Shuru
Apke Nagar Ki App…
సీతనగర్‌లో ఉపాధి కూలీల సమస్యలు చెల్లింపులు, సదుపాయాలపై ఆగ్రహం కాగజ్‌నగర్ మండలం సీతనగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజ ఆనంద్ కుమార్ సమావేశమయ్యారు. ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు లేకపోవడాన్ని ఖండించారు. గత ఏడాది కూలి బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, సదుపాయాలు కల్పించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Krishna
సీతనగర్‌లో ఉపాధి కూలీల సమస్యలు చెల్లింపులు, సదుపాయాలపై ఆగ్రహం కాగజ్‌నగర్ మండలం సీతనగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజ ఆనంద్ కుమార్ సమావేశమయ్యారు. ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు లేకపోవడాన్ని ఖండించారు. గత ఏడాది కూలి బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, సదుపాయాలు కల్పించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- कुमुराम भीम आसिफाबाद ज़िले में कागजनगर के पास पेद्दावागु पर रेलवे ब्रिज बनाते समय एक हादसा हुआ। तीसरी रेलवे लाइन बनाने का काम चल रहा था, तभी तीन मज़दूर ऊपर से गिर गए। ब्रिज के बीच में फंसने से एक मज़दूर गंभीर रूप से घायल हो गया। मौके पर पहुंची मेडिकल टीम ने उसे फर्स्ट एड और ऑक्सीजन सपोर्ट दिया। बताया जा रहा है कि ज़्यादा खून बहने और शरीर के अंगों में चोट लगने की वजह से उसकी हालत गंभीर है। दो और मज़दूर भी घायल हुए हैं, जिनका इलाज पास के हॉस्पिटल में चल रहा है। स्थानीय लोगों और साथी मज़दूरों ने बचाव अभियान में हिस्सा लिया और घायलों को बाहर निकाला। हादसे के तुरंत बाद काम कुछ समय के लिए रोक दिया गया और अधिकारी सुरक्षा की स्थिति की जांच कर रहे हैं। मज़दूरों का आरोप है कि यह हादसा कॉन्ट्रैक्टर की लापरवाही की वजह से हुआ। उनका कहना है कि यह हादसा काम की जगह पर कम से कम सुरक्षा स्टैंडर्ड का पालन न करने और सुरक्षा उपकरणों की कमी की वजह से हुआ। वे ज़िम्मेदार लोगों के खिलाफ़ सख्त कार्रवाई और कंस्ट्रक्शन के काम में सुरक्षा नियमों को सख्ती से लागू करने की मांग कर रहे हैं।1
- దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం సమీపంలో ఆగివున్న టిప్పర్ లో మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం దేవాలయం స్వామిలో ఆగివున్న టిప్పర్లో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయని, షాట్ సర్క్యూట్ తో మంటలు వచ్చి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- పేదలకు వైద్య పరంగా సేవలు అందించడమే తన ధ్యేయమని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* అన్నారు.బుధవారం ఎస్. ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో *నియోజకవర్గం లోని 144 మంది లబ్ధిదారులకు 35 లక్షల 50 వేల రూపాయల* చెక్కులను పంపిణి చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.తాను ఎమ్మెల్యే గా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు 4వేల మంది కి పైగా లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి కింద సహాయం చేయడం జరిగిందన్నారు.అదే విధంగా నిమ్స్ ఆసుపత్రి లో వైద్య సేవల కోసం 400 మందికి ఎల్. వో. సి లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలను ఆదుకోవడానికి తన నివాసం లో ప్రత్యేకంగా సీఎం సహాయ నిధి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిం ద న్నారు. విద్యా వైద్యం సాగునీరు అందించడం ధ్యేయంగా తాను ముందుకు సాగుతున్నానని అందులో భాగంగానే ముఖ్య మంత్రి కి విన్నవించడం తో నియోజకవర్గానికి 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించుకోబోతున్నామన్నారు. బాసర లో అమ్మ వారి ఆలయానికి 225 కోట్లు రావడం ముఖ్య మంత్రి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, నియోజకవర్గం లో ఆసుపత్రుల అభివృద్ధి, 28 ప్యాకేజీ కి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తానూర్ కుభీర్ మండలాలు సస్యశామలంగా మారుతాయన్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి తో పాటు. పలువురు సీనియర్ నాయకులు, బిజెపి నాయకులు ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.4
- గారేపల్లి, ఏప్రిల్ 8: గారేపల్లి-మహాదేవపూర్ జాతీయ రహదారిపై చిన్నవాగు సమీపంలో కోడి వ్యర్థాలను విచ్చలవిడిగా పారబోస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చికెన్ వ్యాపార నిర్వహకులు నిర్లక్ష్యంగా ఈ వ్యర్థాలను పారబోస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ వ్యర్థాల నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా హైవేపై ప్రయాణించే వాహనదారులు, సమీప రైతులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పరిస్థితి మరింత విషమిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి హానికరంగా మారుతున్న ఈ చర్యలపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.1
- కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి టోర్నమెంట్ నిర్వహణ కొరకు చేపట్టిన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలలో, పట్టణం లలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి సీఎం కప్ వంటి టోర్నమెంట్లను నిర్వహించి క్రీడా అభివృద్ధికి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేశారు. నేడు అనేక చోట్ల ఈ క్రీడా ప్రాంగణాలు ఆదరణకు దూరమై వాటి స్వరూపాలను కోల్పోయాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిర్వహించాల్సిన పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాలను బాగుపరిచి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువత, విద్యార్థులు వారి వార్షిక పరీక్షలు ముగించుకొని వేసవి సెలవుల్లో ఉండనున్నారు కాబట్టి యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా గౌరవ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆలోచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలు 12 మండలాల వారిగా దాదాపు 25 వందల మంది క్రీడాకారులు పాల్గొనేలా ఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు కెసిఆర్ కప్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డుల నుండి వచ్చే క్రీడాకారుల మధ్య టోర్నమెంట్ నిర్వహించడం కోసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి టోర్నమెంట్ నిర్వహణకు అనుగుణంగా వివిధ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ పాల్గొనాలని ఇలాంటి టోర్నమెంట్లను ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రతి రెండు వార్డులకు ఒక జట్టును ఎంపిక చేసి ఆ క్రికెట్ జట్ల మధ్య పోటీ నిర్వహించి సిరిసిల్ల పురపాలక సంఘం నుండి విజేతలుగా నిలిచిన జట్టు జిల్లా స్థాయిలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు పంపించడం జరుగుతుందని ఇందులో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులు పాల్గొని జిల్లా స్థాయిలో కేసీఆర్ కప్ ను గెలుచుకునేలా వారి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు .1
- 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి స్వగ్రామం కోరుట్ల కు చేరుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్వంత ఇంటికి చేరుకున్న దేవ్ జీ బావోద్వేగానికి గురయ్యారు. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా కుటుంబ సభ్యులు తిరుపతి కి నుదుట తిలకం దిద్ది మంగళహారతితో స్వాగతం పలికారు. తల్లిదండ్రుల ఫోటోకు దండం పెట్టి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. బంధుమిత్రులు గుండెలకు హత్తుకుని ఆత్మీయ సత్కారం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ దేవ్ జీ కాసేపు ఆవేదనతో, ఆనందంతో స్పందించారు. తిరిగోస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాలేజీ స్టూడెంట్ గా అజ్ఞాతంలోకి పోయానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ తెలుసని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా అంతరాలు ఉండకూడదని కుల మత ప్రాంతాల అంతరాలు ఉండొద్దని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని తెలిపారు. నాకంటూ కుటుంబం లేదని, కోరుట్ల ప్రజలే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబసభ్యులని తెలిపారు. ఇల్లు ఎంత ముఖ్యమో, దేశం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నానని తెలిపారు. ప్రజల కోసమే తాను పని చేస్తానని, తన సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. బైట్ - దేవ్ జీ - మావోయిస్టు పార్టీ మాజీ నేత.2
- ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ... రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ లో విరాళాల సేకరణ రెండో రోజు సందర్భంగా ప్రజా పోరాటాల కోసం నిత్యం సిపిఐ పోరాడుతుందని పేద మధ్యతరగతి ప్రజల కోసం నిత్యం ఉద్యమాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అదేవిధంగా సామాన్యులు జీవించే హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆమె అన్నారు కార్మికుల విద్యార్థుల కర్షకుల మేధావుల గొంతులను ప్రశ్నించే గొంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నారని ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరుద్యోగులకు విద్యార్థులకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆమె అన్నారు ప్రజా సమస్య పరిష్కరించుకుంటే భారత కమ్యూనిస్టు పార్టీగా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తామని ఆమె కింద రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి . ఎల్. దశరథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్ సిపిఐ నాయకులు ప్రవీణ్ సాయిలు ఆముదాల గంగాధర్. ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపత్ శివప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలో రాలపేట బ్రిడ్జి వద్ద థర్డ్ లైన్ పనుల్లో 08-04-2026 మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. అసిఫాబాద్ రోడ్–సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ల మధ్య గిర్డర్ అమర్చే సమయంలో జాక్ ఫెయిల్ కావడంతో అది వంగిపడి కార్మికులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన రవి బసాక్‌ను మెరుగైన చికిత్సకు తరలించగా, కన్నయ్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, రక్షణ పరికరాల లేమి కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి ఉచిత వైద్యం, నష్టపరిహారం అందించాలని సీపీఎం నాయకుడు ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.2