సురక్షితంగా, సాంప్రదాయబద్ధంగా హోళీ వేడుకలు జరుపుకోండి – జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు మరియు ప్రజా ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని తెలిపారు. హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రాంతాల వద్ద జాగ్రత్తలు ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ శాంతి, సౌహార్ద్ర వాతావరణంలో, పరస్పర గౌరవంతో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు.

- హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు మరియు ప్రజా ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని తెలిపారు. హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రాంతాల వద్ద జాగ్రత్తలు ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ శాంతి, సౌహార్ద్ర వాతావరణంలో, పరస్పర గౌరవంతో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం,ముత్తోజిపేటలోని హోలీ పండుగకు ముందు రాత్రి మహిళలు సంప్రదాయ కముడు ఆటలను ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కముడు ఆటలు గ్రామీణ సంస్కృతి, ఐక్యతను చాటుతూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. చిన్నారులు, యువతీ యువకులు కూడా వీక్షకులుగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు. హోలీ పండుగను కుటుంబ సభ్యులంతా కలసి ఆనందంగా జరుపుకోవాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.2
- Jangaon పట్టణంలో బంజారా జ్యోతి Sant Sevalal Maharaj 287వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, సభాధ్యక్షులు అజ్మీరా స్వామి నాయక్ నేతృత్వం వహించారు. కార్యక్రమం సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, వందల ఏళ్ల క్రితమే వ్యసనాలకు దూరంగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, శాకాహార జీవనం గడపాలని సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు, ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బంజారా సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అజ్మీరా స్వామి నాయక్ మాట్లాడుతూ బంజారా సమాజ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో బంజారా సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన యువతులు, యువకులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనగామ పట్టణంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు భక్తి, ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు నిదర్శనంగా నిలిచాయి.1
- ఖమ్మం నగరం 26 డివిజన్ పరిధిలోని రామాలయం వీధిలో మంగళవారం ఉదయం చిన్నారులందరూ ఆటపాటలతో ఘనంగా హోళీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులందరూ ఉదయాన్నే లేచి స్నేహితులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు. ఆ వీధిగుండా వెళ్ళేవారికి మీద కూడా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వారిని చూసి తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా శుభాకాంక్షలు అందజేశారు.1
- మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.1
- జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.4
- మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం లో విషాద ఘటన చోటుచేసుకుంది.. సిరోలు మండలం అంధనాలపాడు గ్రామ పరిధిలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్ (23) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. సురేష్‌కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అయితే భార్య అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఆంగోత్ సాయితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. భార్య ప్రవర్తనతో మనస్థాపానికి గురైన సురేష్ ఆత్మ హత్య కు పాల్పడినట్లు మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని ఆందోళన చేపట్టారు పోలీస్ సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1