నేతలు తెలిపారు.1