నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
- ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.1
- అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలలో వేలాదిమంది విద్యార్థులతోని దద్దరిల్లిన ఓయూ. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డిజె సౌండ్ ల నడుమ నృత్యం చేస్తూ ఓయూ ప్రాంగణమంతా కలర్లతో నిండిపోయింది.1
- జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్* బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు2
- హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు మరియు ప్రజా ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని తెలిపారు. హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రాంతాల వద్ద జాగ్రత్తలు ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ శాంతి, సౌహార్ద్ర వాతావరణంలో, పరస్పర గౌరవంతో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు.1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.1
- ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.1
- ఆదివాసుల ఆడబిడ్డ ములుగు ప్రజల ముద్దుబిడ్డ మంత్రి సీతక్క ఇలాకాలో మళ్లీ పోడు భూముల సమస్యతో బగ్గుమన్న ఆదివాసి ప్రజలు ములుగు జిల్లా, తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్న అధికారులను అడ్డుకున్న ఆదివాసి పోడు రైతులు తరాలుగా సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. మా కష్టాలు తెలిసిన సీతక్క మంత్రిగా ఉన్న ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై అటవీ అధికారులు ఆధిపత్యం చేస్తుంటే మంత్రి సీతక్క మౌనంగా ఉంటాం పట్ల ఆదివాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క జోక్యం చేసుకొని అమాయక ఆదివాసి ప్రజల పోడు సాగు భూములు కాపాడి ఆదివాసులకు హక్కు పత్రాలు ఇచ్చి తమ ప్రజలకు అండగా నిలవాలని ఆదివాసి ప్రజలు కోరుతున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం లో విషాద ఘటన చోటుచేసుకుంది.. సిరోలు మండలం అంధనాలపాడు గ్రామ పరిధిలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్ (23) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. సురేష్‌కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అయితే భార్య అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఆంగోత్ సాయితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. భార్య ప్రవర్తనతో మనస్థాపానికి గురైన సురేష్ ఆత్మ హత్య కు పాల్పడినట్లు మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని ఆందోళన చేపట్టారు పోలీస్ సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1