బేతోలులో ఘనంగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు 1500 మిలాద్-ఉన్- నబీ హజరత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)1448వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక జరుపుకునే పూర్వదిన ఈద్-ఏ-మిలాద్-ఉన్- నబీ భక్తి ప్రపత్తులతో ఈ పవిత్రమైన పండుగ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి అంగోత్ లక్ష్మణ్ ఆగస్టు 26: మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామం లో బుధవారం ప్రపంచ శాంతి మానవళికి సమానత్వం దయ ధర్మ సత్యం నిజాయితీ శాంతి సందేశాన్ని బోధించిన ప్రవక్త హజరత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)1448వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక జరుపుకునే పూర్వదిన ఈద్-ఏ-మిలాద్-ఉన్- నబీ భక్తి ప్రపత్తులతో ఈ పవిత్రమైన పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మిఠాయి లు పాయసం పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ముస్లిం మత పెద్ద షేక్ యూసుఫ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహే వసల్లం) బోధనలు మానవాళికి మార్గదర్శకం ఆయన చూపిన మార్గం శాంతి ప్రేమ సమానత్వం సహనానికి ప్రతీక మన జీవితాల్లో ఆయన బోధనలను ఆచరిస్తే ప్రపంచం స్వర్గంలో మారుతుంది మత సామరస్యంతో పౌరస్వర గౌరవంతో మన గ్రామాన్ని దేశాన్ని అభివృద్ధి చేద్దాం ప్రతి ఒక్కరూ పరులకు సహాయం చేయాలి అదే ప్రవక్త చూపిన సత్యమార్గం అన్నారు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా షేక్ ఖాదర్ బాబా మాట్లాడు తూ ఒక్క విగ్రహము లేదు ఒక చిత్రపటం లేదు ఆయన గురించి 1500 ఏండ్లు గడిచిపోయిన ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న హృదయ విజేత మహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు ప్రపంచ శాంతికి మానవాళి మేలుకోసం ప్రవక్త మహమ్మద్ చూపిన ప్రేమ శాంతి ధర్మం మార్గంలో నడవడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి వారి బోధనలను మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ అందరితో ప్రేమగా మెలుగుతూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం ఖాదర్ బాబా అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ ఫకీర్ షేక్ యాకూబ్ షేక్ బాబా మహమ్మద్ యూసుఫ్ షేక్ పాష మహమ్మద్ ఇర్ఫాన్ షేక్ ఫయాజ్ షేక్ జానీ మియా తదితరులు పాల్గొన్నారు.
బేతోలులో ఘనంగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు 1500 మిలాద్-ఉన్- నబీ హజరత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)1448వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక జరుపుకునే పూర్వదిన ఈద్-ఏ-మిలాద్-ఉన్- నబీ భక్తి ప్రపత్తులతో ఈ పవిత్రమైన పండుగ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి అంగోత్ లక్ష్మణ్ ఆగస్టు 26: మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామం లో బుధవారం ప్రపంచ శాంతి మానవళికి సమానత్వం దయ ధర్మ సత్యం నిజాయితీ శాంతి సందేశాన్ని బోధించిన ప్రవక్త
హజరత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)1448వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక జరుపుకునే పూర్వదిన ఈద్-ఏ-మిలాద్-ఉన్- నబీ భక్తి ప్రపత్తులతో ఈ పవిత్రమైన పండుగను ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మిఠాయి లు పాయసం పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ముస్లిం మత పెద్ద షేక్ యూసుఫ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహే వసల్లం) బోధనలు మానవాళికి మార్గదర్శకం ఆయన చూపిన మార్గం శాంతి ప్రేమ సమానత్వం సహనానికి ప్రతీక మన జీవితాల్లో
ఆయన బోధనలను ఆచరిస్తే ప్రపంచం స్వర్గంలో మారుతుంది మత సామరస్యంతో పౌరస్వర గౌరవంతో మన గ్రామాన్ని దేశాన్ని అభివృద్ధి చేద్దాం ప్రతి ఒక్కరూ పరులకు సహాయం చేయాలి అదే ప్రవక్త చూపిన సత్యమార్గం అన్నారు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా షేక్ ఖాదర్ బాబా మాట్లాడు తూ ఒక్క విగ్రహము లేదు ఒక చిత్రపటం లేదు ఆయన గురించి 1500 ఏండ్లు గడిచిపోయిన ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న హృదయ విజేత మహమ్మద్ ప్రవక్త అని
కొనియాడారు ప్రపంచ శాంతికి మానవాళి మేలుకోసం ప్రవక్త మహమ్మద్ చూపిన ప్రేమ శాంతి ధర్మం మార్గంలో నడవడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి వారి బోధనలను మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ అందరితో ప్రేమగా మెలుగుతూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం ఖాదర్ బాబా అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ ఫకీర్ షేక్ యాకూబ్ షేక్ బాబా మహమ్మద్ యూసుఫ్ షేక్ పాష మహమ్మద్ ఇర్ఫాన్ షేక్ ఫయాజ్ షేక్ జానీ మియా తదితరులు పాల్గొన్నారు.
- రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు1
- ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.1
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- కమలాపూర్‌లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్‌కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.2
- మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.3
- ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి.. అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు3