Shuru
Apke Nagar Ki App…
Adimlamganash
More news from Konaseema and nearby areas
- Post by Adimlamganash1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .1
- *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు1
- భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.1
- 🙏🙏1
- Post by Adimlamganash1
- వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- చరిత్రలో నిలిచి పోయే గట్టం భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం.1