logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోడు భూములపై ఉద్రిక్తత.. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న రైతులు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

3 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
3 hrs ago

పోడు భూములపై ఉద్రిక్తత.. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న రైతులు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం లో విషాద ఘటన చోటుచేసుకుంది.. సిరోలు మండలం అంధనాలపాడు గ్రామ పరిధిలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్ (23) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. సురేష్‌కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అయితే భార్య అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఆంగోత్ సాయితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. భార్య ప్రవర్తనతో మనస్థాపానికి గురైన సురేష్ ఆత్మ హత్య కు పాల్పడినట్లు మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని ఆందోళన చేపట్టారు పోలీస్ సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం లో విషాద ఘటన చోటుచేసుకుంది..
సిరోలు మండలం అంధనాలపాడు గ్రామ పరిధిలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్ (23) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
సురేష్‌కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అయితే భార్య అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఆంగోత్ సాయితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. భార్య ప్రవర్తనతో మనస్థాపానికి గురైన సురేష్ ఆత్మ హత్య కు పాల్పడినట్లు మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు.
తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని ఆందోళన చేపట్టారు 
పోలీస్  సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
    1
    హోలీ పండుగ పూట జగిత్యాల పోచమ్మవాడ లో విషాదం అలుముకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రణవి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు ఉదయం గోదావరి పుణ్యస్నానాలకు వెళ్ళి వచ్చే సరికి ప్రణవి ఇంట్లో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూతురును స్థానికుల సహాయంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం ఇచ్చిన సకాలంలో 108 రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో చేతులపైనే పేషెంట్ ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ప్రాణాలు కోల్పోయిందని తెలుపడంతో పేరెంట్స్ బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని, కనీసం స్ట్రెచ్చర్ కూడా తీసుకొచ్చి పేషంటును ఆసుపత్రిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణవి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ పెళ్ళి సంబంధాలు చూసినట్లు పేరెంట్స్ తెలిపారు. ఎలాంటి గొడవలు లేవని పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు
    1
    నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం నగరం 26 డివిజన్ పరిధిలోని రామాలయం వీధిలో మంగళవారం ఉదయం చిన్నారులందరూ ఆటపాటలతో ఘనంగా హోళీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులందరూ ఉదయాన్నే లేచి స్నేహితులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు. ఆ వీధిగుండా వెళ్ళేవారికి మీద కూడా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వారిని చూసి తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా శుభాకాంక్షలు అందజేశారు.
    1
    ఖమ్మం నగరం 26 డివిజన్ పరిధిలోని రామాలయం వీధిలో మంగళవారం ఉదయం చిన్నారులందరూ ఆటపాటలతో ఘనంగా హోళీ పండుగ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారులందరూ ఉదయాన్నే లేచి స్నేహితులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు.
ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు.
ఆ వీధిగుండా వెళ్ళేవారికి మీద కూడా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.
వారిని చూసి తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా శుభాకాంక్షలు అందజేశారు.
    user_**మాంధాత**
    **మాంధాత**
    Astrologer ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
    1
    నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*
*నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..*
13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం...
*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్...
ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి...
*నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    4 hrs ago
  • ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
    1
    ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు.
ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రపంచ పోలీసుల వ్యవహరిస్తున్న అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ దేశ అధ్యక్షుడిని హత్య చేసినా ఇరాన్ అధ్యక్షుడి హత్యను మన దేశ ప్రధాని మోడీ ఖండించకపోవడం సరికాదని *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న* అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైవ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నల్ల గుడ్డతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ అలీన దేశాల విధానాన్ని కలిగి ఉన్న భారత ప్రభుత్వం సామ్రాజ్యవాద దురాక్రమణ దేశాలైన అమెరికా ఇజ్రాయిల్ తో చట్టపట్టలేసుకొని తిరగటం గత చరిత్రకు మాయని మచ్చ అన్నారు. ఒక స్వతంత్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఖమోనిని చంపితే కనీసం విచారాన్ని వ్యక్తం చేయకపోవడం అమెరికను చూసి మోడీ భయపడుతున్న తీర్పు నిదర్శనం అని అన్నారు. మనకు కావాల్సిన ఆయిల్ ఉత్పత్తులు చౌక ధరకు భారతదేశానికి అందిస్తున్న ఇరాన్ అస్తవ్యస్త పరిస్థితి మన దేషాన్ని ఆర్థిక తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. మన సంస్కృతి,కలలు చారిత్రక వారసత్వ సంపద కలిగిన దక్షిణాసియా దేశాలలో ఏ సమస్య వచ్చినా స్పందించే భారత్ మోడీ తీరు వల్ల తలదించుకోవలసిన దుస్థితి నెలకొందని అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు బెంజమన్ నితిన్యూలను యుద్ధ నేరస్తులుగా నిలబెట్టాలని చంద్రన్న సూచించారు. దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా భారతీయ ప్రజలు పెద్ద ఎత్తున తమ నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి పూనం ప్రభాకర్ డివిజన్ నాయకులు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు...
