Shuru
Apke Nagar Ki App…
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి... బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ ఎన్నికల్లో పాల్గొన నివ్వకుండా, అడ్డుకుంటున్న పోలీసులు, కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మీద కేసు నమోదు అయిందని అడ్డుకున్న పోలీసులు అక్రమ కేసులు పెడతారా అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపాటు దీంతో బాల్క సుమన్ మీద రాళ్ల దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనంతరం బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
Chetty:Ramesh
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి... బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ ఎన్నికల్లో పాల్గొన నివ్వకుండా, అడ్డుకుంటున్న పోలీసులు, కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మీద కేసు నమోదు అయిందని అడ్డుకున్న పోలీసులు అక్రమ కేసులు పెడతారా అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపాటు దీంతో బాల్క సుమన్ మీద రాళ్ల దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనంతరం బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా నర్సంపేటలో వాల్ పోస్టర్ నర్సంపేట పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వరంగల్ రోడ్ చౌరస్తా కాకతీయ తోరణం వద్ద శుక్రవారం వాల్ పోస్టర్‌ను శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంద్యాల వినయ్ రెడ్డి మాట్లాడుతూ— రాబోయే 19-02-2026 గురువారం రోజున మహబూబాబాద్ రోడ్, అరవింద్ రైస్ మిల్ సమీపంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మంది హాజరవుతారని, ఉదయం 9.30 గంటలకు ర్యాలీగా బయలుదేరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, స్వరాజ్య స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, దేశభక్తి భావనలను ప్రజల్లో మరింత బలంగా నాటేందుకు ఈ విగ్రహ ఆవిష్కరణ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. నర్సంపేటలో కొలువు దీరనున్న శివాజీ విగ్రహం పట్టణానికి గర్వకారణంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే విగ్రహ ఆవిష్కరణ రోజున హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోలిపాక విజయ్, ఊరూగొండ శివ, శ్రీనివాస్, మల్లారెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నాయకులు పట్టణ ప్రజలను కలిసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించారు. నర్సంపేటలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠతో ప్రాంతంలో సాంస్కృతిక–జాతీయ చైతన్యం మరింత పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ఈ స్థలం ప్రజలకు ప్రేరణ కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.1
- తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు BRS Party అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు KCR పుట్టినరోజు సందర్భంగా మెట్టుగుట్ట శ్రీ స్వయంభు మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.1
- మహబూబాబాద్ లో మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో, బిఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ఇంచార్జ్ గా కేటీఆర్ నియమించిన సత్యవతిరాథోడ్, కురవిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, తొర్రూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ అరెస్ట్ జరిగింది. ఈ పరిణామం ఎన్నికల ప్రక్రియలో ఉద్రిక్తతలకు దారితీసింది.1
- హనుమకొండ జిల్లా: హనుమకొండలోని శాసన మండలి ప్రతి పక్ష నేత సిరికొండ మధుసూదన చారి నివాసంలో హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. తొరూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కు బయలుదేరుతుండగా దరికి అడ్డగా పోలీసుల మోహరింపు.మధుసూదన చారి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డ మధుసూదన చారి.మెజార్టీ స్థానాలు గెలుచుకున్న తొర్రూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నది. ఇందిరాగాంధీ నుండి రేవంత్ రెడ్డి వరకు ప్రజాస్వామ్యాన్ని తొక్కి పెడుతున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. శాసన సభాపక్ష నేత సిరికొండ మధుసూదన చారి.4
- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని 2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.3
- నేటి నుండి ప్రారంభంగానున్న నాలుగోవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ డ్యూటీ మీట్ లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బంగారు పతకంతో బోణి కొట్టారు. ఈ క్రీడల్లో మొదటగా నిర్వహించిన పది కిలోమీటర్ల పరుగు పందెంలో వరంగల్ రిజర్వ్ విభాగానికి చెందిన గూగులోత్ మౌనిక 10 కిలో మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పతకాల ఖాతా ప్రారంభించింది. ఈ మెడల్ సాధించిన మౌనికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు4
- జనగామ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నేడు ఉత్కంఠభరితంగా జరగనున్నాయి. సోమవారం గందరగోళం కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలను ప్రొసీడింగ్ అధికారి ఆర్డీవో గోపిరామ్ నేడు మధ్యాహ్నం 12:30 గంటలకు రీఫిక్స్ చేశారు. సభ్యుల బలాబలాలు మారితే ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశమున్నందున, పార్టీలు తీవ్రంగా చురుకుగా ఉన్నాయి. ఇరు ప్రధాన పార్టీలకు సమాన సభ్యులుంటే, లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.1
- మరిపెడ మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం లోని డోర్నకల్ మరిపెడ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయనందించిన ఓటర్ మహాశయులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.1