logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్ర స్థాయి నాలుగు అవార్డులు సాధించిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి...వైద్యులను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైద్య విధాన పరిషత్ అవార్డుల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగు అవార్డులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సాధించింది. ప్రభుత్వ ఆసుపత్రి అవార్డులు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. అవార్డుల్లో భాగంగా సూపరింటెండెంట్, సివిల్ సర్జన్ డాక్టర్ కే. శ్రీధర్ ప్రథమ అవార్డు అందుకున్నారు. అలాగే 3 వేలకుపైగా ఆరోగ్యశ్రీ కేసులు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు రెండవ అవార్డు లభించింది. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించినందుకు మూడవ అవార్డు అందుకోగా, రేడియాలజీ విభాగం తరపున డాక్టర్ సంధ్యారాణి నాలుగో అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య బృందం తమకు లభించిన అవార్డులను జిల్లా కలెక్టర్ కు చూపించారు. కలెక్టర్ తన చాంబర్‌లో సూపరింటెండెంట్‌ను, వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని, సపోర్టింగ్ మరియు సానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

6 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
6 hrs ago

రాష్ట్ర స్థాయి నాలుగు అవార్డులు సాధించిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి...వైద్యులను అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైద్య విధాన పరిషత్ అవార్డుల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగు అవార్డులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సాధించింది. ప్రభుత్వ ఆసుపత్రి అవార్డులు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. అవార్డుల్లో భాగంగా సూపరింటెండెంట్, సివిల్ సర్జన్ డాక్టర్ కే. శ్రీధర్ ప్రథమ అవార్డు అందుకున్నారు. అలాగే 3 వేలకుపైగా ఆరోగ్యశ్రీ కేసులు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు రెండవ అవార్డు లభించింది. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించినందుకు మూడవ అవార్డు అందుకోగా, రేడియాలజీ విభాగం తరపున డాక్టర్ సంధ్యారాణి నాలుగో అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య బృందం తమకు లభించిన అవార్డులను జిల్లా కలెక్టర్ కు చూపించారు. కలెక్టర్ తన చాంబర్‌లో సూపరింటెండెంట్‌ను, వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని, సపోర్టింగ్ మరియు సానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి స్వగ్రామం కోరుట్ల కు చేరుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్వంత ఇంటికి చేరుకున్న దేవ్ జీ బావోద్వేగానికి గురయ్యారు. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా కుటుంబ సభ్యులు తిరుపతి కి నుదుట తిలకం దిద్ది మంగళహారతితో స్వాగతం పలికారు. తల్లిదండ్రుల ఫోటోకు దండం పెట్టి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. బంధుమిత్రులు గుండెలకు హత్తుకుని ఆత్మీయ సత్కారం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ దేవ్ జీ కాసేపు ఆవేదనతో, ఆనందంతో స్పందించారు. తిరిగోస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాలేజీ స్టూడెంట్ గా అజ్ఞాతంలోకి పోయానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ తెలుసని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా అంతరాలు ఉండకూడదని కుల మత ప్రాంతాల అంతరాలు ఉండొద్దని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని తెలిపారు. నాకంటూ కుటుంబం లేదని, కోరుట్ల ప్రజలే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబసభ్యులని తెలిపారు. ఇల్లు ఎంత ముఖ్యమో, దేశం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నానని తెలిపారు. ప్రజల కోసమే తాను పని చేస్తానని, తన సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. బైట్ - దేవ్ జీ - మావోయిస్టు పార్టీ మాజీ నేత.
    2
    40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి స్వగ్రామం కోరుట్ల కు చేరుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్వంత ఇంటికి చేరుకున్న  దేవ్ జీ బావోద్వేగానికి గురయ్యారు. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా కుటుంబ సభ్యులు తిరుపతి కి నుదుట తిలకం దిద్ది మంగళహారతితో స్వాగతం పలికారు. తల్లిదండ్రుల ఫోటోకు దండం  పెట్టి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. బంధుమిత్రులు గుండెలకు హత్తుకుని ఆత్మీయ సత్కారం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ దేవ్ జీ కాసేపు ఆవేదనతో, ఆనందంతో స్పందించారు. తిరిగోస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాలేజీ స్టూడెంట్ గా అజ్ఞాతంలోకి పోయానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ తెలుసని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా అంతరాలు ఉండకూడదని కుల మత ప్రాంతాల అంతరాలు ఉండొద్దని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని తెలిపారు. నాకంటూ కుటుంబం లేదని, కోరుట్ల ప్రజలే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబసభ్యులని తెలిపారు. ఇల్లు ఎంత ముఖ్యమో, దేశం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నానని తెలిపారు. ప్రజల కోసమే తాను పని చేస్తానని, తన సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పని చేస్తానని చెప్పారు.
