Shuru
Apke Nagar Ki App…
నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు,అందులో భాగంగా స్వామి వారికి ఐదు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు, కావున నెల్లూరు ప్రజలు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా నిర్వాహకులు కోరారు, ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన చిల్డ్రన్స్ పార్క్ స్థానిక వ్యాపారస్తులు స్థానికులు అందర్నీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు నిర్వాహకులు గళ్ళ కృష్ణ గారు తెలిపారు
SRIHARI POONDLA
నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు,అందులో భాగంగా స్వామి వారికి ఐదు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు, కావున నెల్లూరు ప్రజలు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా నిర్వాహకులు కోరారు, ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన చిల్డ్రన్స్ పార్క్ స్థానిక వ్యాపారస్తులు స్థానికులు అందర్నీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు నిర్వాహకులు గళ్ళ కృష్ణ గారు తెలిపారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వినాయక చవితి సందర్భంగా బద్వేలు కు విచ్చేసిన జబర్దస్త్ టీం బద్వేలు, సెప్టెంబర్ 15:వినాయక చవితి పండుగ శోభతో బద్వేలు పట్టణం కోలాహలంగా మారింది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రముఖ జబర్దస్త్ టీం బద్వేలు కు విచ్చేసింది.బద్వేలు పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సందడి చేశారు. తమదైన కామెడీ పంచ్ లతో అక్కడికి వచ్చిన అభిమానులను, చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా శేఖర్ రాయల్ కుటుంబ సభ్యులు జబర్దస్త్ టీంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చుట్టుపక్కల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి1
- మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- కుల దూషణ ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదు : మండల టిడిపి నాయకులు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో జరిగిన కుల దూషణ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని దోర్నాల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ ఘటనను టీడీపీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.1
- పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.1
- వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.1
- మదనపల్లె బైపాస్‌లో బైక్ వీలింగ్ చేస్తూ వీరంగం పట్టించుకోని పోలీసులు..... అన్నమయ్య జిల్లా. మదనపల్లి. *ఆఖతాయి ల బైక్ స్టంట్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు..* అన్నమయ్య జిల్లా కేంద్రంలోని ముంబై టూ చెన్నయ్ జాతీయ రహదారి, బైపాస్ రోడ్డులో యువకులు, మైనర్లు బైక్ స్టంట్లతో హల్‌చల్ చేస్తున్నారు. సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలతో, ముందు చక్రం పైకెత్తి 80-180 వేగంతో వీలింగ్ చేస్తూ జాతీయ రహదారిపై ప్రజలతో పాటు వాహణ సోదకుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాకపోకలు సాగుతున్న సమయాల్లోనూ.. పట్టణ పుర వీధుల్లో పోలీసుల ముందే అల్లరి మూకలు ఇలాంటి వీరంగాలు చేస్తుంటే, హెల్మెట్ లేకుంటే, తాగి డ్రైవ్ చేస్తుంటే ఫైన్ లు వేసే పోలీసులకు ఇవి కనిపించవా అంటూ వాహనదారులు పోలీస్ యంత్రాంగం తీరుపై మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోయాక అయినా పట్టించు కుంటారోలేదో అంటున్నారు...2
- బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.2