    1
    ప్రపంచ పోలీసుల వ్యవహరిస్తున్న అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ దేశ అధ్యక్షుడిని హత్య చేసినా ఇరాన్ అధ్యక్షుడి హత్యను మన దేశ ప్రధాని మోడీ ఖండించకపోవడం సరికాదని *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న* అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైవ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లోని అంబేద్కర్  విగ్రహం ఎదురుగా నల్ల గుడ్డతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ అలీన దేశాల విధానాన్ని కలిగి ఉన్న భారత ప్రభుత్వం సామ్రాజ్యవాద దురాక్రమణ దేశాలైన అమెరికా ఇజ్రాయిల్ తో చట్టపట్టలేసుకొని తిరగటం గత చరిత్రకు మాయని మచ్చ అన్నారు. ఒక స్వతంత్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఖమోనిని చంపితే కనీసం విచారాన్ని వ్యక్తం చేయకపోవడం అమెరికను చూసి మోడీ భయపడుతున్న తీర్పు నిదర్శనం అని అన్నారు. మనకు కావాల్సిన ఆయిల్ ఉత్పత్తులు చౌక ధరకు భారతదేశానికి అందిస్తున్న ఇరాన్ అస్తవ్యస్త పరిస్థితి మన దేషాన్ని ఆర్థిక తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. మన సంస్కృతి,కలలు చారిత్రక వారసత్వ సంపద కలిగిన దక్షిణాసియా దేశాలలో ఏ సమస్య వచ్చినా స్పందించే భారత్ మోడీ తీరు వల్ల తలదించుకోవలసిన దుస్థితి నెలకొందని అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు బెంజమన్ నితిన్యూలను యుద్ధ నేరస్తులుగా నిలబెట్టాలని చంద్రన్న సూచించారు. దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా భారతీయ ప్రజలు పెద్ద ఎత్తున తమ నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి పూనం ప్రభాకర్ డివిజన్ నాయకులు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు...
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • రంగుల కేళి రంగోలి.. హోళీ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎత్తున జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని రెయిన్ డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. హోళీ పండుగతో కోడిగుడ్లకు భలే గారాకీ పెరిగింది. రంగులే కాకుండా కోడిగుడ్లు ఒకరిపై ఒకరు కొట్టుకుని హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులతో పాటు పలు దుకాణాల్లో కోడిగుడ్లు ఖాళీ అయ్యాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా హోళీ వేడుకల్లో మునిగి తేలారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. హోళీ సందర్భంగా రంగుల్లో మునిగి తేలిన జనం చల్లని పానియాలు.. మద్యంతో విందు భోజనాలు ఆరగించారు. హోళీతో వైన్ షాప్ లు రద్దీగా మారి కొన్ని షాప్ ల్లో స్టాక్ ఖాళీ అయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగులు చల్లుకుని హోళీ సంబరాలతో ఆడిపాడిన యువత, మధ్యాహ్నం నుంచి విందు వినోదాలతో కాలం గడిపారు.
    4
    రంగుల కేళి రంగోలి.. హోళీ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎత్తున జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని రెయిన్ డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
హోళీ పండుగతో కోడిగుడ్లకు భలే గారాకీ పెరిగింది. రంగులే కాకుండా కోడిగుడ్లు ఒకరిపై ఒకరు కొట్టుకుని హోళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగులతో పాటు పలు దుకాణాల్లో కోడిగుడ్లు ఖాళీ అయ్యాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా హోళీ వేడుకల్లో మునిగి తేలారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. హోళీ సందర్భంగా రంగుల్లో మునిగి తేలిన జనం చల్లని పానియాలు.. మద్యంతో విందు భోజనాలు ఆరగించారు. హోళీతో వైన్ షాప్ లు రద్దీగా మారి కొన్ని షాప్ ల్లో స్టాక్ ఖాళీ అయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగులు చల్లుకుని హోళీ సంబరాలతో ఆడిపాడిన యువత, మధ్యాహ్నం నుంచి విందు వినోదాలతో కాలం గడిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.