బైట్ - దేవ్ జీ - మావోయిస్టు పార్టీ మాజీ నేత.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • హనుమకొండ ఇన్సూరెన్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ బషిపల్లి రాముడు గారు ప్రతిష్టాత్మకమైన 'స్పార్క్ అవార్డు' (Spark Award) అందుకున్నారు. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ సంయుక్తంగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి. ​అసాధారణ లక్ష్యాన్ని చేరుకున్న రాముడు ​వ్యాపార రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న రాముడు గారు, నిర్ణీత గడువులోగా 25 లక్షల రూపాయల గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) వార్షిక వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన చూపిన స్థిరమైన నిబద్ధత మరియు అద్భుతమైన పనితీరు ఈ ఘనత సాధించడానికి దోహదపడ్డాయి. ​నాయకత్వానికి దక్కిన గుర్తింపు ​కేవలం వ్యాపార లక్ష్యాలనే కాకుండా, ఒక ఉత్తమ మెంటార్‌గా ఎందరో యువ వృత్తి నిపుణులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ విజయ యాత్రలో ఆయన పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ​శుభాకాంక్షల వెల్లువ ​ఈ సందర్భంగా టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ​"మీరు మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము." అని వారు తమ సందేశంలో పేర్కొన్నారు. ​రాముడు గారి ఈ విజయం పట్ల తోటి సహచరులు మరియు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    హనుమకొండ ఇన్సూరెన్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ బషిపల్లి రాముడు గారు ప్రతిష్టాత్మకమైన 'స్పార్క్ అవార్డు' (Spark Award) అందుకున్నారు. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ సంయుక్తంగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి.
​అసాధారణ లక్ష్యాన్ని చేరుకున్న రాముడు
​వ్యాపార రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న రాముడు గారు, నిర్ణీత గడువులోగా 25 లక్షల రూపాయల గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) వార్షిక వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన చూపిన స్థిరమైన నిబద్ధత మరియు అద్భుతమైన పనితీరు ఈ ఘనత సాధించడానికి దోహదపడ్డాయి.
​నాయకత్వానికి దక్కిన గుర్తింపు
​కేవలం వ్యాపార లక్ష్యాలనే కాకుండా, ఒక ఉత్తమ మెంటార్‌గా ఎందరో యువ వృత్తి నిపుణులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ విజయ యాత్రలో ఆయన పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.
​శుభాకాంక్షల వెల్లువ
​ఈ సందర్భంగా టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.
​"మీరు మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము." అని వారు తమ సందేశంలో పేర్కొన్నారు.
​రాముడు గారి ఈ విజయం పట్ల తోటి సహచరులు మరియు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_Parushuram గౌడ్
    Parushuram గౌడ్
    Singer ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి టోర్నమెంట్ నిర్వహణ కొరకు చేపట్టిన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలలో, పట్టణం లలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి సీఎం కప్ వంటి టోర్నమెంట్లను నిర్వహించి క్రీడా అభివృద్ధికి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేశారు. నేడు అనేక చోట్ల ఈ క్రీడా ప్రాంగణాలు ఆదరణకు దూరమై వాటి స్వరూపాలను కోల్పోయాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిర్వహించాల్సిన పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాలను బాగుపరిచి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువత, విద్యార్థులు వారి వార్షిక పరీక్షలు ముగించుకొని వేసవి సెలవుల్లో ఉండనున్నారు కాబట్టి యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా గౌరవ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆలోచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలు 12 మండలాల వారిగా దాదాపు 25 వందల మంది క్రీడాకారులు పాల్గొనేలా ఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు కెసిఆర్ కప్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డుల నుండి వచ్చే క్రీడాకారుల మధ్య టోర్నమెంట్ నిర్వహించడం కోసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి టోర్నమెంట్ నిర్వహణకు అనుగుణంగా వివిధ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ పాల్గొనాలని ఇలాంటి టోర్నమెంట్లను ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రతి రెండు వార్డులకు ఒక జట్టును ఎంపిక చేసి ఆ క్రికెట్ జట్ల మధ్య పోటీ నిర్వహించి సిరిసిల్ల పురపాలక సంఘం నుండి విజేతలుగా నిలిచిన జట్టు జిల్లా స్థాయిలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు పంపించడం జరుగుతుందని ఇందులో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులు పాల్గొని జిల్లా స్థాయిలో కేసీఆర్ కప్ ను గెలుచుకునేలా వారి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు .
    1
    కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి టోర్నమెంట్ నిర్వహణ కొరకు చేపట్టిన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలలో, పట్టణం లలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి సీఎం కప్ వంటి టోర్నమెంట్లను నిర్వహించి క్రీడా అభివృద్ధికి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేశారు. నేడు అనేక చోట్ల ఈ క్రీడా ప్రాంగణాలు ఆదరణకు దూరమై వాటి స్వరూపాలను కోల్పోయాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిర్వహించాల్సిన పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాలను బాగుపరిచి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువత, విద్యార్థులు వారి వార్షిక పరీక్షలు ముగించుకొని వేసవి సెలవుల్లో ఉండనున్నారు కాబట్టి యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా గౌరవ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆలోచనల మేరకు రాజన్న  సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలు 12 మండలాల వారిగా దాదాపు 25 వందల మంది క్రీడాకారులు పాల్గొనేలా ఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు కెసిఆర్ కప్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్  నిర్వహించేలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డుల నుండి వచ్చే క్రీడాకారుల మధ్య టోర్నమెంట్ నిర్వహించడం కోసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి టోర్నమెంట్ నిర్వహణకు అనుగుణంగా వివిధ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ పాల్గొనాలని ఇలాంటి టోర్నమెంట్లను ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రతి రెండు వార్డులకు ఒక జట్టును ఎంపిక చేసి ఆ క్రికెట్ జట్ల మధ్య పోటీ నిర్వహించి సిరిసిల్ల పురపాలక సంఘం నుండి విజేతలుగా నిలిచిన జట్టు జిల్లా స్థాయిలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు పంపించడం జరుగుతుందని ఇందులో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులు పాల్గొని జిల్లా స్థాయిలో కేసీఆర్ కప్ ను గెలుచుకునేలా వారి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు .
