ఇరాన్ అధ్యక్షుడి హత్యను మోడీ ఖండించకపోవడం సరికాదు, జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నల్ల గుడ్డతో నిరసన ప్రపంచ పోలీసుల వ్యవహరిస్తున్న అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ దేశ అధ్యక్షుడిని హత్య చేసినా ఇరాన్ అధ్యక్షుడి హత్యను మన దేశ ప్రధాని మోడీ ఖండించకపోవడం సరికాదని *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న* అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైవ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నల్ల గుడ్డతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ అలీన దేశాల విధానాన్ని కలిగి ఉన్న భారత ప్రభుత్వం సామ్రాజ్యవాద దురాక్రమణ దేశాలైన అమెరికా ఇజ్రాయిల్ తో చట్టపట్టలేసుకొని తిరగటం గత చరిత్రకు మాయని మచ్చ అన్నారు. ఒక స్వతంత్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఖమోనిని చంపితే కనీసం విచారాన్ని వ్యక్తం చేయకపోవడం అమెరికను చూసి మోడీ భయపడుతున్న తీర్పు నిదర్శనం అని అన్నారు. మనకు కావాల్సిన ఆయిల్ ఉత్పత్తులు చౌక ధరకు భారతదేశానికి అందిస్తున్న ఇరాన్ అస్తవ్యస్త పరిస్థితి మన దేషాన్ని ఆర్థిక తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. మన సంస్కృతి,కలలు చారిత్రక వారసత్వ సంపద కలిగిన దక్షిణాసియా దేశాలలో ఏ సమస్య వచ్చినా స్పందించే భారత్ మోడీ తీరు వల్ల తలదించుకోవలసిన దుస్థితి నెలకొందని అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు బెంజమన్ నితిన్యూలను యుద్ధ నేరస్తులుగా నిలబెట్టాలని చంద్రన్న సూచించారు. దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా భారతీయ ప్రజలు పెద్ద ఎత్తున తమ నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి పూనం ప్రభాకర్ డివిజన్ నాయకులు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు...

- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు డివిజన్, గూడూరు WLM పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ... ప్రకృతి సమతుల్యతలో వన్యప్రాణుల పాత్ర అత్యంత కీలకమని, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు పిలుపునిచ్చారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పొల్గొన్నారు,అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని, రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి పచ్చని ప్రకృతి అని ఆయన పేర్కొన్నారు. గూడూరు డివిజన్ (WLM) పరిధిలో అడవుల రక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. నినాదం: "వన్యప్రాణులను కాపాడుదాం - భవిష్యత్తును రక్షిద్దాం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. "ప్రకృతి ప్రసాదించిన వన్యప్రాణుల సంపదను ధ్వంసం చేయడం అంటే మన వినాశనాన్ని మనం కోరుకోవడమే. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అరుదైన జీవజాలాన్ని సంరక్షించుకోవాలి. అటవీ శాఖ అధికారులు, ప్రజలు సమన్వయంతో వేటగాళ్ల నుండి, అగ్నిప్రమాదాల నుండి అడవిని కాపాడుకోవాలి." ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ అటవీ శాఖ అధికారులు, రేంజ్ సిబ్బంది మరియు పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వన్యప్రాణుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని, అడవుల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం,ముత్తోజిపేటలోని హోలీ పండుగకు ముందు రాత్రి మహిళలు సంప్రదాయ కముడు ఆటలను ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కముడు ఆటలు గ్రామీణ సంస్కృతి, ఐక్యతను చాటుతూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. చిన్నారులు, యువతీ యువకులు కూడా వీక్షకులుగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు. హోలీ పండుగను కుటుంబ సభ్యులంతా కలసి ఆనందంగా జరుపుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.2
- Jangaon పట్టణంలో బంజారా జ్యోతి Sant Sevalal Maharaj 287వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, సభాధ్యక్షులు అజ్మీరా స్వామి నాయక్ నేతృత్వం వహించారు. కార్యక్రమం సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, వందల ఏళ్ల క్రితమే వ్యసనాలకు దూరంగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, శాకాహార జీవనం గడపాలని సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు, ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బంజారా సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ బంజారా సమాజ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో బంజారా సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన యువతులు, యువకులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనగామ పట్టణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు నిదర్శనంగా నిలిచాయి.1
- ఖమ్మం నగరం 26 డివిజన్ పరిధిలోని రామాలయం వీధిలో మంగళవారం ఉదయం చిన్నారులందరూ ఆటపాటలతో ఘనంగా హోళీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులందరూ ఉదయాన్నే లేచి స్నేహితులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు. ఆ వీధిగుండా వెళ్ళేవారికి మీద కూడా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వారిని చూసి తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా శుభాకాంక్షలు అందజేశారు.1
- మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.1
- జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.4
- వసంత కాలం వచ్చేసింది.. రంగుల పండుగ హోళీ అంబరాన్నంటింది! మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో హోళీ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల వేడుకలో మునిగిపోయారు. ఆ సందడి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. వాయిస్ ఓవర్ మరిపెడ మున్సిపాలిటీ రంగులమయమైంది. పట్టణంలోని ప్రధాన వీధులన్నీ హోళీ వేడుకలతో కోలాహలంగా మారాయి. ఉదయం నుంచే యువత, చిన్నారులు రంగులు, గులాల్‌తో రోడ్లపైకి చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా చిన్నారుల సందడి అంతా ఇంతా కాదు. రంగు నీళ్లతో నిండిన పిచికారీలతో ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. చిన్నారుల నవ్వులతో మరిపెడ వీధులు మారుమోగిపోయాయి. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అందరూ ఈ రంగుల పండుగలో భాగస్వాములయ్యారు. డిజె పాటలకు యువత స్టెప్పులేయగా, మహిళలు సైతం హోళీ పాటలతో సందడి చేశారు. మనస్పర్థలు వీడి, ఆత్మీయ ఆలింగనాలతో స్నేహ హస్తాన్ని చాటుకున్నారు. మొత్తానికి మరిపెడలో హోళీ వేడుకలు సంతోషాల మధ్య, అత్యంత వైభవంగా ముగిశాయి. ఎటు చూసినా రంగుల విందుతో పట్టణం కొత్త కళను సంతరించుకుంది1