कागजनगर पेद्दावागु ब्रिज वर्क्स में हादसा: तीन मज़दूर घायल, एक की हालत गंभीर कुमुराम भीम आसिफाबाद ज़िले में कागजनगर के पास पेद्दावागु पर रेलवे ब्रिज बनाते समय एक हादसा हुआ। तीसरी रेलवे लाइन बनाने का काम चल रहा था, तभी तीन मज़दूर ऊपर से गिर गए। ब्रिज के बीच में फंसने से एक मज़दूर गंभीर रूप से घायल हो गया। मौके पर पहुंची मेडिकल टीम ने उसे फर्स्ट एड और ऑक्सीजन सपोर्ट दिया। बताया जा रहा है कि ज़्यादा खून बहने और शरीर के अंगों में चोट लगने की वजह से उसकी हालत गंभीर है। दो और मज़दूर भी घायल हुए हैं, जिनका इलाज पास के हॉस्पिटल में चल रहा है। स्थानीय लोगों और साथी मज़दूरों ने बचाव अभियान में हिस्सा लिया और घायलों को बाहर निकाला। हादसे के तुरंत बाद काम कुछ समय के लिए रोक दिया गया और अधिकारी सुरक्षा की स्थिति की जांच कर रहे हैं। मज़दूरों का आरोप है कि यह हादसा कॉन्ट्रैक्टर की लापरवाही की वजह से हुआ। उनका कहना है कि यह हादसा काम की जगह पर कम से कम सुरक्षा स्टैंडर्ड का पालन न करने और सुरक्षा उपकरणों की कमी की वजह से हुआ। वे ज़िम्मेदार लोगों के खिलाफ़ सख्त कार्रवाई और कंस्ट्रक्शन के काम में सुरक्षा नियमों को सख्ती से लागू करने की मांग कर रहे हैं।
कागजनगर पेद्दावागु ब्रिज वर्क्स में हादसा: तीन मज़दूर घायल, एक की हालत गंभीर कुमुराम भीम आसिफाबाद ज़िले में कागजनगर के पास पेद्दावागु पर रेलवे ब्रिज बनाते समय एक हादसा हुआ। तीसरी रेलवे लाइन बनाने का काम चल रहा था, तभी तीन मज़दूर ऊपर से गिर गए। ब्रिज के बीच में फंसने से एक मज़दूर गंभीर रूप से घायल हो गया। मौके पर पहुंची मेडिकल टीम ने उसे फर्स्ट एड और ऑक्सीजन सपोर्ट दिया। बताया जा रहा है कि ज़्यादा खून बहने और शरीर के अंगों में चोट लगने की वजह से उसकी हालत गंभीर है। दो और मज़दूर भी घायल हुए हैं, जिनका इलाज पास के हॉस्पिटल में चल रहा है। स्थानीय लोगों और साथी मज़दूरों ने बचाव अभियान में हिस्सा लिया और घायलों को बाहर निकाला। हादसे के तुरंत बाद काम कुछ समय के लिए रोक दिया गया और अधिकारी सुरक्षा की स्थिति की जांच कर रहे हैं। मज़दूरों का आरोप है कि यह हादसा कॉन्ट्रैक्टर की लापरवाही की वजह से हुआ। उनका कहना है कि यह हादसा काम की जगह पर कम से कम सुरक्षा स्टैंडर्ड का पालन न करने और सुरक्षा उपकरणों की कमी की वजह से हुआ। वे ज़िम्मेदार लोगों के खिलाफ़ सख्त कार्रवाई और कंस्ट्रक्शन के काम में सुरक्षा नियमों को सख्ती से लागू करने की मांग कर रहे हैं।
- దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ లో అగ్ని ప్రమాదాలను శాటిలైట్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మ రావు తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ రేంజ్ 60 శాతం కొండలు, గుట్టలతో నిండి ఉందన్నారు. కొండలు గుట్టలపై జరిగే అగ్ని ప్రమాదాలను శాటిలైట్ ద్వారా గుర్తించి అటవీ సిబ్బంది ఆర్పివేస్తున్నారని తెలిపారు. 700 అడుగుల పైన ఉండే కొండల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నామన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసన మండలి గౌరవ ప్రతిపక్ష నాయకులు మరియు తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రం మరియు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.1
- సింగరేణిలో మెడికల్ బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మీడియా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు 3 మెడికల్ బోర్డులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే రెండు మెడికల్ బోర్డు నిర్వహించిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో మెడికల్ బోర్డులో అవకతవకులు జరిగాయని, దానిపై విజిలెన్స్ అధికారులచే విచారణ చేపడుతామన్నారు. దాన్ని సాకుగా తీసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి అన్ ఫిట్ అయిన వారి వారసులకు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర సాయిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ రానున్న రోజుల్లో నిరసనలు చేపడుందని తెలిపారు.1
- పత్రిక ప్రకటన తేది :08.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి పరిధిలోని పల్లె దవాఖాన శాబ్ధిపూర్‌లో గ్రామ ఆరోగ్య, పోషణ, పారిశుధ్య దినోత్సవం (VHNSD) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై పల్లె దవాఖాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యను దృష్టిలో ఉంచుకొని, కలెక్టర్ సమక్షంలో ఒక గర్భిణీ స్త్రీకి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించారు. అలాగే షుగర్ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు. గ్రామ జనాభా ప్రాతిపదికన గర్భిణీ స్త్రీల నమోదు పూర్తి స్థాయిలో చేయాలని, పిల్లలకు సమయానుకూలంగా టీకాలు అందించాలని సూచించారు. పోషణ, సీజనల్ వ్యాధులు, క్షయ (TB), లెప్రసీ వంటి వ్యాధులపై గ్రామ సర్పంచ్, హెల్త్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. డి. రవీందర్ గౌడ్ , ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాజు , మెడికల్ ఆఫీసర్, డీపీఓ పద్మజ , స్థానిక సర్పంచ్ , మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో గురువారం దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తలుపులు బిగించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం ప్రజలు, పోలీసులు కలిసి పని చేయాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని అవగాహన పొందారు.1