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలో తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జనగామ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట కార్మికులు విధుల బహిష్కరణ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఛైర్మన్ మాట్ల ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సరైన పదోన్నతులు, ప్రయోజనాలు అందలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలో తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జనగామ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట కార్మికులు విధుల బహిష్కరణ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డివిజన్ ఛైర్మన్ మాట్ల ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సరైన పదోన్నతులు, ప్రయోజనాలు అందలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజీ ప్రభు ఉపాధ్యక్షులు భూమని ప్రశాంత్ డాకాని భానుచంద్రం జనరల్ సెక్రటరీ డాకాని నర్సింగ్ రావు జాయింట్ సెక్రటరీ చిన్నోల్లా రామచంద్రం సెక్రటరీ సైదామోల్లా లింగం క్యాషీర్ గుండ్ర రామచంద్రం ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూజీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళిత వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం పోరాడారు. సుమారు ముపై ఏండ్ల పైగా రాజకీయ ప్రస్థానం సమర్ధవంతంగా నిర్వహించి దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా చదువుకునే రోజుల్లో నే కుల వివక్షతను ఎదురుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్లు శివల నీలం గుండ్ర నరసింహులు చల్ల శ్రీనివాస్ భూమిని రాములు గజ్వేల్ గుండ్ర యాదగిరి సాయిలు సోము యాదగిరి గజ్వేల్ స్వామి ఈదొల్ల కృష్ణ రవి క్యాసారం రాజు సైదుమొల్ల లింగం మాజీ ఆటో ప్రెసిడెంట్ బద్రి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం    అధ్యక్షులు రాజీ ప్రభు ఉపాధ్యక్షులు భూమని ప్రశాంత్ డాకాని భానుచంద్రం జనరల్ సెక్రటరీ డాకాని నర్సింగ్ రావు జాయింట్ సెక్రటరీ చిన్నోల్లా రామచంద్రం సెక్రటరీ సైదామోల్లా లింగం క్యాషీర్ గుండ్ర రామచంద్రం ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూజీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళిత వర్గాల హక్కుల కోసం సామాజిక  న్యాయం పోరాడారు. సుమారు ముపై ఏండ్ల పైగా రాజకీయ ప్రస్థానం సమర్ధవంతంగా నిర్వహించి దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా చదువుకునే రోజుల్లో నే కుల వివక్షతను ఎదురుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్లు శివల నీలం గుండ్ర నరసింహులు చల్ల శ్రీనివాస్  భూమిని రాములు గజ్వేల్ గుండ్ర యాదగిరి సాయిలు సోము యాదగిరి గజ్వేల్ స్వామి ఈదొల్ల  కృష్ణ రవి క్యాసారం రాజు సైదుమొల్ల లింగం మాజీ ఆటో ప్రెసిడెంట్ బద్రి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • మూడు చెక్కలపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు బావికి కొత్త మోటర్‌ను ఏర్పాటు చేశారు. అంగోతు కోటియా ఇంటి సమీపంలో అమర్చిన ఈ మోటర్ ద్వారా గ్రామస్థులకు నీటి సరఫరా సులభమైంది. ఈ సందర్భంగా సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ మాట్లాడుతూ, నీటిని వృథా చేయకుండా బాధ్యతతో వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    మూడు చెక్కలపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు బావికి కొత్త మోటర్‌ను ఏర్పాటు చేశారు. అంగోతు కోటియా ఇంటి సమీపంలో అమర్చిన ఈ మోటర్ ద్వారా గ్రామస్థులకు నీటి సరఫరా సులభమైంది.
ఈ సందర్భంగా సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ మాట్లాడుతూ, నీటిని వృథా చేయకుండా బాధ్యతతో వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల శిశువు మృతి కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష పురిటి నొప్పులతో శనివారం ఆస్పత్రుల్లో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల బాబు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన తర్వాత డాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళిన డాక్టరు సోమవారం వచ్చి చూశాడని ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని, పుట్టినప్పటి నుంచే బాబు హెల్దీగా లేడని అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల శిశువు మృతి కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష పురిటి నొప్పులతో శనివారం ఆస్పత్రుల్లో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల బాబు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన తర్వాత డాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళిన డాక్టరు సోమవారం వచ్చి చూశాడని ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని, పుట్టినప్పటి నుంచే బాబు హెల్దీగా లేడని అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.