logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#JaiDeshParty * Empowerment must reach the most marginalized women,not just the mostprivileged.Without OBCrepresentation,reservation risks becoming symbolic rather than transformative #Modi #BJP #reservationbill #NDA #Congress #Delimitation #NariShaktiVandan #WomensReservation

4 days ago
user_JaiDesh Party
JaiDesh Party
Visakhapatnam (Urban), Visakhapatanam•
4 days ago
e994123c-0a41-4390-a95f-bd4c42852b99
7002fb9e-2662-4f87-9c25-041e2f0a3bea
a5569eb1-8c3e-4c3b-a469-ad8800d06b95
c1aa2752-8ec1-49cf-8c24-d400ab85a111

#JaiDeshParty * Empowerment must reach the most marginalized women,not just the mostprivileged.Without OBCrepresentation,reservation risks becoming symbolic rather than transformative #Modi #BJP #reservationbill #NDA #Congress #Delimitation #NariShaktiVandan #WomensReservation

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...
    4
    విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది...
జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం.
ఘటన స్థలాలనికి చేరుకున్న  గాజువాక ఫైర్ ఇంజన్లు 
దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... 
యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... 
అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... 
గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో  మంటలు చెలరేగుతున్నాయి...
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**
    1
    **“Wish you a blessed Akshaya Tritiya ✨
May prosperity and positivity fill your life.
Choose comfort that stays with you every day.
MGM Vests – Wear Prosperity.”**
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది.
డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది.
స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    29 min ago
  • డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.
    1
    డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Sageni gangadhar
    1
    Post by Sageni gangadhar
    user_Sageni gangadhar
    Sageni gangadhar
    జి. మడుగుల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అరసవల్లి , ఏప్రిల్,20: ఆహార పదార్థాల్లో హానికారక రంగులు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అరసవెల్లి అసిరి తల్లి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ అసిరీతల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా, ప్రదర్శనశాల ప్రాంతంలో దాని పరిసరాల్లో 11 ఆహార భద్రతా తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు. స్టాళ్లలో ఫాస్ట్ ఫుడ్ (మంచూరియా, నూడుల్స్), ఐస్ క్రీమ్ , మస్కా బన్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తనిఖీ సమయంలో కనుగొన్న విషయాలు: షుగర్ క్యాండీని అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేశారు.ఆ ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి,వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీచేశారు. కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించవద్దు: గడువు ముగిసిన లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దు సరైన పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. ప్రజారోగ్యం భద్రతను నిర్ధారించడానికి, విక్రేతలందరూ FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. . ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని ఎటువంటి నిషేధిత రంగులని, ప్రామాణికము కానీ ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కే .లక్ష్మీ పాల్గొన్నారు
    1
    అరసవల్లి , ఏప్రిల్,20: ఆహార పదార్థాల్లో హానికారక రంగులు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు
సోమవారం సాయంత్రం అరసవెల్లి అసిరి తల్లి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు.
శ్రీ  అసిరీతల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా,  ప్రదర్శనశాల ప్రాంతంలో  దాని పరిసరాల్లో 11 ఆహార భద్రతా తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు.
స్టాళ్లలో ఫాస్ట్ ఫుడ్ (మంచూరియా, నూడుల్స్), ఐస్ క్రీమ్ , మస్కా బన్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి.
తనిఖీ సమయంలో కనుగొన్న విషయాలు:
షుగర్ క్యాండీని అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేశారు.ఆ ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి,వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీచేశారు.
కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించవద్దు:
గడువు ముగిసిన లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దు సరైన పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు.
ప్రజారోగ్యం  భద్రతను నిర్ధారించడానికి, విక్రేతలందరూ FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. . ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని ఎటువంటి నిషేధిత రంగులని, ప్రామాణికము కానీ ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కే .లక్ష్మీ పాల్గొన్నారు
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
    1
    పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు.
పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    1 hr ago
  • డుంబ్రిగూడ, ఏప్రిల్ 21: మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలకు వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ మార్గంలో విద్యార్థులు, స్థానికులు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చేతికందే స్థాయిలో తీగలు ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
    1
    డుంబ్రిగూడ, ఏప్రిల్ 21:
మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలకు వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ మార్గంలో విద్యార్థులు, స్థానికులు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చేతికందే స్థాయిలో తీగలు ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.