- హనుమకొండ ఇన్సూరెన్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ బషిపల్లి రాముడు గారు ప్రతిష్టాత్మకమైన 'స్పార్క్ అవార్డు' (Spark Award) అందుకున్నారు. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ సంయుక్తంగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి. అసాధారణ లక్ష్యాన్ని చేరుకున్న రాముడు వ్యాపార రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న రాముడు గారు, నిర్ణీత గడువులోగా 25 లక్షల రూపాయల గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) వార్షిక వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన చూపిన స్థిరమైన నిబద్ధత మరియు అద్భుతమైన పనితీరు ఈ ఘనత సాధించడానికి దోహదపడ్డాయి. నాయకత్వానికి దక్కిన గుర్తింపు కేవలం వ్యాపార లక్ష్యాలనే కాకుండా, ఒక ఉత్తమ మెంటార్‌గా ఎందరో యువ వృత్తి నిపుణులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ విజయ యాత్రలో ఆయన పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. శుభాకాంక్షల వెల్లువ ఈ సందర్భంగా టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. "మీరు మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము." అని వారు తమ సందేశంలో పేర్కొన్నారు. రాముడు గారి ఈ విజయం పట్ల తోటి సహచరులు మరియు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- కాగజ్‌నగర్ మండలం సీతనగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజ ఆనంద్ కుమార్ సమావేశమయ్యారు. ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు లేకపోవడాన్ని ఖండించారు. గత ఏడాది కూలి బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, సదుపాయాలు కల్పించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.3
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైద్య విధాన పరిషత్ అవార్డుల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగు అవార్డులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సాధించింది. ప్రభుత్వ ఆసుపత్రి అవార్డులు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. అవార్డుల్లో భాగంగా సూపరింటెండెంట్, సివిల్ సర్జన్ డాక్టర్ కే. శ్రీధర్ ప్రథమ అవార్డు అందుకున్నారు. అలాగే 3 వేలకుపైగా ఆరోగ్యశ్రీ కేసులు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు రెండవ అవార్డు లభించింది. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించినందుకు మూడవ అవార్డు అందుకోగా, రేడియాలజీ విభాగం తరపున డాక్టర్ సంధ్యారాణి నాలుగో అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య బృందం తమకు లభించిన అవార్డులను జిల్లా కలెక్టర్ కు చూపించారు. కలెక్టర్ తన చాంబర్‌లో సూపరింటెండెంట్‌ను, వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని, సపోర్టింగ్ మరియు సానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.1
- పత్రిక ప్రకటన తేది :08.04.2026 కామారెడ్డి జిల్లా బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా, IDOC సమావేశ మందిరంలో సురక్షిత మాతృత్వం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లి, శిశు ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైన అంశమని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ప్రసూతి సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఆరోగ్య సిబ్బంది గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు గ్రామ స్థాయిలో గర్భిణీలను గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, పోషకాహారం, టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సురక్షిత మాతృత్వం పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్ లో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవానికి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత, అలాగే తల్లి, శిశువు సురక్షితంగా ఉండే విధానాలపై అవగాహన పెంపొందించడం. కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని, గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే సమస్యలు, వాటి నివారణ మార్గాలు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే సురక్షిత ప్రసవం కోసం ఆసుపత్రుల్లోనే ప్రసవం జరగాలని సూచించారు. ఈ వర్క్‌షాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ సమాజంలో సురక్షిత మాతృత్వంపై అవగాహన పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో dmho రవీందర్, వైద్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.1