Shuru
Apke Nagar Ki App…
- *💥భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది* - *♻️రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నాడు* - *🌾రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ* - _మాజీ మంత్రుల అరెస్టుపై స్పందించిన..._ - పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ కో- ఆర్డినేటర్ - *▓𝆺𝅥⃝༏➨జోగు గోపి* - ▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
Tagore
- *💥భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది* - *♻️రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నాడు* - *🌾రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ* - _మాజీ మంత్రుల అరెస్టుపై స్పందించిన..._ - పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ కో- ఆర్డినేటర్ - *▓𝆺𝅥⃝༏➨జోగు గోపి* - ▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒▒
More news from తెలంగాణ and nearby areas
- Post by Tagore1
- ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజీ ప్రభు ఉపాధ్యక్షులు భూమని ప్రశాంత్ డాకాని భానుచంద్రం జనరల్ సెక్రటరీ డాకాని నర్సింగ్ రావు జాయింట్ సెక్రటరీ చిన్నోల్లా రామచంద్రం సెక్రటరీ సైదామోల్లా లింగం క్యాషీర్ గుండ్ర రామచంద్రం ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూజీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళిత వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం పోరాడారు. సుమారు ముపై ఏండ్ల పైగా రాజకీయ ప్రస్థానం సమర్ధవంతంగా నిర్వహించి దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా చదువుకునే రోజుల్లో నే కుల వివక్షతను ఎదురుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్లు శివల నీలం గుండ్ర నరసింహులు చల్ల శ్రీనివాస్ భూమిని రాములు గజ్వేల్ గుండ్ర యాదగిరి సాయిలు సోము యాదగిరి గజ్వేల్ స్వామి ఈదొల్ల కృష్ణ రవి క్యాసారం రాజు సైదుమొల్ల లింగం మాజీ ఆటో ప్రెసిడెంట్ బద్రి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- Post by Ali ammu1
- నకిరేకల్: రైతుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యేనే అన్నదాతలపై భౌతిక దాడులకు దిగడం అత్యంత సిగ్గుచేటని, ఇది అహంకారానికి పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నార్కట్‌పల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఓ రైతు తాను పండించిన సన్న వడ్లు కొనుగోలు చేయాలని కోరినందుకు సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, అందరూ చూస్తుండగానే సదరు రైతుపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టడం దురదృష్టకరమన్నారు. అంతటితో ఆగకుండా, తనను ఎందుకు కొట్టావని ప్రశ్నించేందుకు కారు వద్దకు వచ్చిన రైతుపై రెండోసారి దాడికి యత్నించి, కాలుతో తన్నబోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై అక్కడున్న రైతులు ఒక్కసారిగా తిరగబడటంతో ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారని (పలాయనం చిత్తగించారని) లింగయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు అడిగిన రైతులపై దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రైతులపై దాడికి పాల్పడిన వీరేశంను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ ధోరణులను అరికట్టి రైతులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండ్యం సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, పల్లె విజయ్, గుర్రం గణేష్ తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ వర్ధన్నపేట సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి సాయిలు మాట్లాడుతూ, సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐకి ప్రజలు ఆర్థికంగా సహకరించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సిపిఐ కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.1
- తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిసన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా కరీంనగర్ లోని ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరాహారదీక్ష తో ధర్నా చేశారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. టీజీఎన్ఫీడిసీఎల్, టీజిఎస్పీడీసీఎల్ లో అన్ మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేయాలని, 2026 పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్నవారిని ఆర్టిసన్ గా గుర్తించాలని కోరారు. విద్యుత్ సంస్థలు బ్రిటిష్ కాలం నాటి విధానాలే కొనసాగుతున్నాయని పాలకులు, ప్రభుత్వాలు మారిన తమ బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు G.O.No.11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.2
- గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Tagore1