జగిత్యాల రైతు బజార్‌లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం...మద్యం మత్తులో కారుతో బైకును ఢీకొట్టడంతో పాటు దుకాణదారుల పై ప్రతాపం...తిరగబడి దాడికి యత్నించి పోలీసులకు అప్పగించిన స్థానికులు. జగిత్యాల రైతుబజార్ లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారుతో బైక్ ను ఢీ కొట్టి అలజడిరేపారు. తాను కౌన్సిలర్ ను, ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేరు చెప్పి కౌన్సిలర్ లక్ష్మి భర్త రాజు హంగామా చేశాడు. మద్యం మత్తులో కారు నడిపి ఓ బైక్ ను ఢీ కొట్టాడు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లాడు. సిసి కెమెరాలో కౌన్సిలర్ భర్త వీరంగం రికార్డ్ అయింది. లైసెన్స్ ఉందా అంటు వ్యాపారులను, రైతులను నిలదీసి నిత్యావసర సరుకులు కింద పడేశాడు. తాను కౌన్సిలర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాక స్థానికులు తిరగబడ్డారు. దాడికి యత్నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్ భర్తను నిలదీస్తే కూరగాయల వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, అందుకే తనిఖీ చేస్తున్నానని వాదనకు దిగాడు. లైసెన్స్ ల గురించి మార్కెట్ కమిటీ చూసుకుంటుందని పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నిస్తే నేను కౌన్సిలర్ ను అంటు హడావిడి చేశాడు. చివరకు సిఐ కరుణాకర్ అక్కడికి చేరుకుని కౌన్సిలర్ భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను లైసెన్స్ చూపించాలని లేకుంటే అన్ని తొలగించి ఇక్కడ క్యాంటిన్ పెడుతానని బెదిరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దుకాణాలు ఖాళీ చేయాలని పలుమార్లు బెదిరించాడని వ్యాపారులు చెప్పారు. రాజుతో పాటు మరో వ్యక్తిపై నిత్యం బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.
జగిత్యాల రైతు బజార్‌లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం...మద్యం మత్తులో కారుతో బైకును ఢీకొట్టడంతో పాటు దుకాణదారుల పై ప్రతాపం...తిరగబడి దాడికి యత్నించి పోలీసులకు అప్పగించిన స్థానికులు. జగిత్యాల రైతుబజార్ లో ఎమ్మెల్యే అనుచరుడు కౌన్సిలర్ భర్త వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారుతో బైక్ ను ఢీ కొట్టి అలజడిరేపారు. తాను కౌన్సిలర్ ను, ఎమ్మెల్యే సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేరు చెప్పి కౌన్సిలర్ లక్ష్మి భర్త రాజు హంగామా చేశాడు. మద్యం మత్తులో
కారు నడిపి ఓ బైక్ ను ఢీ కొట్టాడు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లాడు. సిసి కెమెరాలో కౌన్సిలర్ భర్త వీరంగం రికార్డ్ అయింది. లైసెన్స్ ఉందా అంటు వ్యాపారులను, రైతులను నిలదీసి నిత్యావసర సరుకులు కింద పడేశాడు. తాను కౌన్సిలర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పిండు అంటు హంగామా చేశాడు. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాక స్థానికులు తిరగబడ్డారు. దాడికి యత్నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్ భర్తను నిలదీస్తే కూరగాయల వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా
ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, అందుకే తనిఖీ చేస్తున్నానని వాదనకు దిగాడు. లైసెన్స్ ల గురించి మార్కెట్ కమిటీ చూసుకుంటుందని పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నిస్తే నేను కౌన్సిలర్ ను అంటు హడావిడి చేశాడు. చివరకు సిఐ కరుణాకర్ అక్కడికి చేరుకుని కౌన్సిలర్ భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైతుబజార్ లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను లైసెన్స్ చూపించాలని లేకుంటే అన్ని తొలగించి ఇక్కడ క్యాంటిన్ పెడుతానని బెదిరిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దుకాణాలు ఖాళీ చేయాలని పలుమార్లు బెదిరించాడని వ్యాపారులు చెప్పారు. రాజుతో పాటు మరో వ్యక్తిపై నిత్యం బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.
- ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.1
- BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి1
- Post by Ravi Poreddy1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం,ముత్తోజిపేటలోని హోలీ పండుగకు ముందు రాత్రి మహిళలు సంప్రదాయ కముడు ఆటలను ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కముడు ఆటలు గ్రామీణ సంస్కృతి, ఐక్యతను చాటుతూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. చిన్నారులు, యువతీ యువకులు కూడా వీక్షకులుగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు. హోలీ పండుగను కుటుంబ సభ్యులంతా కలసి ఆనందంగా జరుపుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.2
- Jangaon పట్టణంలో బంజారా జ్యోతి Sant Sevalal Maharaj 287వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, సభాధ్యక్షులు అజ్మీరా స్వామి నాయక్ నేతృత్వం వహించారు. కార్యక్రమం సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, వందల ఏళ్ల క్రితమే వ్యసనాలకు దూరంగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, శాకాహార జీవనం గడపాలని సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు, ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బంజారా సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ బంజారా సమాజ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో బంజారా సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన యువతులు, యువకులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనగామ పట్టణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు నిదర్శనంగా నిలిచాయి.1
- హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.1
- ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.1
- కామారెడ్డి జిల్లా : ముంబాజీపేట 21 ఫీట్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన' లింగంపేట మండలంలోని ముంబాజిపేట తండా జగదాంబ సేవలాల్ ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 21 అడుగుల ధ్వజస్తంభంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాడు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు మహాహోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.1