logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాలపేట బ్రిడ్జి పనుల్లో ప్రమాదం కార్మికులకు గాయాలు, నిర్లక్ష్యంపై ఆగ్రహం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలో రాలపేట బ్రిడ్జి వద్ద థర్డ్ లైన్ పనుల్లో 08-04-2026 మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. అసిఫాబాద్ రోడ్–సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ల మధ్య గిర్డర్ అమర్చే సమయంలో జాక్ ఫెయిల్ కావడంతో అది వంగిపడి కార్మికులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన రవి బసాక్‌ను మెరుగైన చికిత్సకు తరలించగా, కన్నయ్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, రక్షణ పరికరాల లేమి కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి ఉచిత వైద్యం, నష్టపరిహారం అందించాలని సీపీఎం నాయకుడు ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

9 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
9 hrs ago

రాలపేట బ్రిడ్జి పనుల్లో ప్రమాదం కార్మికులకు గాయాలు, నిర్లక్ష్యంపై ఆగ్రహం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలో రాలపేట బ్రిడ్జి వద్ద థర్డ్ లైన్ పనుల్లో 08-04-2026 మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. అసిఫాబాద్ రోడ్–సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ల మధ్య గిర్డర్ అమర్చే సమయంలో జాక్ ఫెయిల్ కావడంతో అది వంగిపడి కార్మికులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన రవి బసాక్‌ను మెరుగైన

చికిత్సకు తరలించగా, కన్నయ్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, రక్షణ పరికరాల లేమి కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి ఉచిత వైద్యం, నష్టపరిహారం అందించాలని సీపీఎం నాయకుడు ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ లో అగ్ని ప్రమాదాలను శాటిలైట్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మ రావు తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ రేంజ్ 60 శాతం కొండలు, గుట్టలతో నిండి ఉందన్నారు. కొండలు గుట్టలపై జరిగే అగ్ని ప్రమాదాలను శాటిలైట్ ద్వారా గుర్తించి అటవీ సిబ్బంది ఆర్పివేస్తున్నారని తెలిపారు. 700 అడుగుల పైన ఉండే కొండల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నామన్నారు.
    1
    దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ లో అగ్ని ప్రమాదాలను శాటిలైట్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మ రావు తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ రేంజ్ 60 శాతం కొండలు, గుట్టలతో నిండి ఉందన్నారు. కొండలు గుట్టలపై జరిగే అగ్ని ప్రమాదాలను శాటిలైట్ ద్వారా గుర్తించి అటవీ సిబ్బంది ఆర్పివేస్తున్నారని తెలిపారు. 700 అడుగుల పైన ఉండే కొండల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నామన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసన మండలి గౌరవ ప్రతిపక్ష నాయకులు మరియు తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రం మరియు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసన మండలి గౌరవ ప్రతిపక్ష నాయకులు మరియు తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రం మరియు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    15 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల శిశువు మృతి కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష పురిటి నొప్పులతో శనివారం ఆస్పత్రుల్లో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల బాబు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన తర్వాత డాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళిన డాక్టరు సోమవారం వచ్చి చూశాడని ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని, పుట్టినప్పటి నుంచే బాబు హెల్దీగా లేడని అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల శిశువు మృతి కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష పురిటి నొప్పులతో శనివారం ఆస్పత్రుల్లో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల బాబు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన తర్వాత డాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళిన డాక్టరు సోమవారం వచ్చి చూశాడని ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని, పుట్టినప్పటి నుంచే బాబు హెల్దీగా లేడని అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :08.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి పరిధిలోని పల్లె దవాఖాన శాబ్ధిపూర్‌లో గ్రామ ఆరోగ్య, పోషణ, పారిశుధ్య దినోత్సవం (VHNSD) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై పల్లె దవాఖాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యను దృష్టిలో ఉంచుకొని, కలెక్టర్ సమక్షంలో ఒక గర్భిణీ స్త్రీకి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించారు. అలాగే షుగర్ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు. గ్రామ జనాభా ప్రాతిపదికన గర్భిణీ స్త్రీల నమోదు పూర్తి స్థాయిలో చేయాలని, పిల్లలకు సమయానుకూలంగా టీకాలు అందించాలని సూచించారు. పోషణ, సీజనల్ వ్యాధులు, క్షయ (TB), లెప్రసీ వంటి వ్యాధులపై గ్రామ సర్పంచ్, హెల్త్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. డి. రవీందర్ గౌడ్ , ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాజు , మెడికల్ ఆఫీసర్, డీపీఓ పద్మజ , స్థానిక సర్పంచ్ , మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :08.04.2026
కామారెడ్డి జిల్లా బుధవారం 
"ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి పరిధిలోని పల్లె దవాఖాన శాబ్ధిపూర్‌లో గ్రామ ఆరోగ్య, పోషణ, పారిశుధ్య దినోత్సవం (VHNSD) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గ గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై పల్లె దవాఖాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యను దృష్టిలో ఉంచుకొని, కలెక్టర్  సమక్షంలో ఒక గర్భిణీ స్త్రీకి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించారు. అలాగే షుగర్ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు.
