logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిలకలూరిపేట లో ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా. *తృటిలో తప్పిన ప్రమాదం..* *ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా..* చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్తిసమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది.ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఒక ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది.కళాశాల బస్సు ఎప్పటిలాగే ఇంకొల్లు నుండి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా,పసుమర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టింది.ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లుసమాచారం. ఈ ప్రమాదంలో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని కళాశాలయాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కాలేజీయాజమాన్యం,ఘటనా స్థలానికి మరో బస్సును పంపించి విద్యార్థులను సురక్షితంగా కళాశాలకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

21 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
21 hrs ago
46cd13af-12b6-4f70-9c62-3d3501973b52

చిలకలూరిపేట లో ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా. *తృటిలో తప్పిన ప్రమాదం..* *ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా..* చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్తిసమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది.ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఒక ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది.కళాశాల బస్సు ఎప్పటిలాగే ఇంకొల్లు నుండి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా,పసుమర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టింది.ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లుసమాచారం. ఈ ప్రమాదంలో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని కళాశాలయాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కాలేజీయాజమాన్యం,ఘటనా స్థలానికి మరో బస్సును పంపించి విద్యార్థులను సురక్షితంగా కళాశాలకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు :నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి పార్టీ పసుపు జెండాను గర్వంగా ఆవిష్కరించారు. అనంతరం బద్వేల్-నెల్లూరు రోడ్డులోని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను రితేష్ రెడ్డి మరియు విజయమ్మ ఘనంగా సన్మానించారు. 44 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సీనియర్ నాయకుల సేవలను తమ కుటుంబం ఎప్పటికీ మరువదని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రితేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు. చివరగా, విచ్చేసిన సీనియర్ నాయకులందరితో కలిసి తమ నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి ఈ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.
    2
    బద్వేలు :నియోజకవర్గ ఇన్‌చార్జ్  కే. రితేష్ రెడ్డి  ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ  మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి  పార్టీ పసుపు జెండాను గర్వంగా ఆవిష్కరించారు. 
అనంతరం బద్వేల్-నెల్లూరు రోడ్డులోని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను రితేష్ రెడ్డి మరియు విజయమ్మ  ఘనంగా సన్మానించారు. 
44 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సీనియర్ నాయకుల సేవలను తమ కుటుంబం ఎప్పటికీ మరువదని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రితేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు. చివరగా, విచ్చేసిన సీనియర్ నాయకులందరితో కలిసి తమ నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి ఈ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో P4 MBK 10-20 కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర @2027 లక్ష్యంతో అవగాహన కార్యక్రమం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఒకే సంవత్సరంలో 2.1 లక్షల కుటుంబాలకు లబ్ధి – ఎమ్మెల్యే ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి P4 ద్వారా సమిష్టి అభివృద్ధి లక్ష్యం సంక్షేమం నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు రాష్ట్రం ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దే ప్రయత్నం క్రియాశీలక మార్గదర్శకులకు సన్మానం అధికారుల, ప్రజాప్రతినిధుల, లబ్ధిదారుల పాల్గొనడం జరిగింది.
    1
    ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో P4 MBK 10-20 కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర @2027 లక్ష్యంతో అవగాహన కార్యక్రమం
కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు
ఒకే సంవత్సరంలో 2.1 లక్షల కుటుంబాలకు లబ్ధి – ఎమ్మెల్యే
ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి
P4 ద్వారా సమిష్టి అభివృద్ధి లక్ష్యం
సంక్షేమం నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు రాష్ట్రం
ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దే ప్రయత్నం
క్రియాశీలక మార్గదర్శకులకు సన్మానం
అధికారుల, ప్రజాప్రతినిధుల, లబ్ధిదారుల పాల్గొనడం జరిగింది.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 30-03-2026 కర్నూల్ జిల్లా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు... అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు.. నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు.. అమరావతిలో ఒక శాశ్వత భవనని కట్టలేదు చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు.... ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు... *_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.... రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు.... నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు... ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.. 😎TEAM_BCS🇸🇱 #YSJagan #Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
    1
    30-03-2026
కర్నూల్ జిల్లా 
ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు 
*_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు...
అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు..
నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు..
అమరావతిలో ఒక శాశ్వత  భవనని కట్టలేదు  చంద్రబాబు అని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు....
ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు...
*_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు....
రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు....
నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు...
ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు..
😎TEAM_BCS🇸🇱
#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
    user_Azmath
    Azmath
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    13 hrs ago
  • ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి  కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం 
డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    16 hrs ago
  • Post by T.Shiva Krishna
    1
    Post by T.Shiva Krishna
    user_T.Shiva Krishna
    T.Shiva Krishna
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    4 hrs ago
  • బద్వేలు, మార్చి 30:శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్పటిక శివాలయం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి , గౌరవ అధ్యక్షులు వంకెల పెద్ద పోలిరెడ్డి మరియు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు రాజగోపాల్ రెడ్డి, బద్వేలు జడ్పిటిసి పోలి రెడ్డి, డిఎ డి ఎల్ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, పద్మావతి, సర్పంచ్ జయరాం రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    బద్వేలు, మార్చి 30:శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్పటిక శివాలయం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి , గౌరవ అధ్యక్షులు వంకెల పెద్ద పోలిరెడ్డి  మరియు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ  పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు రాజగోపాల్ రెడ్డి, బద్వేలు జడ్పిటిసి పోలి రెడ్డి, డిఎ డి ఎల్ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు  సత్యనారాయణ, పద్మావతి, సర్పంచ్ జయరాం రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    1
    ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు.
అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    1
    అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ
అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.