Shuru
Apke Nagar Ki App…
ఖమ్మంలో చిన్నారుల హోళీ సంబరాలు. ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం. ఖమ్మం నగరం 26 డివిజన్ పరిధిలోని రామాలయం వీధిలో మంగళవారం ఉదయం చిన్నారులందరూ ఆటపాటలతో ఘనంగా హోళీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులందరూ ఉదయాన్నే లేచి స్నేహితులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు. ఆ వీధిగుండా వెళ్ళేవారికి మీద కూడా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వారిని చూసి తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా శుభాకాంక్షలు అందజేశారు.
**మాంధాత**
ఖమ్మంలో చిన్నారుల హోళీ సంబరాలు. ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం. ఖమ్మం నగరం 26 డివిజన్ పరిధిలోని రామాలయం వీధిలో మంగళవారం ఉదయం చిన్నారులందరూ ఆటపాటలతో ఘనంగా హోళీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులందరూ ఉదయాన్నే లేచి స్నేహితులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు. ఆ వీధిగుండా వెళ్ళేవారికి మీద కూడా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వారిని చూసి తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా శుభాకాంక్షలు అందజేశారు.
More news from తెలంగాణ and nearby areas
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మ తల్లి) ఆలయం మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మూతపడింది. భక్తుల కొంగుబంగారంగా వెలసిన ఈ క్షేత్రంలో గ్రహణ నియమాల దృష్ట్యా ప్రత్యేక మార్పులు చేపట్టారు. నేడు తెల్లవారుజామున 5 గంటలకే ఆలయ తలుపులు తెరిచి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు కొద్దిసేపు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, గరికతో ఆలయమంతా ప్రోక్షణ చేశారు. ఉదయం 7:30 గంటలకు ఆలయ అర్చకులు, పాలకమండలి చైర్మన్ సమక్షంలో ఆలయ ద్వారబంధనం(తలుపులు మూసివేత) చేశారు. గ్రహణ సమయం ముగిసే వరకు భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరల రేపు (బుధవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తీసి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు యధావిధిగా దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ తెలిపారు.1
- ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం,ముత్తోజిపేటలోని హోలీ పండుగకు ముందు రాత్రి మహిళలు సంప్రదాయ కముడు ఆటలను ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కముడు ఆటలు గ్రామీణ సంస్కృతి, ఐక్యతను చాటుతూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. చిన్నారులు, యువతీ యువకులు కూడా వీక్షకులుగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు. హోలీ పండుగను కుటుంబ సభ్యులంతా కలసి ఆనందంగా జరుపుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.2
- Jangaon పట్టణంలో బంజారా జ్యోతి Sant Sevalal Maharaj 287వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, సభాధ్యక్షులు అజ్మీరా స్వామి నాయక్ నేతృత్వం వహించారు. కార్యక్రమం సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, వందల ఏళ్ల క్రితమే వ్యసనాలకు దూరంగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, శాకాహార జీవనం గడపాలని సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు, ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బంజారా సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ బంజారా సమాజ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో బంజారా సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన యువతులు, యువకులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనగామ పట్టణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు నిదర్శనంగా నిలిచాయి.1
- నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...1
- ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.1
- ప్రపంచ పోలీసుల వ్యవహరిస్తున్న అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ దేశ అధ్యక్షుడిని హత్య చేసినా ఇరాన్ అధ్యక్షుడి హత్యను మన దేశ ప్రధాని మోడీ ఖండించకపోవడం సరికాదని *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న* అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైవ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నల్ల గుడ్డతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ అలీన దేశాల విధానాన్ని కలిగి ఉన్న భారత ప్రభుత్వం సామ్రాజ్యవాద దురాక్రమణ దేశాలైన అమెరికా ఇజ్రాయిల్ తో చట్టపట్టలేసుకొని తిరగటం గత చరిత్రకు మాయని మచ్చ అన్నారు. ఒక స్వతంత్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఖమోనిని చంపితే కనీసం విచారాన్ని వ్యక్తం చేయకపోవడం అమెరికను చూసి మోడీ భయపడుతున్న తీర్పు నిదర్శనం అని అన్నారు. మనకు కావాల్సిన ఆయిల్ ఉత్పత్తులు చౌక ధరకు భారతదేశానికి అందిస్తున్న ఇరాన్ అస్తవ్యస్త పరిస్థితి మన దేషాన్ని ఆర్థిక తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. మన సంస్కృతి,కలలు చారిత్రక వారసత్వ సంపద కలిగిన దక్షిణాసియా దేశాలలో ఏ సమస్య వచ్చినా స్పందించే భారత్ మోడీ తీరు వల్ల తలదించుకోవలసిన దుస్థితి నెలకొందని అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు బెంజమన్ నితిన్యూలను యుద్ధ నేరస్తులుగా నిలబెట్టాలని చంద్రన్న సూచించారు. దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా భారతీయ ప్రజలు పెద్ద ఎత్తున తమ నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి పూనం ప్రభాకర్ డివిజన్ నాయకులు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు...1
- చండ్రుగొండ మండలం చండ్రుగొండ లో నమ్మదగిన సమాచారం మేరకు సీసీఎస్ మరియు చండ్రుగొండ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు బ్యాగ్ లను తనిఖీ చేయగా వాటిలో 10.50 లక్షల రూపాయల విలువ చేసే 21 కేజీల నిషేధిత గంజాయి ఉండడంతో గంజాయితోపాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్ లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.... ఒరిస్సా రాష్ట్రం నుండి తెలంగాణా, ఆంద్రప్రదేశ్ మీదుగా తమిళనాడు లోని చెన్నై కు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం తో వారిని పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ముగ్గురు వ్యక్తులు విజయవాడ, ఒడిశా రాష్ట్రానికి చెందినవారని అన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను సేవించిన, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.1
- ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.1