గ్రామ జనాభా ప్రాతిపదికన గర్భిణీ స్త్రీల నమోదు పూర్తి స్థాయిలో చేయాలని, పిల్లలకు సమయానుకూలంగా టీకాలు అందించాలని సూచించారు. పోషణ, సీజనల్ వ్యాధులు, క్షయ (TB), లెప్రసీ వంటి వ్యాధులపై గ్రామ సర్పంచ్, హెల్త్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. డి. రవీందర్ గౌడ్ , ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాజు , మెడికల్ ఆఫీసర్, డీపీఓ  పద్మజ , స్థానిక సర్పంచ్ , మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో గురువారం దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తలుపులు బిగించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం ప్రజలు, పోలీసులు కలిసి పని చేయాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని అవగాహన పొందారు.
    1
    కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో గురువారం దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తలుపులు బిగించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం ప్రజలు, పోలీసులు కలిసి పని చేయాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని అవగాహన పొందారు.
    user_Anil Patel
    Anil Patel
    Reporter నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • హనుమకొండ ఇన్సూరెన్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ బషిపల్లి రాముడు గారు ప్రతిష్టాత్మకమైన 'స్పార్క్ అవార్డు' (Spark Award) అందుకున్నారు. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ సంయుక్తంగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి. ​అసాధారణ లక్ష్యాన్ని చేరుకున్న రాముడు ​వ్యాపార రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న రాముడు గారు, నిర్ణీత గడువులోగా 25 లక్షల రూపాయల గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) వార్షిక వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన చూపిన స్థిరమైన నిబద్ధత మరియు అద్భుతమైన పనితీరు ఈ ఘనత సాధించడానికి దోహదపడ్డాయి. ​నాయకత్వానికి దక్కిన గుర్తింపు ​కేవలం వ్యాపార లక్ష్యాలనే కాకుండా, ఒక ఉత్తమ మెంటార్‌గా ఎందరో యువ వృత్తి నిపుణులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ విజయ యాత్రలో ఆయన పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ​శుభాకాంక్షల వెల్లువ ​ఈ సందర్భంగా టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ​"మీరు మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము." అని వారు తమ సందేశంలో పేర్కొన్నారు. ​రాముడు గారి ఈ విజయం పట్ల తోటి సహచరులు మరియు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    హనుమకొండ ఇన్సూరెన్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ బషిపల్లి రాముడు గారు ప్రతిష్టాత్మకమైన 'స్పార్క్ అవార్డు' (Spark Award) అందుకున్నారు. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ సంయుక్తంగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి.
​అసాధారణ లక్ష్యాన్ని చేరుకున్న రాముడు
​వ్యాపార రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న రాముడు గారు, నిర్ణీత గడువులోగా 25 లక్షల రూపాయల గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) వార్షిక వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన చూపిన స్థిరమైన నిబద్ధత మరియు అద్భుతమైన పనితీరు ఈ ఘనత సాధించడానికి దోహదపడ్డాయి.
​నాయకత్వానికి దక్కిన గుర్తింపు
​కేవలం వ్యాపార లక్ష్యాలనే కాకుండా, ఒక ఉత్తమ మెంటార్‌గా ఎందరో యువ వృత్తి నిపుణులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ విజయ యాత్రలో ఆయన పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.
​శుభాకాంక్షల వెల్లువ
​ఈ సందర్భంగా టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.
​"మీరు మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము." అని వారు తమ సందేశంలో పేర్కొన్నారు.
​రాముడు గారి ఈ విజయం పట్ల తోటి సహచరులు మరియు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_Parushuram గౌడ్
    Parushuram గౌడ్
    Singer ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • కాగజ్‌నగర్ మండలం సీతనగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజ ఆనంద్ కుమార్ సమావేశమయ్యారు. ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు లేకపోవడాన్ని ఖండించారు. గత ఏడాది కూలి బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, సదుపాయాలు కల్పించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
    3
    కాగజ్‌నగర్ మండలం సీతనగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజ ఆనంద్ కుమార్ సమావేశమయ్యారు. ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు లేకపోవడాన్ని ఖండించారు. గత ఏడాది కూలి బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, సదుపాయాలు కల్పించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • సింగరేణిలో మెడికల్ బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మీడియా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు 3 మెడికల్ బోర్డులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే రెండు మెడికల్ బోర్డు నిర్వహించిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో మెడికల్ బోర్డులో అవకతవకులు జరిగాయని, దానిపై విజిలెన్స్ అధికారులచే విచారణ చేపడుతామన్నారు. దాన్ని సాకుగా తీసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి అన్ ఫిట్ అయిన వారి వారసులకు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర సాయిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ రానున్న రోజుల్లో నిరసనలు చేపడుందని తెలిపారు.
    1
    సింగరేణిలో  మెడికల్ బోర్డును  రద్దు చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మీడియా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు 3 మెడికల్ బోర్డులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే రెండు మెడికల్ బోర్డు నిర్వహించిందని విమర్శించారు. 
గత ప్రభుత్వంలో మెడికల్ బోర్డులో అవకతవకులు జరిగాయని, దానిపై విజిలెన్స్ అధికారులచే విచారణ చేపడుతామన్నారు.
దాన్ని సాకుగా తీసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి అన్ ఫిట్ అయిన వారి వారసులకు  నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర సాయిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ రానున్న రోజుల్లో నిరసనలు చేపడుందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :08.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా, IDOC సమావేశ మందిరంలో సురక్షిత మాతృత్వం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లి, శిశు ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైన అంశమని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ప్రసూతి సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఆరోగ్య సిబ్బంది గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు గ్రామ స్థాయిలో గర్భిణీలను గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, పోషకాహారం, టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సురక్షిత మాతృత్వం పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్ లో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవానికి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత, అలాగే తల్లి, శిశువు సురక్షితంగా ఉండే విధానాలపై అవగాహన పెంపొందించడం. కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని, గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే సమస్యలు, వాటి నివారణ మార్గాలు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే సురక్షిత ప్రసవం కోసం ఆసుపత్రుల్లోనే ప్రసవం జరగాలని సూచించారు. ఈ వర్క్‌షాప్‌ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ సమాజంలో సురక్షిత మాతృత్వంపై అవగాహన పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో dmho రవీందర్, వైద్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :08.04.2026
కామారెడ్డి జిల్లా బుధవారం 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా, IDOC సమావేశ మందిరంలో సురక్షిత మాతృత్వం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి  కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లి, శిశు ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైన అంశమని ఆయన అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ప్రసూతి సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఆరోగ్య సిబ్బంది గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు.
అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు గ్రామ స్థాయిలో గర్భిణీలను గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, పోషకాహారం, టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా సురక్షిత మాతృత్వం పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్ లో 
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవానికి ముందు  తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత, అలాగే తల్లి, శిశువు సురక్షితంగా ఉండే విధానాలపై అవగాహన పెంపొందించడం.
కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని, గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే సమస్యలు, వాటి నివారణ మార్గాలు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే సురక్షిత ప్రసవం కోసం ఆసుపత్రుల్లోనే ప్రసవం జరగాలని సూచించారు.
ఈ వర్క్‌షాప్‌  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ సమాజంలో సురక్షిత మాతృత్వంపై అవగాహన పెంపొందుతుందని  నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  dmho  రవీందర్, వైద్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.